‘పొరుగుకు ప్రాథమ్యం’ విధానంపై భారత్ పునరుద్ఘాటన
‘పొరుగుకు ప్రాథమ్యం’ అనే తన విధానానికి భారతదేశం సదా కట్టుబడి ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు స్వీకరించిన నాటినుంచీ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆయన 2014 మే 26న పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ‘దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి-సార్క్’ దేశాల అధిపతులను/ప‌్రభుత్వాధినేతలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే సంవత్సరం తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా భూటాన్ సందర్శించారు. పేదరికం, పౌష్టికాహార లోపం, అందరికీ విద్య వంటి సవాళ్ల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామంటూ దక్షిణాసియా పొరుగు దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఇరుగుపొరుగు దేశాల శ్రేయస్సు కోసం తన ప్రత్యేక పరిజ్ఞానాన్ని వాటితో పంచుకునేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 కొత్త సంవత్సరాది సందర్భంగా ఈ స్ఫూర్తిని మరోసారి చాటారు. తదనుగుణంగా పొరుగు దేశాల అధినేతలకు ఫోన్‌ద్వారా శుభాకాంక్షలు తెలిపి, వారితో సంభాషించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్, ప‌్రధానమంత్రి లోతే షెరింగ్; శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్ష, ప్రధానమంత్రి మహింద రాజపక్ష; మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమద్ సొలీ; బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా; నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఒలీ తదితరులు వీరిలో ఉన్నారు. వారందరికీ తన తరఫున, దేశం తరఫున శుభాకాంక్షలు తెలపడమే కాకుండా భారత ప్రజల తరఫున కూడా ప్రధానమంత్రి మోదీ శుభాభినందనలు తెలియజేశారు. అదే సమయంలో ‘పొరుగుకు ప్రాథమ్యం’ విధానంపై భారత్ కట్టుబాటును మరోసారి నొక్కిచెప్పారు. ఈ ప్రాంతంలోని మిత్ర, భాగస్వామ్య దేశాలన్నిటా శాంతి, భద్రత, ప్రగతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
భూటాన్ రాజుతో సంభాషణ సందర్భంగా... భారత-భూటాన్‌ల మధ్య ప్రత్యేక సంబంధాలు పటిష్ఠం కావడానికి దోహదపడిన నిరుటి కీలక విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భూటాన్‌లో తన గత పర్యటన నాటి ఆత్మీయ అనుభవాలను, అక్కడి ప్రజలు తనపై చూపిన ప్రేమాదరాలను మోదీ గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల యువతరం మధ్య ఆదానప్రదానాల అవసరాన్ని నొక్కిచెప్పారు. భూటాన్ రాజు భారత పర్యటన గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
భారత ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలపడంపై శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్ష సౌహార్దంగా స్పందించారు. ఈ కొత్త సంవత్సరంలో భారత-శ్రీలంక స్నేహ సంబంధాలు మరింత ముందుకు వెళ్లగలవన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ దిశగా సన్నిహిత కృషికి నాయకులిద్దరూ తమ సంసిద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే శ్రీలంకతో సన్నిహిత-విశేష సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మహింద రాజపక్షతో మాట్లాడిన సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు.
మాల్దీవ్స్ అధ్యక్షుడు సోలీతో సంభాషణలో భాగంగా- ఆయనతోపాటు అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతివైపు పయనంలో వారికి సకల విజయాలూ సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మోదీ శుభాకాంక్షలు తెలపడంపై సొలీ హర్షం వ్యక్తం చేస్తూ- భారత్‌తో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇందుకోసం ప్రస్తుత ద్వైపాక్షిక సహకారం విస్తృతికి, సమష్టి కృషికి అనువైన రంగాల అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో మాట్లాడిన సందర్భంగా- అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలిగా మళ్లీ ఎన్నికైనందుకుగాను ప్రధానమంత్రి మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. భారత్‌లో పనిచేసిన బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ సయ్యద్ మౌజం అలీ అకాల మరణంపై మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. భారత-బంగ్లాదేశ్‌ల మధ్య 2019లో సంబంధాల ప్రగతిని మోదీ గుర్తుచేశారు. అలాగే బంగబంధు శతజయంతి గురించి, బంగ్లా విముక్తి స్వర్ణోత్సవం గురించి, ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడినప్పటినుంచి అధిగమించిన మైలురాళ్ల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారత-బంగ్లా సంబంధాల ప్రగతికి తమ ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యాన్ని కూడా ఈ సంభాషణల్లో ఆయన స్పష్టం చేశారు.
నేపాల్ ప్రధానమంత్రి ఒలీకి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా... నిరుడు అనేక ప్రాజెక్టులు పూర్తయిన నేపథ్యంలో భారత-నేపాల్ సంబంధాల ప్రగతిపై ప్రధానమంత్రి మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లోని మోతీహరి నుంచి నేపాల్‌లోగల అమ్లేఖ్‌గంజ్ వరకూ పెట్రో ఉత్పత్తుల పైప్‌లైన్ ప్రాజెక్టు అత్యంత తక్కువ సమయంలో పూర్తి కావడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేపాల్‌లోని విరాట్‌నగర్ వద్ద నిర్మించిన సమీకృత తనిఖీ కేంద్రంతోపాటు గృహపునర్నిర్మాణ ప్రాజెక్టును త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించేందుకు నాయకులిద్దరూ సమ్మతించారు.
రచన: పదమ్ సింగ్, ఆకాశవాణి వార్తా విశ్లేషకులు

Comments
Post a Comment