లవ్ రోవ్ పర్యటనలో పటిష్టపడిన భారత్ - రష్యా సంబంధాలు
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్ రోవ్ న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ గోష్టిలో పాల్గొనడం ద్వారా భారత్ - రష్యాల మధ్య వున్న అపూర్వ బంధాలు మరింతగా పటిష్టం చేసుకునేందుకు అవకాశం లభించింది. ఇరాన్, లిబియా, సిరియాలతో సహా ప్రాంతీయ పరిస్థితులపై ఆయన - భారత్ విదేశాంగ మంత్రి డా.ఎస్.జయశంకర్ తో లోతుగా చర్చించారు. ఆ తరువాత ప్రధానమంత్రి మోదిని కలుసుకుని చర్చలు జరిపారు. గత సంవత్సరం పలు అంశాలపై భారత్ - రష్యా దేశాల మధ్య పలు ఒప్పందాలు, అవగాహనలు కుదిరాయని, న్యూఢిల్లీ - మాస్కోల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2020ను వీటి అమలు సంవత్సరంగా పాటించాలని ప్రధానమంత్రి మోది ఈ సందర్భంగా లవ్ రోవ్ కు సూచించారు.
మధ్య ప్రాచ్యంలో పెరిగిపోతున్న ఉద్రిక్తలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై దాని ప్రభావం, పర్షియా గల్ప్ రాజకీయాలపై ఏర్పడే ప్రభావం వంటి అంశాలను లవ్ రోవ్ భారత విదేశాంగ మంత్రితో చర్చించారు. 2020 సంవత్సరం తొలి రోజుల్లో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చలు - ఈ సంవత్సరంలో రానున్న కాలంలో మరిన్ని చర్చలు, సదస్సులకు నాంది పలికాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోది గత సంవత్సరం సెప్టెంబర్ లో 20వ భారత్ రష్యా వార్షిక సదస్సు సందర్భంగా వ్లాదివొస్టాక్ లో సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు భారత్ సందర్శన మూలంగా ఈ ఏడాది ఇరువురు నేతలు మరోసారి సమావేశం అయ్యే అవకాశం వుంది. కాగా ఇరు దేశాధినేతలు జి-20 సదస్సు, బ్రిక్స్ సదస్సు, షాంగై సహకార సంస్థ సదస్సు వంటి వాటిలో కలుసుకోనున్నారు. విక్టరీ డే 75 వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోది మే మాసంలో మాస్కో వెళ్ళనున్నారు.
భారత్ - రష్యాల మధ్య వున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై లవ్ రోవ్ - భారత్ విదేశాంగ మంత్రితో కీలక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.
భారత్ - రష్యా దేశాలు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కుంటున్న ఎన్నో ఆటుపోట్లను సంయుక్తంగా, సమర్ధవంతంగా ఎదుర్కోగలిగాయని, బాహ్య ప్రభావాలకు లోనుకాలేదని గత సంవత్సరం జరిగిన 20వ వార్షిక సదస్సు అనంతరం - విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు పేర్కొన్నాయి. సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్ - రష్యా దేశాల మధ్య వున్న ప్రత్యేక భాగస్వామ్యం స్థిరత్వానికి ప్రతీకగా నిలిచింది.
ఇరు దేశాల మధ్య గల సంబంధాలను మరింత పటిష్ట పరుచుకునే క్రమంలో 2025 సంవత్సరం నాటి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 30 బిలియన్ల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్ళాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఇందుకుగాను ఇరు దేశాల్లో వున్న వనరులను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించాయి. నూతన సాంకేతిక రంగంలో మరీ ముఖ్యంగా అధునాతన హైటెక్ రంగాలలో సహకారానికి, పెట్టుబడులకు నూతన మార్గాలు అన్వేషించాలని నిర్ణయించాయి. సైనిక, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం ఎంతో కీలకమైనదిగా గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి వున్నప్పటికీ S-400 వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను అందించేందుకు భారత్ - రష్యాల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ దళాల శక్తిని మరింత బలోపేతం చేసే విషయంలో భారత్ కు రష్యా ఎప్పుడూ అండగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో భారత్ కు ఎంతగానో మద్దతు పలుకుతోంది. యుఎన్ భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్ కు రష్యా పూర్తి మద్దతు పలుకుతోంది. 48 సభ్య దేశాల న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూపులో భారత్ ప్రవేశానికి రష్యా వెన్నుదన్నుగా నిలిచింది.
ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన ఇరుదేశాల మధ్య వున్న అపూర్వ సంబంధాలను మరింతగా పటిష్టపరుచుకునేందుకు దోహదపడింది.వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత్ - రష్యా సంబంధాలు కాలపరీక్షకు నిలబడి మరింత ముందుకు సాగే దిశగా కొనసాగుతున్నాయి.
రచన - రంజిత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్

Comments
Post a Comment