ఉత్ప‌త్తుల రంగంలో వృద్ధి

అంత‌ర్జాతీయంగా మాంద్యం ప‌రిస్థితులు నెల‌కొని దాని ప్ర‌భావంగా భార‌త ఆర్థిక వృద్ధి రేటు మంద‌గ‌మ‌నంలో వున్న ప్ర‌స్తుత త‌రుణంలో డిమాండ్ పెర‌గ‌టం మూలంగా ఈ జ‌న‌వ‌రిలో భార‌త ఉత్ప‌త్తుల రంగం పుంజుకోవ‌టం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు శుభ‌సూచ‌కం. ప్ర‌ముఖ మార్కెట్‌, ఆర్థిక ప‌రిశోధ‌నా సంస్థ - హెచ్‌.ఐ.ఎస్ మార్కెట్ చేసిన స‌ర్వే ప్ర‌కారం ఇండియా మాన్యుఫ్యాక్ట‌రింగ్ ప‌ర్చేజింగ్ మ్యానేజ‌ర్స్ ఇండెక్స్ - పి.ఎమ్‌.ఐ డిసెంబ‌ర్ లో 52.7 కాగా జ‌న‌వ‌రిలో 55.3కు పెరిగింది. ఎనిమిది సంవ‌త్స‌రాల కాలంలో ఈ పెరుగుద‌ల అత్య‌ధికం. దీంతో భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి పుంజుకుంటోంద‌న్న సూచ‌న‌లు క‌న‌బ‌డుతున్నాయి.

ప్ర‌పంచంలో 40 దేశాల‌కు పైగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌పై ఐ.హెచ్‌.ఎస్ మార్కెట్ ప‌ర్చేసింగ్ మ్యానేజ‌ర్స్ ఇండెక్స్ - పి.ఎమ్‌.ఐ స‌ర్వే జ‌రుపుతోంది. ప్రైవేటు రంగంలోని సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి సేక‌రించే స‌మాచారం ఆదారంగా ఈ డాటాను రూపొందిస్తారు. ఒక ఆర్థిక‌వ్య‌వ‌స్థ స్థూలంగా ఎలా వున్న‌ది అన్న‌ది పి.ఎమ్‌.ఐ డాటా సెట్ నిర్వ‌చిస్తుంది. 50 కు పైగా పి.ఎమ్‌.ఐ వుంటే వృద్ధి ప‌ధాన్ని సూచిస్తుంది. వినియోగ వ‌స్తువుల ఉత్పత్తి రంగం మళ్ళీ వెలుగుతోంది. మ‌ధ్య‌త‌ర‌హా ఉత్ప‌త్తులు వృద్ధిని క‌న‌బ‌రుస్తున్నాయి. క్యాపిట‌ల్ గూడ్స్ విస్త‌ర‌ణ బాట‌ను ప‌ట్టాయి. దీంతో పెట్టుబ‌డులు మ‌ళ్ళీ ఊపందుకునే సూచ‌న‌లు క‌న‌బ‌డుతున్నాయి. విదేశీ మార్కెట్ల ప‌రంగా కూడా పి.ఎమ్‌.ఐ సూచిక‌లు వృద్ధి సంకేతాలు ఇస్తున్నాయి.

2018 న‌వంబ‌ర్ మాసంతో పోలిస్తే ఎగుమ‌తి ఆర్డ‌ర్లు అత్యంత వేగంగా పెరిగాయి. ఆసియా, యూర‌ప్‌, ఉత్త‌ర అమెరికాకు ఎగుమ‌తి ఆర్డ‌ర్ల పెరుగుద‌ల అధికంగా వుంది. అంతేకాకుండా - పెట్టుబ‌డి వ్య‌యం కూడా త‌గ్గుతుండ‌టంతో మార్జిన్లు పెరిగే అవ‌కాశం క‌న‌బ‌డుతోంది. ముడి స‌రుకుల చార్జీలతోపాటూ, ఉత్ప‌త్తి వ్య‌యం స్వ‌ల్పంగా పెరిగింది. మెట‌ల్స్‌, టెక్స్ టైల్స్, ఆహార ఉత్ప‌త్తుల వ్య‌యం పెరిగిన‌ట్లు కొన్ని కంపెనీలు పేర్కొన‌గా - రాగి, ప్యాకేజింగ్ మెటీరియ‌ల్స్‌, ర‌బ్బ‌ర్ వంటి వాటి రేట్లు త‌గ్గిన‌ట్లు మ‌రికొన్ని కంపెనీలు తెలిపాయి.

డిమాండ్ పెర‌గటంతో భార‌త దేశానికి చెందిన ఉత్ప‌త్తుల రంగంలోని కంపెనీలు జ‌న‌వ‌రిలో త‌మ ఉత్ప‌త్తిని పెంచాయి. గ‌త ఏడున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలో ఈ పెరుగుద‌ల అత్య‌ధిక‌మ‌ని పి.ఎమ్‌.ఐ డాటా పేర్కొంటోంది.

గ‌త అమ్మ‌కం కాంట్రాక్టుల‌ను అమ‌లు చేసేందుకు కంపెనీలు త‌మ నిల్వ‌ల‌ను వినియోగించుకుంటున్నాయి. దీంతో నిల్వ‌లు త‌గ్గుతున్నాయి. రానున్న కాలంలో మ‌రింతగా వ్యాపారం పెరిగే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల‌తో కంపెనీలు త‌మ నిల్వ‌ల‌ను తగ్గించుకుంటూ వుండ‌టంతోపాటూ, విస్త‌ర‌ణ‌లు చేప‌డుతూ ఉత్ప‌త్తిని పెంచుకోవ‌టానికి చ‌ర్య‌లు చేప‌డుతున్నాయ‌ని, కొత్త‌గా నియామ‌కాలు చేప‌డుతున్నాయ‌ని పి.ఎమ్‌.ఐ గ‌ణాంకాలు సూచిస్తున్న‌ట్లు ఐ.హెచ్‌.ఎస్ మార్కెట్ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త పోల్ య‌న్నాడి లిమా పేర్కొన్నారు.

ఉద్యోగ‌నియామ‌కాలు కూడా ఊపందుకోవ‌టంతో ఆర్థిక‌వ్య‌వ‌స్థ మ‌రింత మెరుగ‌య్యే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయి. నూత‌న వ్యాపార అవ‌కాశాలు క‌న‌బ‌డుతుండ‌టంతో కంపెనీలు విస్త‌ర‌ణ‌కు సిద్ద‌మ‌వుతున్నాయి.

దీంతో ఉద్యోగ నియామ‌కాలు గ‌త ఏడున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలో ఎన్న‌డూ లేనంత‌గా జోరందుకున్నాయి. వ్యాపారం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలు క‌న‌బ‌డుతుండ‌టంతోపాటు, ముడి స‌రుకుల చార్జీలు త‌గ్గ‌టం వంటి కార‌ణాల మూలంగా భ‌రాతీయ ఉత్త‌ప్తుల రంగం కంపెనీలు - విస్త‌ర‌ణల‌కు బాట‌లు వేస్తున్నాయి.

2020-21 బ‌డ్జెట్ లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు భారీ స్థాయిలో కేటాయింపులు జ‌ర‌ప‌టంతో పాటూ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తిని పెంచేంఉద‌కు కూడా చ‌ర్య‌లు సూచించ‌టం మూలంగా డిమాండ్ పెరిగి ఉత్ప‌త్తుల రంగం వృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న మాంద్యం ప‌రిస్థితుల‌ను ఎదుర్కుని నిల‌బ‌డ‌గ‌లిగే అంత‌ర్ శ‌క్తి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వుంద‌ని పి.ఎమ్‌.ఐ స‌ర్వే భావిస్తోంది.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మాంద్యంలో లేద‌ని ఐఎమ్ఎఫ్ మ్యానేజింగ్ డైరెక్ట‌ర్ చేసిన వ్యాఖ్యలు క్రిస్ట‌లీనా జియోర్జి నియా - భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు ఇచ్చిన కితాబు వంటిది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌త సంవ‌త్స‌రంలో అక‌స్మాత్తుగా మంద‌గించింద‌ని, దీంతో ఐఎమ్‌.ఎఫ్ వృద్ధి రేటును త‌గ్గించాల్సి వ‌చ్చింద‌ని ఆమె పేర్కొన్నారు. అంత‌ర్జాతీయంగా మంద‌గ‌మ‌నం వున్న‌ప్ప‌టికీ భార‌త వృద్ధిరేటు 2020లో 5.8 శాతం, 2021 లో 6.5 శాతంగా వుంటుంద‌ని ఐ.ఎమ్‌.ఎఫ్ అంచ‌నా వేస్తోంది. భార‌త్ చేప‌ట్టిన అనేక సంస్క‌ర‌ణ‌లు దీర్ఘ‌కాలంలో ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌ని ఐ.ఎమ్‌.ఎఫ్ చీప్ పేర్కొన్నారు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ అంత‌ర్లీనంగా గ‌ట్టి ప‌టిష్ట‌త క‌లిగి వున్న‌ద‌ని ఇది ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరీక‌ర‌ణకు కూడా దోహ‌ద ప‌డుతుంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక భావ‌న ఏర్ప‌డింద‌న‌టంలో సందేహం లేదు.

ర‌చ‌న - ఆదిత్య రాజ్ దాస్, సీనియ‌ర్ ఎక‌నిమిక్ జ‌ర్న‌లిస్ట్‌

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం