పర్షియా జలసంధిలో శాంతికి భారత్ పిలుపు
పర్షియా జలసంధిలో పరిస్థితులు తీవ్ర పరిణామాలవైపు దారితీస్తున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావీద్ జరీఫ్తో ఫోన్ సంభాషణ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ గుర్తుచేశారు. గత శుక్రవారం అమెరికా దాడిలో ఇరాన్ అల్-ఖడ్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణానంతరం ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జైశంకర్ ఆయనతో మాట్లాడారు. ఉద్రిక్తతల స్థాయి నానాటికీ పెరుగుతుండటంపై భారత ప్రభుత్వం తరఫున డాక్టర్ జైశంకర్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా పరస్పరం అందుబాటులో ఉండాలని వారు నిర్ణయించారు. సంయుక్త కమిషన్ 19వ సమావేశంలో పాల్గొనేందుకు ఓ రెండు వారాల కిందట జైశంకర్ టెహ్రాన్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ, జరీఫ్తోపాటు పలువురు సీనియర్ అధికారులతో ఆయన చర్చల్లో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ నెల 14న ప్రారంభమయ్యే ‘రైసినా చర్చల’లో పాల్గొనేందుకు జరీఫ్ భారత్ రావాల్సి ఉంది. కాగా- ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ తదితర దేశాలతో ఇరాన్ సంబంధ బాంధవ్యాల నిర్వహణ బాధ్యతలు చూసిన సులేమానీని ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావశీలిగా పరిగణిస్తారు. ఒక్క మాటలో చెబితే ఇరాన్ సర్వాధికార నేత అలీ ఖొమైనీ తర్వాత అంతటి ప్రాముఖ్యంగలవాడుగా సులేమానీ సుప్రసిద్ధులు. దీంతో ఆయన మరణానంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ నేతల మధ్య వాగ్యుద్ధం జోరందుకుంది. దీంతో ఉద్రిక్తతలు ముదురుతున్న నేపథ్యంలోనే జరీఫ్తో జైశంకర్ ఫోన్ ద్వారా సంభాషించారు.
ఇదిలా ఉంటే, అమెరికా కఠిన ప్రతీకారాన్ని ఎదుర్కొనక తప్పదని ఇరాన్ నాయకులు కూడా తక్షణ హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ప్రజాగ్రహాన్ని ప్రతిబింబిస్తూ రివల్యూషనరీ గార్డ్స్ సీనియర్ కమాండ్ ప్రకటన చేశారు. టెల్ అవీవ్‘తోపాటు ఈ ప్రాంతంలో తమకు అందుబాటులోగల దాదాపు 35 కీలక అమెరికా లక్ష్యాలను ఇరాన్ ఏనాడో గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ- ఇరాన్‘కు చెందిన 52 లక్ష్యాలను తాము గుర్తించామని ప్రతిస్పందించారు. ఇరాన్‘కు, ఆ దేశ సంస్కృతికి ఎంతో ముఖ్యమైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. తదనుగుణంగా అమెరికా లక్ష్యాలను లేదా ప్రయోజనాలను దెబ్బకొట్టే దాడులకు పాల్పడితే ఇరాన్ కీలక లక్ష్యాలను కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ విధ్వంసం మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అయితే, తమ నాగరికత ఎన్నో దాడులు, విధ్వంసాలు, దండయాత్రలకు ఎదురొడ్డి నిలిచిందని గుర్తుచేస్తూ ఇరాన్ నేతలు దీటుగా బదులిచ్చారు. కాగా, సులేమానీని అంతం చేయడాన్ని ట్రంప్ యంత్రాంగం కీలక విజయంగా భావిస్తుంటే... ఇరాన్ సర్వాధికార నేత 1989లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకిది అత్యంత పెనుసవాలుగా మారింది. ఆ మేరకు అమెరికాను ఎదుర్కొనడంతోపాటు ఈ ప్రాంతంలోని తమ మిత్రదేశాలకు భరోసానిచ్చేలా ఇరాన్ స్పందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సులేమానీ స్వస్థలం కెర్మాన్‘లో అంత్యక్రియల తర్వాత ఇరాన్ స్పందన ఎలా ఉంటుందన్నది వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల తీవ్రతను అంతర్జాతీయ సమాజం తరహాలోనే భారత్ కూడా గుర్తించింది. దీనికి అనుగుణంగా సులేమానీపై దాడి జరిగిన వెంటనే స్పందిస్తూ- పర్షియా జలసంధి ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతల ప్రాముఖ్యాన్ని గుర్తుచేస్తూ ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు మరింత ముదరబోవని ఆశాభావం వ్యక్తం చేస్తూ సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‘తో మాట్లాడిన అనంతరం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియోసహా ఒమన్, UAE విదేశాంగ శాఖ మంత్రులతోనూ డాక్టర్ జైశంకర్ సంభాషించారు. ఈ పరిస్థితుల నడుమ ఇరాన్ ప్రతిస్పందన ఎక్కడ, ఏ విధంగా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదినీ తొలిచివేస్తోంది. ఈ ప్రాంతంలోని అమెరికా లక్ష్యాలమీద లేదా అమెరికా భూభాగంపై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేసిన పక్షంలో అమెరికా నుంచి తీవ్ర ప్రతిస్పందనను ఎదుర్కొనక తప్పదు. కాబట్టి మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఇరాక్ లేదా సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ గురిపెట్టే అవకాశాలున్నాయి.
అయితే, ఈ దేశాలన్నిటితోనూ భారత్‘కు సన్నిహిత సంబంధాలున్నాయి. అందువల్ల ఇరాన్ మౌనం వహించడం అసాధ్యమన్నది స్పష్టమే అయినా, ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన కనిపించినా భారతదేశానికి కీలకమైన పర్షియన్ జలసంధిలో జ్వాలలు రేగుతాయనడంలో సందేహం లేదు. ఇంధన భద్రత, చాబహర్ రేవులతోపాటు మధ్యాసియాకు రవాణా మార్గంగా ఉన్న ఇరాన్‘తో భారత కీలక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ సంక్లిష్ట సమయంలో ఇరాన్ ఒంటరి కాలేదని, పరిస్థితులపై తమకు అవగాహన ఉందన్న అంతర్లీన సందేశాన్ని పంపింది. భారత్ వంటి దేశాలు ఇరాన్ సందిగ్ధ పరిస్థితిని అర్థం చేసుకున్న దృష్ట్యా సులేమానీ మృతికి తన ప్రతిస్పందన, దాని ప్రభావాలపై ఆ దేశం వాస్తవ దృక్పథంతో పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఏదేమైనా అంతర్జాతీయంగా మద్దతు లభించడంతోపాటు భారత్ స్నేహహస్తం చాచిన దృష్ట్యా ఇరాన్ తన చర్యలపై ఆచితూచి స్పందిస్తుందన్న ఆశాభావం కనిపిస్తోంది.
రచన: ప్రొఫెసర్ పి.ఆర్.కుమారస్వామి, పశ్చిమాసియా అధ్యయన కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం

Comments
Post a Comment