FDI మొద‌టి అగ్ర‌స్థానాల‌లో భార‌త్ స్థానం ప‌దిలం

విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి (FDI) రాక‌ప‌రంగా భార‌త్ లో 16 శాతం మేర పెరుగుద‌ల చోటు చేసుకుంది. 2019లో ఈ మొత్తం 42 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల నుండి 49 బిలియ‌న్ల‌కు చేరింది. దీంతో ఈ విష‌యంలో మొద‌టి ప‌ది అగ్ర‌స్థానాల‌లో భార‌త్ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంది. ఇన్వెస్ట్ మెంట్ ట్రెండ్ మానిట‌ర్ పేరుతో వాణిజ్యం - అభివ‌ృద్ధి పై ఐక్యరాజ్యసమితి సమావేశం - UNCTAD ఇటీవ‌ల విడుద‌ల చేసిన నివేదిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. 2019లో ప్ర‌పంచ వ్యాప్తంగా విదేశీ ప్ర‌త్యక్ష పెట్టుబ‌డులు 1.41 ట్రిలియ‌న్ డాల‌ర్ల నుండి 1 శాతం దిగ‌జారి 1.39 ట్రిలియ‌న్లుగా మంద‌గ‌మ‌నంలో సాగుతున్న స‌మ‌యంలో భార‌త్ లో ఈ వృద్ధి జ‌రిగింద‌ని నివేదిక పేర్కొంది. ఎఫ్‌.డి.ఐ లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంది. కాగా అమెరికా, చైనాల‌లో పెట్టుబ‌డి రాక‌లు సున్నా శాతంగా చ‌తికిల‌బ‌డ్డాయి.

ద‌క్షిణాసియా ప్రాంతంలో ఈ పెట్టుబ‌డులు 10 శాతం మేర పెరిగి 60 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేర‌గా అందులో 80 శాతానికి పైగా భార‌త్ వే కావ‌డం విశేషం. అధిక భాగం నిధులు స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞానం స‌హా సేవ‌ల ప‌రిశ్ర‌మ‌ల‌కు వెళ్ళాయి. మ‌న పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ లు FDI క్షీణ‌త‌ను చ‌విచూసాయి. బంగ్లాదేశ్ లో 6 శాతం మేర త‌గ్గి 3.4 బిలియ‌న్ డాల‌ర్ల‌కు, పాకిస్తాన్ లో 20 శాతం మేర త‌గ్గి 1.9 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ఈ పెట్టుబ‌డులు ప‌డిపోయాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ క‌ల్లోలం FDI ప్ర‌వాహంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌భావం చూపింది. బ్రెక్జిట్ తో బ్రిట‌న్ 6 శాతం క్షీణ‌త‌ను ఎదుర్కొంటుండ‌గా యూరోపియ‌న్ యూనియ‌న్ కూడా 15 శాతం త‌రుగుద‌ల‌తో 305 బిలియ‌న్ డార్ల‌కు కూలింది.అయితే బ్రెజిల్ ప్రైవేటీక‌ర‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభంలో 26 శాతం లాభ‌ప‌డింది. దేశానికి FDI రాక ప్ర‌వాహాల‌కు రాజ‌కీయ ఆర్థిక వ్య‌వ‌స్థ కీల‌క నిర్ణ‌యాధికారిగా ప‌ని చేస్తుంది. అలాగే రాజ‌కీయ సంఘ‌ట‌న‌లు కూడా విదేశీ పెట్టుబ‌డుల‌పై త‌ప్పక ప్ర‌భావం చూపుతాయి. 

మూల‌ధ‌నం పెట్టుబ‌డుల పోర్టు ఫోలియో నుండి విదేశీ పెట్టుబ‌డికి మార‌టం, మంచి ప‌రిణామ‌మే. ఎందుకంటే FDI మ‌రింత స్థిరంగా ఉంటుంది. పోర్టు ఫోలియో పెట్టుబ‌డి వ‌డ్డీ రేట్ల‌కు స్పందిస్తూ సందిగ్ధంగా ఉంటుంది. భార‌త విదేశీ మార‌క నిల్వ‌లు ఎన్న‌డూ లేనంత‌గా 2019 జ‌న‌వ‌రి 4 నించి బాగా విస్త‌రించి 65.1294 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. ఇది దాదాపు మొత్తం ఆస్ట్రేలియా, ఫిన్లాండు, ఐస్‌లాండ్ విదేశీ మార‌క నిల్వ‌ల‌కు స‌మానం. విదేశీ మార‌క ద్ర‌వ్యంలో 4 అంశాలు ఇమిడి వుంటాయి. అవి ఏమిటంటే 1. ఎఫ్‌.సి.ఐ విదేశీ క‌రెన్సీ ఆస్తులు, 2. బంగారం, 3. ఐపిఆర్ డ‌బ్బు డ్రా చేసే ప్ర‌త్యేక డ్రాయింగ్ హ‌క్కులు చివ‌ర‌గా - ఆర్‌.టి.పి అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధిలో నిల్వ స్థానాలు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ప్ర‌పంచ FDI నిధుల‌లో స‌గానికి పైగా గ్ర‌హిస్తుండ‌గా అగ్ర‌స్థానంలో ఉన్న చైనా, సింగ‌పూరు, బ్రెజిల్‌, హాంగ్ కాంగ్‌, భార‌త‌దేశాలు అందులో స‌గం మేర అంటే 695 బిలియ‌న్ డాల‌ర్ల మేర తీసుకుంటున్నాయి.

ప్రాంతీయ వైవిధ్యాన్ని బ‌ట్టి చేస్తే ఆఫ్రికా, లాటిన్‌, అమెరికా, క‌ర్రేబియ‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు 3.16 శాతం క్ర‌మంలో నిక‌ర లాభాలు పొందాయి. FDIలో ఉత్త‌ర అమెరికా 0 శాతం వృద్ధితో నేల‌మ‌ట్టంలో ఉంది. మొత్తం మీద ఆసియా - ఐరోపాలో వ‌రుస‌గా 6-4 శాతం క్షీణ‌త‌తో నిక‌ర న‌ష్టాల‌ను చ‌వి చూసాయి. అభివృద్ధి దృక్కోణంలో చూసిన‌ట్ట‌యితే ప‌రివ‌ర్త‌న చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత్య‌ధికంగా 65 శాతం మేర లాభ‌ప‌డ్డాయి. అభివృద్ధి చెందుతున్న వ్య‌వ‌స్థ‌లు కూల‌బ‌డిపోగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు 6 శాతం క్షీణ‌త‌ను న‌మోదు చేసాయి.

ఇక యు.ఎన్ నివేదిక మ‌రో విష‌యాన్ని ప్ర‌ధానంగా చెప్పింది. 2019లో సీమాంత‌ర (ఎమ్‌-ఏలు) సీమాంత‌ర విలీనాలు, స‌ముపార్జ‌న‌లు 40 శాతం త‌గ్గి 490 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. 2014 నుండి ఇది క‌నిష్ట స్థాయిగా నివేదిక తెలిపింది. సీమాంత‌ర ఎమ్‌.ఏల అమ్మ‌కాలు ముఖ్యంగా సేవారంగంలో 56 శాతం క్షీణించి 207 బిలియ‌న్ డాల‌ర్ల‌కు త‌గ్గాయి. ఆ త‌ర్వాత త‌యారీరంగం 19 శాతం క్షీణ‌త‌తో 249 బిలియ‌న్ డాల‌ర్ల‌కు, ప్రాథ‌మిక రంగం 14 శాతంతో 34 బిలియ‌న్ డాల‌ర్ల‌క కుదేల‌య్యాయి.

అయితే యు.ఎన్ నివేదిక సానుకూల ప‌రిణామాల‌ను ప‌రిశీలించిన‌ట్టు కూడా చెప్పింది. 2020లో FDI ప్ర‌వాహాలు ఒక మోస్త‌రుగా పెరుగుతాయ‌ని భావిస్తున్న‌ట్టు తెలిపింది. భౌగోళిక ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగుప‌డే సూచ‌నలున్నందున ఇది సాధ్య‌మ‌ని పేర్కొంది.



అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి (ఐ.ఎమ్‌.ఈ) ముఖ్య ఆర్థిక‌వేత్త గీతాగోపీనాధ్ - భార‌త ఆర్థిక మంద‌గ‌మ‌నంపై ఆందోళ‌న‌లు వ్యక్తం చేసిన త‌రుణంలో భార‌త‌దేశంలో FDIపై ఈ సానుకూల వార్త వ‌చ్చింది. ఆర్థిక వృద్ధిపై విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల పెరుగుద‌ల అనేది దైవాధీనం, దీర్ఘ‌కాలంలో విశ్లేషించాల్సిన అవ‌స‌రం ఉంది. ద్ర‌వ్య ఆర్థిక‌రంగంలో భార‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థాగ‌తంగా సాగిస్తున్న సంస్క‌ర‌ణ‌లు ఆర్థిక‌వృద్ధికి, స్థూల ఆర్థిక స్థిర‌త్వానికి అత్యంత కీల‌క‌మైన‌వి.

ఆంగ్ల ర‌చ‌న - డా.లేఖ ఎస్ చక్ర‌వ‌ర్తి, ప్రొఫెస‌ర్ జాతీయ ప‌బ్లిక్ ఫైనాన్స్ అండ్ పాల‌సీ సంస్థ‌


Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం