మ‌రోసారి బ‌హిర్గ‌తమైన చైనా - పాకిస్తాన్ కుట్ర‌



కాశ్మీర్ అంశంపై UN భద్ర‌తామండ‌లిలో అన‌ధికార సంప్ర‌దింపుల‌కు చైనా చేసిన ప్ర‌య‌త్నం తిప్పికొట్టింది. ఈ అంశంలో చైనాకు పాకిస్తాన్ మ‌ద్ద‌తు ప‌లికింది. అయితే అధిక శాతం మంది స‌భ్యులు దీనిని తిర‌స్క‌రించారు. భార‌త రాజ్యాంగం 370 అధిక‌ర‌ణం ర‌ద్దుపై ఇటువంటి చ‌ర్య‌కు చైనా పాల్ప‌డ‌డం ఇది మూడ‌వ‌సారి. ఇప్ప‌టికైనా ఈ విష‌యంలో చైనా స‌రైన పాఠాలు నేర్చుకోవాల‌ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. UN భ‌ద్ర‌తా మండ‌లికి చెందిన అధిక శాతం స‌భ్యులు ఇది ద్వైపాక్షిక వ్య‌వ‌హారంగా చూస్తున్నారు. పాకిస్తాన్ త‌న అంత‌ర్గ‌త త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ఇటువంటి క‌క్ష పూరిత వ్య‌వ‌హారాలు బెడిసికొడుతున్నాయ‌ని UNలో భార‌త్ శాశ్వ‌త ప్ర‌తినిధి స‌య్య‌ద్ అక్బ‌రుద్దీన్ వ్యాఖ్యానించారు. దౌత్యం అంటే ఇత‌రుల‌ను నిందించ‌టం కాదు, చిన్న‌వైనా వాస్త‌విక చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం. ఆగ‌స్టు 5న మేము తీసుకున్న చిన్న చ‌ర్య అటువంటిదేన‌ని అక్బ‌రుద్దీన్ అన్నారు. భ‌ద్ర‌తా మండ‌లిలోని కీల‌క స‌భ్య దేశాలు అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ర‌ష్యాలు భార‌త్ కు మ‌ద్ద‌తు ప‌లికాయ‌ని పేర్కొన్నారు.

దౌత్యానికి రుజువ‌ర్త‌నం ప్ర‌ధానం... అది పాకిస్తాన్‌కు లేద‌ని అన్నారు. ఐదు నెల‌ల క్రితం నుంచీ పాకిస్తాన్ వ‌క్ర‌మార్గాన ప‌య‌నిస్తూ త‌న కుటిల దౌత్య నీతిని ప్ర‌ద‌ర్శిస్తోంది.

పాకిస్తాన్ కు అన్ని ర‌కాల మిత్ర దేశ‌మైన చైనా కాశ్మీర్ అంశాన్ని మరొక్క‌సారి లేవ‌నెత్తేందుకు విఫ‌ల య‌త్నం చేసింది.

UN భ‌ద్ర‌తా మండ‌లిలో సంప్ర‌దింపుల మందిరంలో ఇష్టాగోష్టి చ‌ర్చ‌ల్లో - స‌భ్య దేశాల‌తో ఈ అంశాన్ని ముచ్చ‌టించేందుకు చైనా ప్ర‌య‌త్నించింది. అయితే మిగ‌తా స‌భ్య‌దేశాల‌న్నీ ఇందుకు విరుద్ధంగా మాట్లాడాయి. అంత‌ర్జాతీయ ఏకాభిప్రాయం ఎలా వుందో వినిపించుకునే వాళ్ళ‌కు తెలుస్తుంద‌ని - UNలో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. కాశ్మీర్ అంశాన్ని అంత‌ర్జాతీయం చేయ‌డానికి చైనా ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు ప్ర‌య‌త్నించింది. భ‌ద్ర‌తామండ‌లిలో నూత‌న స‌భ్యుల‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి చైనా చేస్తున్న ప్ర‌య‌త్న‌మిద‌ని అక్బ‌రుద్దీన్ అన్నారు.

15 మంది స‌భ్యులు క‌ల UN భ‌ద్ర‌తా మండ‌లిలో ప్ర‌తి సంవ‌త్స‌రం మార్పులు జ‌రుగుతూ వుంటాయి. గ‌త సంవ‌త్స‌రం వున్న ఐదుగురికి బ‌దులు ఈ సంవ‌త్స‌రం ఐదుగురు కొత్త‌వారు వ‌స్తారు. మారిన ప‌రిస్థితిలో కొత్త స‌భ్యుల ఆలోచ‌నా ధోర‌ణి వేరుగా వుంటుంద‌ని - చైనా భావించి వుండ‌వ‌చ్చు. అయితే చైనా, పాకిస్తాన్ వాద‌న‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. కాశ్మీర్ వ్య‌వ‌హారం భార‌త్ - పాకిస్తాన్‌ల మ‌ధ్య తేలాల్సిన ద్వైపాక్షిక అంశ‌మ‌ని, ప్ర‌పంచానికి కంత‌టికీ తెలిసిపోయింది.

UNలోని అన్ని స‌భ్య దేశాల‌కు అవ‌గ‌త‌మైన ఈ విష‌యం - చైనా, పాకిస్తాన్ లు కూడా తెలుసుకోవాల్సిన అవ‌సరం వుంద‌ని అక్బ‌రుద్దీన్ అన్నారు.

ఉగ్ర‌వాదాన్ని పాకిస్తాన్ జాతీయ విధానంగా అమ‌లు చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. నిబ‌ద్ద‌త క‌లిగిన ఏ దేశం ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌దు, నిబ‌ద్ద‌త గ‌ల దేశంతో సంప్ర‌దించేందుకు భార‌త్ ఎప్పుడూ సిద్ధ‌మేన‌ని అన్నారు.

370 అధిక‌ర‌ణం ర‌ద్దు అంశాన్ని లేవ‌నెత్త‌డానికి పాకిస్తాన్ త‌ర‌చూ ప్ర‌య‌త‌నిస్తూనే వుంది. అయితే ఈ వ్యూహం పాకిస్తాన్ కు ఎటువంటి ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ త‌న ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు - భార‌త అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను ప్ర‌స్తావించ‌టం అల‌వాటుగా చేసుకున్నారు.

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. అంతేగాకుండా అంత‌ర్గ‌త క‌ల్లోలాన్ని కూడా చ‌విచూస్తోంది. వీటిని క‌ప్పి పుచ్చుకునేందుకు పాకిస్తాన్ ప్ర‌ధాని భార‌త వ్య‌తిరేక ప్ర‌చారాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆ దేశ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇవి దోహ‌ద‌ప‌డ‌వ‌ని ఆయ‌న గుర్తించాలి.

మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సూచిలో ద‌క్షిణాసియా దేశాల్లో పాకిస్తాన్ ది అట్ట‌డుగు స్థానం. ఆ దేశంలోని 65 మిలియ‌న్ల ప్ర‌జ‌లు క‌డు పేద‌రికంలో వున్నారు. మెజార్టీ పాకిస్తాన్ మ‌హిళ‌లు పేద‌రికాన్ని అనుభ‌విస్తూ త‌మ హ‌క్కుల‌ను కోల్పోతున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఇప్ప‌టికైనా భార‌త్ గురించి మాట్లాడం మాని - పాకిస్తాన్ ప్ర‌జ‌ల‌కు తాను హామీ ఇచ్చిన సంక్షేమ రాజ్య‌స్థాప‌న కోసం కృషి చేయాలి.




ర‌చ‌న : కౌషిక్ రాయ్‌, ఆకాశ‌వాణి వార్తా విశ్లేష‌కులు




Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం