భార‌త్ - ల‌త్వియా సంబంధాల‌లో స‌రికొత్త ఊపు

ల‌త్వియా విదేశాంగ మంత్రి ఎడ్గ‌ర‌స్ రింకే విక్స్ భార‌త్ అధికార ప‌ర్య‌ట‌న ఇరుదేశాల మ‌ధ్య సంబంధాల‌కు స‌రికొత్త వూపు నిచ్చింది. భార‌త ఐటి, న్యాయ‌శాఖ మంత్రి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ 2016 సెప్టెంబ‌ర్ లో ల‌త్వియాలో ప‌ర్య‌టించారు. ల‌త్వియా ప్ర‌ధాని 2017 న‌వంబ‌ర్ లో తొలిసారిగా భార‌త్ ను సంద‌ర్శించారు. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు 2019 ఆగ‌స్టులో ల‌త్వియాలో ప‌ర్య‌టించారు.

ల‌త్వియాతో భార‌త్ సంబంధాలు వంద సంవ‌త్స‌రాల‌నాటివి. లీగ్ ఆఫ్ నేష‌న్స్ లో ల‌త్వియా 1921 సెప్టెంబ‌ర్ 22న స్వ‌తంత్ర స‌భ్య‌త్వం పొందింది. 1920 జ‌న‌వ‌రి 10 నుంచి వ్య‌వ‌స్థాప‌క స‌భ్యురాలైన భార‌త్ - ల‌త్వియాకు లీగ్ ఆఫ్ నేష‌న్స్‌లో స‌భ్య‌త్వానికి మ‌ద్ద‌తు ప‌లికింది.

విద్య‌, సాంస్కృతిక రంగాల‌లో భార‌త్ ల‌త్వియాల మ‌ధ్య తొలిద‌శ‌లో సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ల‌త్వియా విదేశాంగ‌శాఖ స‌హాయంతో రిగా విశ్వ విద్యాల‌యంలో 1923లో ల‌త్వియా మేధో స‌హ‌కార జాతీయ క‌మిటీ ఏర్ప‌డింది. భార‌త్ రెండ‌వ రాష్ట్ర‌ప‌తిగా ప‌ని చేసిన డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ 1930లో మేధో స‌హ‌కార అంత‌ర్జాతీయ క‌మిటీలో భార‌త్ కు ప్రాతినిధ్యం వ‌హించారు.

1946లో ప్యారిస్ లో ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన విద్యా, సాంస్కృతిక‌, వైజ్ఞానిక సంస్థ - UNESCO ఏర్పాటులో భార‌త్ కీల‌క పాత్ర వ‌హించింది.

బాల్టిక్ చ‌రిత్ర‌లో జాన‌ప‌ద సాహిత్యం అన్న అంశంపై JNU కు చెందిన ప్రొఫెస‌ర్ సాధ‌న నైథ‌ని ర‌చించిన పుస్త‌కాన్నిల‌త్వియా విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో ఆవిష్క‌రించారు. బాల్టిక్ జాన‌ప‌ద గీతాలు, ఆ దేశ స్వ‌తంత్ర పోరాటంలో వాటి పాత్ర వంటి అంశాలు ఈ పుస్త‌కంలో వ‌ర్ణించారు.

అహింసా ప‌ద్ద‌తిలో గాంధీజీ సాగించిన స్వాతంత్ర సంగ్రామం, దాని విజ‌యం ప‌ట్ల ల‌త్వియాలో పూర్తి అవ‌గాహ‌న వుంది. 1991లో అహింసాత్మ‌క స్వాతంత్ర పోరు ద్వారా ఆవిర్భ‌వించిన నూత‌న ల‌త్వియాను భార‌త్ స్వాగ‌తించింది. రాజ్ ఘాట్ లోని గాంధీజీ స‌మాధి వ‌ద్ద పుష్ప‌గుచ్చాన్ని వుంచి ల‌త్వియా విదేశాంగ మంత్రి రింకె విక్స్ త‌న భార‌త్ ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించారు.

భార‌త్ - ల‌త్వియా దేశాల మ‌ధ్య సంబంధాల‌కు చ‌రిత్ర పునాదిగా నిలుస్తోంది. రిగా విశ్వ‌విద్యాల‌యంలో సుమారు 1500 మంది భార‌త విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. భార‌త అధ్య‌య‌నం, సంస్కృతిపై 2013లో ఆ విశ్వ‌విద్యాల‌యంలో ఒక కేంద్రం ప్రారంభ‌మ‌య్యింది. న్యూఢిల్లీలోని JNU, హ‌రిద్వార్ లో దేవ్ సంస్కృతి విశ్వ‌విద్యాల‌యం భార‌త్ - బాల్టిక్ సంస్కృతుల‌పై అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్స్ ను ప్ర‌చురించాయి.

బాల్టిక్ స‌ముద్ర ప్రాంతంలో వున్న దేశాల‌లో ఒక‌టైన ల‌త్వియా డిజిట‌ల్ ప‌రిజ్ఞానాన్ని ప్ర‌జ‌ల సాధికార‌త‌కు, వారి సామాజిక‌, ఆర్థిక అభివృద్ధికి విస్తృతంగా వినియోగించుకుంటోంది. భార‌త్ త‌న డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మం ద్వారా దీనిలో భాగ‌స్వామి కావ‌చ్చు. డిజిట‌ల్ రంగంలో భార‌త్ - ల‌త్వియా దేశాల మ‌ధ్య స‌హ‌కారానికి ఎంతో అవ‌కాశం వుంది.

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది 2015 మార్చిలో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫ‌ర్ ఆల్ ఇన్ ద రీజియ‌న్ (సాగ‌ర్‌)విధానం ద్వారా హిందూ మ‌హాస‌ముద్రంలో భార‌త్ ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌ముద్ర‌యాన కార్య‌క‌లాపాల్లో మంచి ప‌ట్టు వున్న ల‌త్వియా హిందూ మ‌మా స‌ముద్ర జ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌లో బార‌త్‌కు దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌దు.

భార‌త్ - ల‌త్వియా దేశాల మ‌ధ్య స‌ముద్ర యాన సంబంధాలు మ‌రింత ప‌టిష్ట ప‌డ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది. UN భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ 2020 జూన్‌లో రెండు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి గ‌ల శాశ్వ‌త స‌భ్య‌త్వం లేని స‌భ్య దేశంగా ఎన్నిక‌య్యే అవ‌కాశం వుంది. కాగా 2026-27 సంవ‌త్స‌రానికి ల‌త్వియా UNESCO లో ఇటువంటి స‌భ్య‌త్వాన్ని ఆశిస్తోంది. స‌మాన బ‌హుళత్వం కోసం ఇరుదేశాలు క‌ట్టుబ‌డి వున్నాయి. UN భ‌ద్ర‌తా మండ‌లి ప‌ని తీరులో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌, ఐదుగురు శాశ్వ‌త స‌భ్య‌దేశాల విటో అధికారాన్ని ర‌ద్దు చేయ‌టం ద్వారా ఇది సాధ్య‌మ‌వుతోంది. అంత‌ర్జాతీయ స‌హ‌కారం ప్రాతిప‌దిక‌న సంస్క‌రింప‌బ‌డిన బ‌హుళ‌త్వం ద్వారా భార‌త్‌, ల‌త్వియా దేశాలు ఈ లక్ష్యాల‌ను సాధించ‌గ‌లుగుతాయి.

2020 సెప్టెంబ‌ర్ 21న ప్రారంభ‌మ‌య్యే ఐక్య‌రాజ్య‌స‌మితి 75వ వార్షికోత్స‌వ స‌మావేశాల్లో ఇరు దేశాల‌కు ఇందుకు తొలి అవ‌కాశం క‌లుగుతుంది.

ర‌చ‌న : అశోకెముఖ‌ర్జీ, UNలో భార‌త్ మాజీ శాశ్వ‌త స‌భ్యుడు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం