భారత్ ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు NIP ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం
102 లక్షల కోట్ల రూపాయల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ - NIP ని ఆవిష్కరించటం ద్వారా వచ్చే ఐదేళ్ళలో దేశంలోని సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పెనుమార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి పలు ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినప్పటికీ, NIP ద్వారా అందరికీ ప్రయోజనం కల్గించే మౌలిక ప్రాజెక్టులు చేపట్టి, 2024-25 కల్లా భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
తొలిసారిగా చేపడుతున్న ఇటువంటి ప్రాజెక్టు - NIP ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించటంతో బాటూ, సమ్మిళిత వృద్ధి ద్వారా ప్రజలకు సుఖవంతమైన జీవితాన్ని కల్పించే అవకాశం లభిస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోది గత సంవత్సరం స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో - వచ్చే ఐదేళ్ళ కాలంలో మౌలిక వసతుల కల్పనపై 100 లక్షల కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుందని పేర్కొన్నారు.
ఈ బృహత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ నాలుగు నెలల కాలంలోనే 70 భాగస్వామ్య పక్షాలతో విస్తృత చర్చలు జరిపి 102 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రతిపాదించారు.
రోడ్డు, రైలు మార్గాలు, ఇంధనరంగం, పట్టణ నీటి పారుదల, విద్య, వైద్యం వంటి పలు రంగాలను పెట్టుబడులకు గుర్తించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం - NIP క్రింద ఓడరేవులు, విమానాశ్రయాల ప్రాజెక్టులకు 2.5 లక్షల కోట్లు, డిజిటల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు 3.2 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు నీటి పారుదల, గ్రామీణ, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు 14 లక్షల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులకు నిర్దేశించారు.
NIP కింద 25 లక్షల కోట్ల రూపాయలు ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గుర్తించారు.
కాగా ఈ 102 లక్షల కోట్ల పెట్టుబడుల NIP పథకంలో ఇప్పటికే 42.7 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అమలులో వున్నాయి. మరో 32.7 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు రూపకల్పన దశలో వున్నాయి. మిగతావి అభివృద్ధి దశలో వున్నాయి.
దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించి వున్న ఈ ప్రాజెక్టుల అమలు భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అయినప్పటికీ - ప్రభుత్వం ప్రజలకు ఈ విస్తృత సేవలను అందించాలన్న ధృడసంకల్పంతో వుంది. ఈ భారీ ప్రాజెక్టుల అమలుకు ఒక పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది.
ఈ బృహత్ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ - NIP ప్రాజెక్టులు అన్నీ కేవలం కేంద్ర ప్రభుత్వానికే సంబంధించినవి కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశీ సంస్థలతో సహా ప్రైవేటు కంపెనీలు NIP ప్రాజెక్టుల్లో కీలక భాగస్వాములు. ప్రతి NIP ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 39 శాతం వంతున వాటాలు వుంటాయి. మిగతా 22 శాతం ప్రైవేటు కంపెనీలు కలిగి వుంటాయి. 2025 నాటికి ఈ 22 శాతం వాటాను 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
దేశ వ్యాప్తంగా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఒక్కసారి గనుక మరింత మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటైతే, దేశ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటానికి వీలు కలుగుతుంది. దీంతో ప్రభుత్వ రెవిన్యూ ఆదాయం పెరిగి ఉత్పాదకరంగాలలో మరింతగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభిస్తుంది.
మాంద్యంనకు ఏ దేశం ఆతీతం కాని ప్రస్తుత తరుణంలో - NIP యే సరైన మార్గం అని చెప్పవచ్చు.
భారత్ 8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు 2030 నాటికి మౌలిక వసతుల రంగంలో 4.5 ట్రలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. దీంతో ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించడానికి వీలు కలుగుతుంది. NIP ఇందుకు దోహదపడుతుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన వృద్ధి సాధించాలంటే మెరుగైన మౌలిక సదుపాయాల వ్యవస్థ ఎంతైనా అవసరం. ఇందుకుగాను NIP ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాల్సి వుంటుంది.
ఇది దేశ సామాజిక, ఆర్థిక రంగాలపై సానుకూల ప్రభావాన్ని కనబరుస్తుంది. అనేక అడ్డంకులు, సవాళ్ళు వున్నప్పటికీ వృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
రచన - శంకర్ కుమార్, జర్నలిస్ట్

Comments
Post a Comment