సైన్యాధిపతి పదవిని బైండోవర్ పొడిగింపులో ఉంచిన పాకిస్తాన్
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమార్ బాజ్వా పదవీ కాలం రెండు వేల పందొమ్మిది నవంబరు తో ముగియవలసి ఉంది. అయితే ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒక నోటిఫికేషన్ ద్వారా 2019 ఆగస్టులో ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించారు. బాలాకోట్ వైమానిక స్థావరాలపై దాడి, పుల్వామా ప్రేలుడు సంఘటన, జమ్మూ కాశ్మీర్ లో భారత రాజ్యాంగ పరమైన మార్పులు, నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్తాన్ కు జాతీయంగా ప్రాంతీయంగా భద్రతా వాతావరణం అనువుగా లేదన్న ఒక మిషతో అత్యంత ప్రత్యేక పరిస్థితి చోటు చేసుకుందంటూ ఖాన్ ప్రభుత్వం తన ఈ చర్యను సమర్ధించుకుంది.
అయితే సుప్రీం కోర్టు నవంబర్ ఇరవై ఆరున ఈ పదవీకాల విస్తరణను సస్పెండ్ చేయటం ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. ఆర్మీ చట్టంలో రెండు వందల నలభై మూడు అధికరణం క్లాజ్ మూడు ప్రకారం లోపం ఉందని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. ఇందులో పదవీ కాల విస్తరణ గురించిన ప్రస్తావన లేదని తెలియజేసింది. ఈ పొడిగింపుకు గల కారణాలను హేతుబద్ధతను ప్రశ్నించింది. విధాన పరమైన అవకతవకలు లొసుగులను పేర్కొంది. సీనియర్ సిబ్బంది పదవీకాలం పొడిగింపు, పునర్ నియామకం కోసం ఒక చట్టాన్ని రూపొందించాలని పిటిఐ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అది విఫలమైతే ఆరు నెలల తర్వాత బాజ్వాను పదవి విరమణ అయిన వ్యక్తిగా ప్రకటిస్తామని తెలియ జేసింది.
పార్లమెంటులో ఏదైనా చట్టాన్ని తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీల మద్దతు అవసరం అనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అందుకనే సుప్రీం కోర్టు ఉత్తరువు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురి చేసింది. వాస్తవానికి పార్లమెంటు చట్టం ద్వారా రాజ్యాంగ సవరణను తీసుకురావటమే శాశ్వతమైన పరిష్కారం. అయితే ఇందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరం. గతంలో సైన్యాధిపతుల పదవీకాల పొడిగింపు లన్నీ ఎటువంటి చట్టం లేకుండా సంప్రదాయంగా అలవాటుగా జరిగిపోయాయన్న విషయాన్ని గమనించాలి.
సైనిక విభాగపు సలహా మేరకు పిటిఐ ప్రభుత్వం ప్రతిపక్షాలపై తన వైఖరిని తమకు అనుకూలంగా మరల్చుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.జాతీయ అసెంబ్లీ, సెనేట్ లలో సేవల బిల్లు ఆమోదానికి వారి మద్దతు కూడగట్టుకునే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలతో సంభాషణలు ప్రారంభించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో పిఎంఎల్ ఎన్ కు చెందిన రానా సనావుల్లా కు బెయిల్ లభించింది. మాజీ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి వైద్య కారణాలతో బెయిల్ లభించింది. నవాజ్ షరీఫ్ లండన్ నుంచి పాకిస్తాన్ కు తిరిగి వచ్చారు.అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి విమర్శలు చేయలేదు. ఇవన్నీ రెండు వేల ఇరవై జనవరి ఏడున సేవల చట్టాన్ని ఆమోదించటానికి మార్గం సుగమం చేసాయి. అయితే కేవలం సైన్యానికి మాత్రమే కాక అన్ని సేవల విభాగాల ముఖ్యుల పదవీ కాలాలు నియంత్రించడానికి కూడా. ప్రధాన ప్రతిపక్షాలయిన PMLN, PPP పార్టీలు వ్యతిరేకించకుండా ఇవి ఆమోదం పొందాయి. అయితేేేే JUIF, జమైతే ఇస్లామి,PTM వంటి కొన్ని పెద్ద పక్షాలు మాత్రం వాకౌట్ చేసాయి.
అయితే సేవల విభాగాల అధిపతుల బిల్లు ముసాయిదాపై మాత్రం వివాదం చెలరేగింది. వారి తిరిగి నియామకం, పదవీ కాల పొడిగింపు అంశాల్లో దేశాధ్యక్షుడికి ఆమోదం తెలపడంలో మరిన్ని విచక్షణా అధికారాలు ఉంటాయా అన్న ప్రశ్నలు లేవనెత్తారు. బాజ్వా పదవీ కాలానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు న్యాయ సమీక్షకు దాఖలైనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నదని కొందరు ప్రశ్నించారు. ఖాన్ ప్రభుత్వ న్యాయశాఖ గందరగోళంగా ఉందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఈ పిటిషన్ కు ఆమోదం లభించినా, తిరస్కరణకు గురైనా పర్యవసానాలు ఎలా ఉంటాయి.
సేవల విభాగాల బిల్లులు చాలా అస్పష్టంగా ఉన్నాయి. నివేదికల ప్రకారం మూడు దళాల అధిపతుల పదవీ విరమణ వయస్సును అరవై నాలుగు సంవత్సరాలకు పెంచారు. అదనంగా ఇది సైన్యాధిపతి పదవీ కాలాన్ని మరింత పొడిగించడానికి దేశ ప్రధానమంత్రికి వీలు పడు తుంది . అయితే ఇది సాధ్యపడుతుందా? నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అలా చేయటానికి ప్రయత్నించిన విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఫలితంగా సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పటిష్టమైన పాకిస్తాన్ కు ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అన్నదే ఉత్తమమైన వ్యూహమన్న వాదనను నిరవధికంగా వాయిదా వే సారు. అయితే ప్రతిపక్షాలు, అవినీతికి సంబంధించిన సందర్భాలలో ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు ఆశిస్తాయి. ఏతావాతా అవినీతి రహిత నయా పాకిస్తాన్ కల ప్రస్తుతానికి ముగిసింది.
రచన: Dr. జైనాబ్ అఖ్తర్, పాకిస్తాన్ పై వ్యూహాత్మక విశ్లేషకులు.

Comments
Post a Comment