ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చే మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భారీ పెట్టుబడి ప్రణాళికను ఆవిష్కరించిన భారత్
ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాల్లోని ఉత్పాదక భాగస్వాములను విశిష్ట రీతిలో సంఘటితం చేస్తూ కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో కూడిన భారీ మౌలిక వసతుల పెట్టుబడి ప్రణాళికను ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ మేరకు 2024-25కల్లా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు రంగాల నుంచి 39:39:22 నిష్పత్తిలో మూలధన వ్యయ వాటాకింద 102 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ శ్రేయో సంకల్పాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గడచిన ఆరేళ్లలో మౌలిక వసతుల కల్పనపై కేంద్ర, రాష్ట్రాలు ఖర్చు చేసిన మొత్తం 51 లక్షల కోట్లతో పోలిస్తే తాజా ప్రణాళికలో పెట్టుబడులు ప్రశంసనీయమైన వృద్ధిని సూచిస్తున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థలో గిరాకీ మందగమనం దృష్ట్యా వేగం పెంచే దిశగా ప్రభుత్వ పెట్టుబడులు ఒక మార్గం కాగా, ప్రభుత్వ వినియోగ వ్యయంతోపాటు ఎగుమతులను పెంచడం మరో రెండు మార్గాలు. కేంద్రం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల మూలధన వ్యయం పెంపుపై ప్రధానంగా దృష్టి సారించడంతోపాటు ఆ దామాషాకు తగినట్లు రాష్ట్రాలుసహా ప్రైవేటు రంగం నుంచి వాటి సామర్థ్యం మేరకు భాగస్వామ్యం తోడుకావాలి. తద్వారా గిరాకీ మందగమన రుగ్మతను పారదోలడం సాధ్యమన్నది ఈ ఆలోచన వెనుకగల తిరుగులేని వ్యూహం. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ వృద్ధి, దేశ ప్రగతి కోసం సుస్థిర, గణనీయ రీతిలో పెట్టుబడుల ‘ప్రవాహానికి’ ఇది తోడ్పడుతుంది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి-IMF నిబంధన IV ప్రకారం సంస్థ ప్రతినిధి బృందం భారత ఉన్నతాధికార బృందంతో సంప్రదింపులు నిర్వహించింది. అనంతరం ఇటీవల విడుదల చేసిన నివేదికలో ‘‘ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉందం’’టూ సముచిత ప్రకటన చేసింది. ఆ మేరకు విమానాశ్రయాలు, రహదారులు, టెలికాం, విద్యుదుత్పాదన వంటి రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక వ్యవస్థ పరంగా భారీ పెట్టుబడులు సమకూర్చడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించింది. దేశాన్ని 2024-25కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే చాటారు. ఈ దిశగా ఆధునిక మౌలిక సదుపాయాల కోసం 100 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రణాళికలను నిరుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించడం గమనార్హం. దీంతో ప్రధానమంత్రి దార్శనిక ప్రణాళిక అమలుకు అధికారులు తక్షణమే సిద్ధమయ్యారు. తదనుగుణంగా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ‘అతనూ చక్రవర్తి’ అధ్యక్షుడుగా సీనియర్ అధికారులతో ఆఘమేఘాలమీద కార్యాచరణ బృందం ఏర్పాటైంది. అటుపైన ‘‘జాతీయ మౌలిక వసతుల శృంఖలం’’-NIPలో భాగంగా 18 రాష్ట్రాల్లో 102 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఈ బృందం గుర్తించింది. ఇవేకాకుండా మరో 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను త్వరలోనే ఇందులో చేర్చనుంది. ఈ ప్రణాళికలో మిగిలిన రాష్ట్రాలను మినహాయించే యోచనేదీ లేదని, సంబంధిత శృంఖల విభాగాల ఏర్పాటుకు కొన్ని రాష్ట్రాలు ఇంకా ముందుకు రాలేదని శ్రీమతి సీతారామన్ చెప్పారు.
మౌలిక సదుపాయాలు చక్కగా అభివృద్ధి చెందితే ఆర్థిక కార్యకలాపాల స్థాయి బాగా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ ఆదాయ మార్గాలు మెరుగుపడి అదనపు ఆర్థిక శక్తికి దారితీయడమేగాక ఉత్పాదక రంగాల్లో వ్యయ నాణ్యతకు భరోసా లభిస్తుంది. ‘జాతీయ మౌలిక వసతుల శృంఖలం’-NIP ఒక విధాన స్తంభంగా ఆవిష్కృతం కావడంలోని ఔచిత్యం ఇదే. మరిన్ని మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రారంభానికి, వ్యాపార వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి, జీవన సౌలభ్యం మెరుగుపడటానికి కూడా NIP తోడ్పడుతుందని అంచనా. అలాగే మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులోకి వచ్చి, ఈ సార్వజనీన అభివృద్ధి కార్యక్రమంద్వారా అసమానతల దుష్ప్రభావాన్ని తగ్గించే వీలు కలుగుతుంది. ప్రస్తుతం వెల్లడైన వివరాల ప్రకారం... మొత్తం పెట్టుబడి వ్యయంలో సాగునీరు, గ్రామీణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు 7.7 లక్షల కోట్ల రూపాయల చొప్పున కేటాయించబడతాయి. ఇందులో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం 3.07 లక్షల కోట్లు పోగా- మిగిలిన నిధులను వ్యవసాయం, సామాజిక మౌలిక సౌకర్యాల కల్పన కోసం వినియోగిస్తారు. రహదారి ప్రాజెక్టులకు 19.63 లక్షల కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు 13.68 లక్షల కోట్లు చొప్పున ఖర్చుచేస్తారు. రేవుల అభివృద్ధికి లక్ష కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధికి 1.43 లక్షల కోట్ల వంతున ఖర్చు చేస్తారు. పట్టణ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో 16.29 లక్షల కోట్లు, టెలికాం ప్రాజెక్టులుసహా ఎక్స్‌ప్రెస్‌వే, జాతీయ గ్యాస్ గ్రిడ్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాల కింద వసతుల కల్పనకు 3.2 లక్షల కోట్ల రూపాయల వంతున పెట్టుబడి పెడతారు.
జాతీయ మౌలిక వసతుల శృంఖలం-NIP నిర్దేశిత లక్ష్య సాధనలో భాగంగా కార్యాచరణ బృందం పరిధిలోగల వివిధ కార్యకలాపాల బృందాల నుంచి సంస్కరణల దిశగా అందే సూచనలను పరిగణనలోకి తీసుకోనుండటం హర్షణీయం. ఈ సూచనల్లో ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యాల ప్రాతిపదికగల ఒప్పందాల్లో సంస్కరణ, ఒప్పందాల అమలు-వివాద పరిష్కార ప్రక్రియలు కూడా అంతర్భాగంగా ఉంటాయి. ఈ ఏడాది నుంచి మధ్యకాలిక ప్రణాళికగా NIP శ్రీకారం చుట్టుకోనుండగా- ఇది ఏ అడ్డంకులు లేకుండా చక్కగా అమలయ్యేలా పటిష్ఠ పర్యవేక్షక యంత్రాంగం ఏర్పాటుకు భరోసా ఇస్తూ శ్రీమతి సీతారామన్ ప్రకటన చేయడం శుభసూచకం.
రచన: జి.శ్రీనివాసన్, సీనియర్ పాత్రికేయులు

Comments
Post a Comment