బ్రెక్సిట్‌, యూరోపియ‌న్ యూనియ‌న్ భార‌త్ పై దాని ప్ర‌భావం

ఐరోపా యూనియ‌న్ నుంచి విడివ‌డ‌డానికి బ్రిట‌న్ - బ్రెక్సిట్ పై 2016 రిఫ‌రెండంను అంగీక‌రించిన త‌రువాత‌, జ‌న‌వ‌రి 31, 2020 నుంచి యుకె-ఐరోపా యూనియ‌న్ ల మ‌ధ్య వున్న 47 ఏళ్ళ సంబంధం ముగుస్తుంది. బ్రిట‌న్ 1973లో ఐరోపా ఎక‌నిమిక్ క‌మ్యూనిటీలో చేరింది. కాగా లిస్బ‌న్ ఒప్పందం క్రింద అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి దేశం కూడా.

బ్రెక్సిట్ ప్ర‌భావం యుకె-ఈయుల మ‌ధ్య వేరువేరుగా వుంటుంది. బ్రెక్సిట్ ను స‌మ‌ర్ధించే వారికి, ఇది దేవ ప‌టిష్ట‌త‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని, అంత‌ర్జాతీయ శ‌క్తిగా మ‌ళ్ళీ రూపాంత‌రం చెందుతుందన్న భావ‌న వుంది. అయితే ఈ ప్ర‌యాణం అంత సుల‌భ‌మైన‌దికాదు. బ్రిట‌న్ తాజాగా వివిధ దేశాల‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వుంటుంది. మార్క‌ట్ల‌తో అనుసంధానం కావాల్సి వుంటుంది. విస్తృత ఆర్థిక స‌ర్వీసులు, ఆర్థిక మార్కెట్లు మూలంగా - ఈయుతో తెగ‌తెంపులు, కార్మిక‌, క్యాపిట‌ల్‌, సేవ‌ల‌రంగాలపై ప్ర‌భావం ప‌డుతుంది. అంతే కాకుండా ఈయు అతి పెద్ద ఎగుమ‌తి దిగుమ‌తుల మార్కెట్‌. బ్రెక్సిట్‌మూలంగా టారిఫ్‌లు, కోటాల విష‌యంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వుంటుంది. దీంతో వ్యాపార వాతావ‌ర‌ణం ఇరువ‌ర్గాల్లో దెబ్బ‌తినే ప్ర‌మాదం వుంది.

ఈయుకు సంబంధించి బ్రెక్సిట్ ప్ర‌భావం బ‌హుముఖంగా వుంటుంది. ఉమ్మ‌డి బ‌డ్జెట్ కు బ్రిట‌న్ అత్య‌ధిక నిధులు అందించే దేశం. యుఎన్ఎస్‌సి లో శాశ్వ‌త స‌భ్య‌దేశం. అణ్వాయుధ సంప‌త్తి క‌లిగిన దేశం. ఈ కార‌ణంగా ఐరోపా యూనియ‌న్ బ‌డ్జెట్ ప్ర‌మాణం త‌గ్గ‌ట‌మే కాక‌, బ్రిట‌న్ లేక‌పోవ‌టం విదేశీ, భ‌ద్ర‌తా విధానాల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తుంది. ఈయుకు చెందిన అన్ని సంస్థ‌ల నుండి బ్రిట‌న్ వైద‌ల‌గ‌డం వ‌ల్ల - స‌మిష్టి నిర్ణ‌యాల‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నిర్ణ‌యం మా త‌ల‌రాత‌ల‌ను మార్చ‌లేవు. బ్రెక్సిట్ కూడా ఏమి చేయ‌లేద‌ని ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్ రాన్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

బ్రెక్సిట్ జ‌రిగిన‌ప్ప‌టికీ - దీని మ‌ధ్యంత‌ర కాలం ఈ సంవ‌త్స‌రాంతం వ‌ర‌కు కొన‌సాగి 2020 డిసెంబ‌ర్ 31తో ముగుస్తుంది. వాణిజ్యం, మార్కెట్ అనుసంధానం వంటి క‌ఠిన‌మైన అంశాల‌పై ఒక అవ‌గాహ‌న వ‌చ్చి, ఆ ప్ర‌క్రియ‌లు సాఫీగా మార్పు చెందేందుకు ఈ స‌మ‌యం దోహ‌ప‌ద‌ప‌డుతుంది. ఈయు నిబంధ‌న‌ల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని, వివాదాల ప‌రిష్కారాల‌కు ఐరోపా కోర్టుల ప‌రిధిని అంగీక‌రించ‌మ‌ని బ్రిట‌న్ ఇప్ప‌టికే తేల్చి చెప్పింది.

ఈ నేప‌థ్యంలో - భార‌త్ - బ్రిట‌న్ ల మ‌ధ్య సంబంధాల్లో నూత‌న కోణం ఆవిషృతమ‌య్యే అవ‌కాశం వుంది. బ్రిట‌న్ త‌న వాణిజ్య ప‌రిధిని విస్త‌రించుకోవాల‌ని భావిస్తుంది.

దీంతో వాణిజ్య‌, ఆర్థిక అంశాల‌పై బ్రిట‌న్‌తో ఇండియా తాజాగా సంప్ర‌దింపులు జ‌రిపే అవ‌కాశం క‌లుగుతుంది.

బ్రెక్సిట్ క‌ల్పించిన అవ‌కాశాన్ని అంది పుచ్చుకునేందుకు భార‌త్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కార్పొరేట్ సుంకాల త‌గ్గింపు, డాటా ప్రెవేసీ వంటి అంశాల‌పై దృష్టి సారించాల‌ని, భార‌తీయ మూలాలు క‌లిగిన బ్రిట‌న్ లోని ప్ర‌ముఖ వ్యాపారవేత్త లార్డ్ క‌ర‌ణ్ బిల్మోరియా ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. భార‌త్ - యుకె సంబంధాల మెరుగు మూలంగా, టెక్నాల‌జీ, ఆర్థిక సేవ‌లు, ఆరోగ్య‌సేవ‌ల వంటి రంగాల్లో మంచి వృద్ధి సాధించ‌వ‌చ్చు. భార‌త్ తో నూత‌న భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌ర‌చుకోవాల‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.

బ్రిట‌న్ లో వున్న భార‌తీయ వ్యాపారానికి ఈయుతో స్వేచ్ఛావాణిజ్యం తెగిపోయిన‌ట్లే ఇప్పుడు తాజాగా త‌న వ్యాపార కేంద్రాల‌ను మార్చుకోవ‌డం, లేదా ఎగుమ‌తి సుంకాన్ని చెల్లించ‌డం త‌ప్ప‌నిస‌రి అవుతుంది. దీని మూలంగా భార‌తీయ వ్యాపారానికి ఈయు మార్కెట్ చేజారిపోవ‌టంతో పాటూ బ్రిట‌న్ లో వ్యాపార ప‌రిధి త‌గ్గుతుంది కూడా.

కాగా రాజ‌కీయ స్థాయిలో బ్రిట‌న్ త‌న బంధాల‌ను కామ‌న్ వెల్త్ వంటి వేదిక‌ల ద్వారా ప‌టిష్ట‌ప‌రుచుకోవాల‌నుకుంటుంది. ఇది భార‌త్ కు కూడా ప్ర‌యోజ‌న‌క‌ర‌మే. వాణిజ్యం, మార్కెట్ లభ్య‌త‌, కార్మిక సంబంధ‌మైన అంశాల‌లో భార‌త్ మ‌రింత మెరుగైన అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాల్సి వుంటుంది.

ఈయుతో తెగ‌తెంపులు విష‌యంలో బ్రిట‌న్ ఈ సంవ‌త్స‌రాంతం వ‌ర‌కు ప‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. యుకె తో త‌న భాగ‌స్వామ్యానికి నూత‌న దారులు క‌ల్పించుకునేందుకు భార‌త్ ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగప‌ర‌చుకోవాల్సి వుంటుంది.

ర‌చ‌న - ప్రొఫెస‌ర్ ఉమ్ము స‌ల్మాబావ, జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యంలో జీన్ మా నెట్ సెంట‌ర్ ఫ‌ర్ యూరోపియ‌న్ స్ట‌డీస్ లో ప్రొఫెస‌ర్‌

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం