భార‌త్ చే GSAT -30 విజ‌య‌వంత ప్ర‌యోగం

2020 జ‌న‌వ‌రి 17 తొలివేళ‌లో భార‌త్ త‌న 41వ కమ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హం జిశాట్ - 30ని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. 14 ఏళ్ళ ఇన్‌శాట్ - 4ఏ జీవిత‌కాలం త్వ‌ర‌లో ముగియ‌నుండ‌టంతో నిరంత‌రాయ క‌మ్యూనికేష‌ను సేవ‌లు అందేలా చూడ‌టానికి ఈ ప్ర‌యోగం ఒక కీల‌క చ‌ర్య‌గా చెప్పాలి. ఇన్‌శాట్ 4-ఎని భార‌త కేబుల్ ఆప‌రేట‌ర్లు విదేశాల‌లో త‌మ కార్య‌క్ర‌మాల ప్ర‌సారానికి వాడుకుంటారు. మ‌రో 15 ఏళ్ళ పాటు వారు త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్తృత ప‌రిధిలో కొన‌సాగించేందుకు జిశాట్‌-30 అనుమ‌తిస్తుంది.

ఆర్య‌న్ స్పేస్ కు చెందిన ఆర్య‌న్ రాకెట్ ద్వారా జిశాట్‌-30 ప్ర‌యోగం జ‌రిగింది. ఫ్రెంచ్ గ‌యానా కౌరోలో గ‌ల ఐరోపా అంత‌రిక్ష రేవులోని గ‌యానా అంత‌రిక్ష కేంద్రం నుంచి దీనిని ప్ర‌యోగించారు. ఆర్య‌న్ స్పేస్ నుంచి ప్ర‌యోగించిన 24వ భార‌త ఉపగ్ర‌హం జిశాట్‌-30. భార‌త తొలి క‌మ్యూనికేష‌ను ఉప‌గ్ర‌హం APPLE ను 1981లో ఇక్క‌డినించే ప్ర‌యోగించారు. ఈ తాజా ఉప‌గ్ర‌హం ఆర్య‌న్‌-5 కొత్త‌త‌రం ఉప‌గ్ర‌హం యుటెల్ శాట్ KONNECT ను కూడా తీసుకువెళ్ళింది. దీని ద్వారా ఐరోపా - ఆఫ్రికా వ్యాప్తంగా టెలిక‌మ్యూనికేష‌ను సేవ‌లు అందుతాయి.

15 సంవ‌త్స‌రాల జీవిత‌కాలం గ‌ల జిశాట్‌-30 భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ - ఇస్రోకు చెందిన అత్యంత శ‌క్తివంత‌మైన క‌మ్యూనికేష‌ను ఉప‌గ్ర‌హం. అరుదైన ఫ్రీక్వెన్సీ విభాగాల‌ను అనువైన క‌వ‌రేజిని క‌ల్పించే విశిష్ట‌మైన అమ‌రిక‌తో జిశాట్‌-30 త్వ‌ర‌లో ప‌నికాలం ముగియ‌నున్న ఇన్‌శాట్‌-4ఎ స్థానంలో ప‌నిచేసి నిరంత‌రాయంగా క‌మ్యూనికేష‌ను సేవ‌ల‌ను అంద‌జేస్తుంది. 12-సి, 12-కెయు బ్యాండ్ ట్రాన్స్ పాండ‌ర్ల‌తో కూడిన ఈ ఉప‌గ్ర‌హం టెలివిజ‌న్ ప్ర‌సారాల‌ను, డిటిహెచ్ సేవ‌ల‌ను మ‌రింత పెంపొందిస్తుంది. క్యు-బ్యాండ్ ట్రాన్స్‌పాండ‌ర్లు భార‌త ప్ర‌ధాన భూభాగానికీ, ద్వీపాల‌కు క‌వ‌రేజిని అందిస్తుండ‌గా, సి-బ్యాండ్ రెండు విధాల క‌మ్యూనికేష‌న్ ను అనుమ‌తిస్తుంది. టెలివిజ‌న్ ప్ర‌సార‌క‌ర్త‌లు త‌మ కార్య‌క్ర‌మాల‌ను భార‌త‌దేశంతోపాటు గ‌ల్ఫ్ దేశాలు, ప‌లు ఆసియా దేశాలేకాక ఆస్ట్రేలియాల‌లో ప్ర‌సారం చేయ‌డానికి వీలు క‌ల్పిస్తుంది.

ట్రాన్స్ పాండ‌ర్ల సంఖ్య‌ను గ‌రిష్ఠంగా పెంచ‌డానికి పేలోడ్ డిజైనును మెరుగుప‌ర‌చిన‌ట్టు ఇస్రో - తెలియ‌జేసింది. దీనివ‌ల్ల మెరుగైన క‌వ‌రేజి ల‌భిస్తుంది. మ‌ధ్య ప్రాచ్యం, ఆస్ట్రేలియా, ఇత‌ర ఆసియా ప్రాంతాల‌లో భార‌త ప్ర‌సార‌క‌ర్త‌లు కార్య‌క్ర‌మాల‌ను చేసేందుకు వీలుక‌లుగుతుంది.

ఈ వ్యోమ‌నౌక ప్ర‌స్తుతం వున్న విశాట్ లేదా వెరీస్మాల్ అప‌ర్ చ‌ర్ ట‌ర్మిన‌ల్ నెట్ వ‌ర్క్‌, టెలివిజ‌న్ అప్ లింకింగు - టెలిపోర్టు సేవ‌లు, డిటిహెచ్ టెలివిజ‌న్ సేవ‌లేకాక ఇంకా ఉప‌గ్ర‌హ ఆధారిత అనేక ఇత‌ర సేవ‌లు అంత‌రాయం లేకుండా కొన‌సాగేలా చేస్తుంద‌ని భార‌త అంత‌రిక్ష సంస్థ పేర్కొంది. అంతేకాకుండా డిజిట‌ల్ ఉపగ్ర‌హ వార్తా సేక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఇది తోడ్ప‌డుతుంది. త‌ద్వారా విలేఖ‌రులు భార‌త్ లోని త‌మ స్టూడియోల‌కు దూరంగా మారుమూల ప్రాంతాల నుండి ప‌శ్చిమంలోని ఐరోపా నుండి తూర్పులోని ఆస్ట్రేలియా వ‌ర‌కు అప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేయ‌టానికి దోహ‌ద‌ప‌డుతుంది.

జిశాట్‌-30ని 2030ల‌లో కూడా మ‌న‌గ‌లిగేలా స‌రి కొత్త‌, అధునాత‌న సాంకేతిక ప‌ద్ధ‌తుల‌లో రూపొందించిన‌ట్టు ఇస్రో - తెలిపింది. కాగా త‌న భారీ ప్ర‌యోగ షెడ్యూలు నిర్వ‌హ‌ణ కోసం త‌న ప్రాంగ‌ణంలో సాధార‌ణ వ్యోమ‌నౌక నిర్మాణాన్ని వేగ‌వంతం చేసేందుకు ఇస్రో - ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో ఒక మ‌ధ్యంతర ప‌రిశ్ర‌మ స‌ముదాయ స‌హాయాన్ని తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జిశాట్‌-30 కూర్పులో ఆల్ఫాడిజైన్సు టెక్నాల‌జీ ఆధ్వ‌ర్యంలోని సంస్థ‌లు స‌హ‌క‌రించాయి. బెంగ‌ళూరులోని ఇస్రో శాటిలైట్ ఇంటిగ్రేష‌న్ - టెస్ట్ ఎస్టాబ్లిష్ మెంటులో జిశాట్‌-30 కూర్పు జ‌రిగింది.

త‌న వినియోగదారుల‌కు నిరంత‌రాయ ఉప‌గ్ర‌హ ఆధారిత క‌మ్యూనికేష‌ను సంబంధాలు ఉండేలా చూడ‌టానికి ఇస్రో క‌ట్టుబ‌డి వుంది. విదేశీ రాకెట్ల ద్వారా జిశాట్‌-30ని ప్ర‌యోగించాల‌నే ఇస్రో నిర్ణ‌యం ఇందుకు నిద‌ర్శ‌నం. ఇది ఇస్రో విశ్వ‌స‌నీయ‌త‌ను చాట‌డానికి ఎంతైనా అవ‌స‌రం.

ఇలా ఉండ‌గా భ‌విష్య‌త్తులో ఉప‌గ్ర‌హ ప్ర‌యోగానికై రాకెట్ల ఉత్ప‌త్తిని ఇస్రో - బైటి సంస్థ‌ల‌కు అప్ప‌గిస్తుంద‌ని ఇస్రో ఛైర్మ‌న్ డా.కె.శివ‌న్ చెప్పారు. దీనికింద హిందూస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ (HAL), లార్సెన్ - టూబ్రో (L&T) సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలోని క‌న్సార్టియం పోలార్ ఉప‌గ్ర‌హ వాహ‌క‌నౌక (PSLV) నిర్మాణాన్ని చేప‌డుతుంది. అలాగే ఈ కిన్సారి్ట‌యం మ‌రింత భారీ జియోస్టేష‌న‌రీ లాంచ్ వెహికిల్ (GSLV) క్లాస్ రాకెట్ల‌ను కూడా నిర్మిస్తుంది. ఇంకా భార‌త మాన‌వ స‌హిత అంత‌రిక్ష యాత్ర గ‌గ‌న్‌యాన్ కు కేటాయించిన రూ.100 బిలియ‌న్లు స‌హా సంస్థ చేప‌ట్టిన వివిధ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వం మంజూరు చేసిన రూ.300 బిలియ‌న్ల‌లో 80 శాతం నిధులు ప్రైవేటు రంగానికే వెడ‌తాయ‌ని ఇస్రో పేర్కొంది.

ఇక ఇప్పుడు భార‌త భూగ‌డ్డ‌పై నుండి తొలి భార‌తీయుల‌ను అంత‌రిక్షంలోకి పంప‌డానికి ఇస్రో స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. 2022లో దేశ 75వ స్వాతంత్ర్య వార్షికోత్స‌వానికి ముందు మొద‌టి భార‌తీయ సిబ్బందిని దిగువ భూక‌క్ష్య‌కు పంపాల‌ని నిర్ణ‌యించారు. విజ‌య ప‌రంప‌ర‌ల‌తో అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతున్న ఇస్రో ఈ ల‌క్ష్యాన్ని దిగ్విజ‌యంగా సాధిస్తుంద‌ని ఆశించ‌వ‌చ్చు.

ర‌చ‌న : బిమ‌న్ బ‌సు - సీనియ‌ర్ సైన్సు వ్యాఖ్యాత‌

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం