సామాజిక ఆర్థికాభివృద్ధికి శాస్త్రీయ సంభావ్యత

సైన్స్ కాంగ్రెస్ 107 వ ఎడిషన్లో, జాతీయ నాయకులు శాస్త్ర ప్రయోజనాలు మరింతమందికి చేరువయ్యేలా ప్రయోగశాలకు భూమికి, ప్రయోగశాలకు శ్రామికులకు, ప్రయోగశాలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని పిలుపు ఇచ్చారు.


'సైన్స్ అండ్ టెక్నాలజీ : గ్రామీణాభివృద్ధి' అనేది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈ ఏడాది ఇతివృత్తం. "సాంకేతికత అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటిది. వేగవంతమైన సక్రమమైన అభివృద్ధికి సమతుల్యం కావించే టెక్నాలజీకి పక్షపాతం లేదు. అన్ని వైపులా అన్ని కోణాల్లో సరిసమానంగా తటస్థంగా ఉంటుంది. మానవ మస్తిష్కానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య సమన్వయం ఉన్నప్పుడు అది అపూర్వమైన ఫలితాలను తెస్తుంది" అని బెంగళూరులో కాంగ్రెస్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .


వాతావరణ మార్పు, భూతాపం రూపాలలో ప్రపంచం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం, అమెజాన్ లోని ఘోరమైన కార్చిచ్చు అసంకల్పతమైనా కావచ్చు లేదా మానవ నిర్లక్ష్యానికి తార్కాణంగా భావించవచ్చు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం పర్యావరణ మార్పు వలన సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు గా వీటిని హెచ్చరించారు. అనూహ్యమైన రీతిలో వృక్ష జాల, జంతుజాల వినాశనానికి ఇది దారితీస్తుంది. 




గర్జించే తుపానులు, ఉగ్రమైన పెను మంటలు, కరువు కాటకాలు ,భూకంపాల వంటి అనేక రూపాలలో ప్రకృతి కోపాన్ని మనం చవి చూస్తున్నాం. అందరం కలిసి వాతావరణ మార్పుకు సరియైన పరిష్కారాన్ని అన్వేషించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ లో తన ముగింపు ఉపన్యాసంలో అన్నారు 




భూగోళపు మరోవైపు సంభవిస్తున్న ఇటువంటి విపత్తులపై భారత్ ఉదాసీనంగా ఉండలేదు.ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా అనుసంధానించబడి ఉండటంతో, వాతావరణ మార్పు ప్రభావం మనపై కూడా ఉండవచ్చన్న అంశాన్ని విస్మరించలేం. అది మన వాకిటే పొంచి ఉంటుంది. 




మన కృషి సారాంశం మెరుగైన జీవన నాణ్యత కానీ కేవలం పరిఢవిల్లే సౌభాగ్యం కాదు అని ఉప రాష్టప్రతి అభిప్రాయపడ్డారు 




విశాలమైన మన దేశ అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ పరిరక్షణకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలందరూ తమ మస్తిష్కాలకు కలిసికట్టుగా పదును పెట్టాల్సిన అవసరం ఉంది. అత్యవసరంగా శాస్త్రీయ పరమైన దృష్టి సారించవలసిన అనేక జాతీయ సమస్యలు మనకు ఉన్నాయి. అవి వ్యవసాయం కావచ్చు. ఆరోగ్య 

రక్షణ కావచ్చు. భారత ప్రజల జీవన ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరిచేందుకు వ్యవసాయ సంక్షోభం, వ్యాధుల సంక్రమణ వంటి సమస్యలను ఎదుర్కోవాలి. 




సామాజిక పథకాలు, వ్యవసాయ విధానాలు,ఆరోగ్య సంరక్షణ అంశాలు సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగయ్యాయి. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు, దేశం లోని ఆఖరు భూభాగం వరకు ఈ ప్రయోజనాలు అందేట్టు గా సుస్థిరంగా ఈ కృషి కొనసాగాలి. అయితే మన దేశ వైశాల్యం, జనాభా పరిణామాల దృష్ట్యా ఇది చాలా కష్టమైన ప్రయత్నం. మన విధాన రూపకర్తలకు, పాలకులకు ,శాస్త్రవేత్తలకు ఇది ఒక సవాల్.




విజ్ఞాన శాస్త్ర విషయాల కొలమానం మనం ప్రచురించే పరిశోధనా పత్రాల సంఖ్య పైన, ఖర్చు చేసిన ధనం పైనా కారాదు. మన సామాజిక భవిష్యత్తుకు హాని కలగకుండా మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన పరిష్కారాలు కనుగొనడం లో సాయ పడితేనే శాస్త్ర విజ్ఞానానికి పరిపూర్ణత చేకూరుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. 




జర్మనీకి చెందిన నోబెల్ గ్రహీత స్టీఫెన్ W హెల్ అభిప్రాయం మేరకు పెద్ద పెద్ద ఆవిష్కరణలను ప్రణాళికాబద్ధంగా చేయలేం. అలాగే సైన్స్ పై కూడా ఎన్నెన్నో భ్రమలు కలుగు ఉండరాదు వాస్తవ సమాజ సమస్యలు అగుపడని బ్లూస్కై రిసెర్చ్ పై హెల్ అభిప్రాయం సగటు మనిషి ఆశలకు ఆకాంక్షలకు కోరికలకు అనుకూలంగా ఉండదు. 
మన దేశంలో అపారమైన మానవ వనరులు ఉన్నాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సర్ సి వి రామన్, మేఘనాథ్ సాహా, శ్రీనివాస రామానుజన్, హోమి జె బాబా, జగదీష్ చంద్రబోస్ తదితర మహనీయుల పరిశోధనపలాలు అనుభవించిన దేశం మనది. యువ మస్తిష్కాలు శాస్త్రీయ మార్గాల వైపు మళ్లేలా ప్రోత్సహించే జాతీయ పర్యావరణ వ్యవస్థ మనకుంది.ప్రధానమంత్రి అన్నట్లు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి, దేశాన్ని శాస్త్రీయంగా తీర్చిదిద్దేందుకు, innovate, patent,produce, and prosper అనే పలుకుల ఆచరణ అవశ్యకత యెంతైనా ఉంది. 




రచన :N.భద్రన్ నాయర్,ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఇండియన్ సైన్స్ జర్నల్

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం