బాగ్దాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రచ్ఛన్న యుద్ధం
అమెరికాకు మా సందేశం అందింది!... బాగ్దాద్‌లో అత్యంత పటిష్ట భద్రతగల “గ్రీన్‌జోన్”లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ప్రతిష్టంభనపై అక్కడినుంచి వైదొలగుతున్న ఇరాన్ అనుకూల నిరసనకారుల మనోభావమిది. ట్రంప్ యంత్రాంగం-ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర పాలకుల నడుమ ఎడతెగని మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల అర్ధసైనిక పటాలం దాడిలో అమెరికా కాంట్రాక్టు సైనికుడి మరణం, మరికొందరు సైనికులు గాయపడటంతో ఇది అత్యంత దురదృష్టకర మలుపు తిరిగింది. ఆ మేరకు సదరు అర్ధసైనిక బలగాలకు చెందిన ఐదు ప్రాంతాల్లో దాడులకు ట్రంప్ ఆదేశాలివ్వగా 25 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. దీనిపై ఇరాక్‌లోని ఇరాన్ అనుకూలవర్గాలు మండిపడి బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించాయి. ఇందులో భాగంగా ప్రహరీపైనుంచి దూకి లోపలికి వెళ్లడానికి యత్నించాయి. అయితే, లోపలున్న అమెరికా నావికాదళ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపారు.
ఇరాక్-సిరియా సరిహద్దు వెంబడి అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతుగల పాపులర్ మొబిలైజేషేన్ ఫోర్స్-PMFలో భాగంగా, “దైవపథ పటాలం” పేరిటగల షియా వర్గానికి చెందిన అర్ధసైనిక బలగం కతీబ్ హెజ్బుల్లా తొలుత దాడిచేసింది. కాగా, ఇరాక్‌పై 2003 మార్చి నెలలో అమెరికా దాడి తర్వాత ఇరాక్‌లో అంతర్యుద్ధం ప్రారంభమయ్యాక కతీబ్ హెజ్బుల్లా కార్యకలాపాలు చురుగ్గా మొదలయ్యాయి. అటుపైన సిరియా అంతర్యుద్ధంలో సవాళ్లను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు బషర్-అల్-అసాద్‌కు మద్దతుగా ఈ సంస్థ రంగంలో దిగింది. కాగా, డిసెంబరు 29న ఐదు ప్రదేశాల్లో అమెరికా ప్రతీకార దాడులపై అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో స్పందించారు. “మేం బలంగా ప్రతిస్పందించాం... ఇకపైనా ప్రతిస్పందిస్తాం. ఇప్పుడు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్ కుట్రపన్నింది” అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, అమెరికా సిబ్బంది భద్రతకు భరోసా ఇస్తూ ఇరాక్ ప్రభుత్వం వేగంగా స్పందించిదంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే ఆయననుంచి కొత్త సంవత్సర హెచ్చరికను కూడా ఇరాన్ అందుకుంది. “మాకు సంబంధించిన ప్రదేశాల్లో ఎక్కడైనా ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసానికి ఇరాన్‌దే బాధ్యత. అందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇది హెచ్చరిక ఎంతమాత్రం కాదు.. ముందున్న ముప్పుగా గుర్తించాలి” అంటూనే ‘కొత్త ఏడాది శుభాకాంక్షలు!’ అని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు బాగ్దాద్‌లో అమెరికా విమాన దాడులవల్ల ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ, ఇరాక్ పౌరసైన్యం అధిపతి అబు మహది అల్-ముహందిస్ మరణించారు. దీనిపై “మా రక్షణ శాఖ నిర్ణయాత్మక రక్షణ చర్య తీసుకుంది” అని అమెరికా రక్షణ మంత్రి మార్క్ టి.ఈస్పర్ చెప్పారు. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి నిరుడు మే నెలలో వైదొలగిన అమెరికా, ఆ తర్వాత నేరుగా ఇరాన్ ఇంధన పరిశ్రమను లక్ష్యం చేసుకుంటూ ఆంక్షలను పునరుద్ధరించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. ఈ ఆంక్షలతోపాటు ఇరాన్‌లో లోపభూయిష్ట ద్రవ్య విధానం నిర్వహణతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్య పౌరుల నుంచి ఇటీవలి కాలంలో నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా తలపడటంపై ఇప్పటిదాకా ఉభయపక్షాలూ సంయమనం పాటిస్తున్నాయి. కానీ, అమెరికా బెదిరింపులకు నిరసనగా ఇరాన్ సన్నిహిత, ఇరాన్ మద్దతుగల వర్గాలు అమెరికా మిత్రదేశాల్లోని కీలక లక్ష్యాలపై దాడులు చేసే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది.
నిరసనలు సద్దుమణుగుతున్నప్పటికీ- భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అంటే- దేశీయంగా ఆయన ఎదుర్కొంటున్న సమస్యలే ప్రస్తుత ఉద్రిక్తతలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. అధ్యక్షుడిపై అభిశంసన సంబంధిత అంశాలను గత నెలలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. క్రిస్మస్ విరామం ముగిసిన నేపథ్యంలో ఈ విషయాన్ని సెనేట్‌కు నివేదించే ముందు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణాన ట్రంప్ కొంత ఊరట పొందడానికి దూరభూమిలో మంటలు రేగిన క్షణాలకన్నా అద్భుతమైన అవకాశం మరేముంటుంది! మునుపటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా- మోనికా లెవెన్‌స్కీ ఉదంతంలో అభిశంసన సందర్భంగా తన వ్యతిరేకుల దృష్టి మళ్లించడానికి ఆఫ్ఘనిస్థాన్‌లోని అల్-కాయిదా స్థావరాలపై దాడులు చేయించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
ఏదేమైనా కొన్ని లక్ష్మణ రేఖలను దాటేందుకు ఉభయపక్షాలూ ఇచ్చగించడం లేదు. లోగడ కార్టర్ అధ్యక్షుడుగా ఉన్నపుడు 1980లో ఎదుర్కొన్న బందీల సంక్షోభం వంటిదాన్ని ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కోరుకోరు. అప్పట్లో 444 రోజులపాటు సాగిన ఆ సంక్షోభం అమెరికా-ఇరాన్‌ల మధ్య నాలుగు దశాబ్దాల శత్రుత్వానికి బీజం వేసింది. అందువల్ల అలాంటి ఉదంతం పునరావృతం కావడానికి అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఇరాన్ సర్వాధిపతి అలీ ఖొమేనీ కూడా ఇష్టపడరు. ఇక ఇంధన భద్రత, భారీ ప్రవాస జనాభా, చెల్లింపులు తదితరాల దృష్ట్యా భారతదేశానికి ఈ ప్రాంతంలో కీలక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మనకు అతిపెద్ద ముడిచమురు సరఫరాదారుగా ఉన్న సౌదీ అరేబియా స్థానాన్ని 2017-18 నుంచి ఇరాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు భారత-ఇరాన్ ఇంధన వాణిజ్యంపై ఇప్పటికే దుష్ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల పర్షియా జలసంధి ప్రాంతంలో భారత ప్రయోజనాల దృష్ట్యా అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న బాగ్దాద్ ప్రతిష్టంభనకు సత్వర ఉపశమనం అవశ్యం.
రచన: ప్రొఫెసర్ ఆర్.కుమారస్వామి, పశ్చిమాసియా అధ్యయన కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం

Comments
Post a Comment