జుగ్నాథ్ ప‌ర్య‌ట‌న‌తో బ‌ల‌ప‌డిన భార‌త్ - మారిష‌స్ సంబంధాలు

మారిష‌స్ ప్ర‌ధాన‌మంత్రిగా ఈ మ‌ధ్య‌నే తిరిగి ఎన్నికైన ప్ర‌వీంద్ జుగ్నాథ్ గ‌త‌వారం భార‌త్ లో ప‌ర్య‌టించారు. భార‌త్ లో ప‌ర్య‌టించాల‌న్న జుగ్నాథ్ నిర్ణ‌యం ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాల‌కు ఇరుదేశాలు యిచ్చే ప్రాధాన్యాన్ని తెలియ‌జేస్తుంది. 1.3 మిలియ‌న్ల మారిష‌స్ జ‌నాభాలో మూడింట 2 వంతుల‌కు పైగా భార‌త సంత‌తికి చెందిన‌వారు. హిందు మ‌హాసముద్రంలోని వ‌నిల్లా ద్వీపంలో వీరు నివ‌శిస్తున్నారు. భ‌ద్ర‌తా, ఆర్థిక‌, అభివృద్ధి అంశాల‌లో రెండు దేశాలూ కూడా ఒక‌దానిపై ఒక‌టి ఆధార‌ప‌డి వుంటాయి.

జుగ్నాథ్ సంద‌ర్శ‌న‌ను న్యూఢిల్లీలోని అధికార దౌత్య వ‌ర్గాలు వ్య‌క్తిగ‌తమైన‌దిగా అభివ‌ర్ణంచిన‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది ఆయ‌న‌కు ఉన్న‌త‌స్థాయి అధికారుల‌కు ఇచ్చే అధికారిక స‌మావేశ వేదిక - హైద‌రాబాదు హౌస్ లో ఆతిథ్యం యిచ్చారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా సంబంధాల‌ను మ‌రింత లోతుగా పెంచుకోవాల‌నే ఆకాంక్ష‌ను ప‌ర‌స్ప‌రం పున‌రుద్ఘాటించారు.

అత్యంత సంర‌క్షిత‌మైన‌, సుస్థిర‌మైన‌, సంప‌న్న దేశంగా రూపొందాల‌నే మారిష‌స్ ఆకాంక్ష‌కు భార‌త్ మ‌ద్ద‌తు నిస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది తెలియ‌జేశారు.

ధృడ‌మైన మారిష‌స్ ను నిర్మించాల‌నే ఆ దేశ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు భార‌త్ హృద‌య‌పూర్వ‌క మ‌ద్ద‌తు నిరంత‌ర సంఘీభావం వుంటాయ‌ని ఈ విష‌యంలో మారిష‌స్ నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చున‌నీ ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. మారిష‌స్ ప్ర‌ధాన‌మంత్రి జుగ్నాథ్ - వివిధ అభివృద్ధి - స‌హ‌కార ప్రాజెక్టుల‌లో భార‌త్ అందిస్తున్న స‌హాయానికి ప్ర‌గాఢ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ద్వీప‌దేశ‌మైన మారిష‌స్ లో మొట్ట‌మొద‌టి మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, ప్ర‌త్యేక వ‌స‌తుల ENT ఆస్ప‌త్రి, గృహ‌నిర్మాణ ప్రాజెక్టు వంటి వాటిలో భార‌త్ స‌హ‌కారాన్ని అంద‌జేస్తోంది. ఈ ప్రాజెక్టులు మారిష‌స్ ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చిపెట్టాయి కాల‌క్ర‌మేణా భార‌త్ మారిష‌స్ తో త‌న ఆర్థిక - రాజ‌కీయ సంబంధాల‌ను జాగ్ర‌త్త‌గా పెంచుకుంటూ వ‌చ్చింది. 

మారిష‌స్ పౌరులు కూడా భార‌త్ తో గ‌ట్టి బంధాలు పెన‌వేసుకోవాల‌నే కోరుకుంటున్నారు.

మారిష‌స్ స‌ర్వ‌తోముఖాభివృద్ధి గ‌మ‌నాన్ని వేగ‌వంతం చేయాల‌ని, భార‌త్ తో స‌హ‌కార ప‌రిధిని మ‌రింత విస్తృతం చేసుకోవాల‌నేవి త‌మ నూత‌న ప్ర‌భుత్వ ప్రాధామ్యాల‌ని ప్ర‌ధాన‌మంత్రి జుగ్నాథ్ భార‌త ప్ర‌ధానికి చెప్పారు. ఈ ప్ర‌య‌త్నంలో భార‌త్ ప్ర‌ధాన భూమిక వ‌హిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌న్నారు. జుగ్నాథ్ ప్ర‌ధాన‌మంత్రిగా తిరిగి ఎన్నిక‌గానే న‌రేంద్ర‌మోది ఆయ‌న‌కు ఫోను చేసి అభినందించారు. వీలైనంత త్వ‌ర‌లో భార‌త్ కు రావాల‌ని ఆహ్వానించారు. ఇందుకు ప్ర‌తిస్పంద‌న‌గా జుగ్నాథ్ త‌మ స‌తీమ‌ణితో క‌లిసి భార‌త్‌ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చారు. త‌మ మిలిటెంట్ సోష‌లిస్టు మూవ్ మెంటు పార్టీ పార్ల‌మెంటులో మెజార్టీ గెలిచిన సుమారు నెల రోజుల అనంత‌రం ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు.

ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌వీంద్ జుగ్నాథ్ కీర్తి గాంచిన మారిష‌స్ మాజీ ప్ర‌ధాని అనిరుధ్ జుగ్నాథ్ కుమారుడు తోటి పౌరులు ఎక్కువ‌గా భార‌త సంత‌తికి చెందిన‌వారు కాగా వారి ప్ర‌యోజ‌నాల‌ను ప్రోత్స‌హించే వార‌స‌త్వం పుణికిపుచ్చుకున్నారు జుగ్నాథ్. దాదాపు రెండు శ‌తాబ్దాల క్రితం వ‌ల‌స‌వ‌చ్చి బ్రిటిషు సామ్రాజ్యంలో చెర‌కు పొలాల్లో ఒప్పంద కార్మికులుగా ప‌ని చేసిన అప్ప‌టి భార‌త వార‌సులు నేడు వ్యూహాత్మ‌కంగా ఉన్న అత్యంత ప్ర‌ధాన‌మైన‌, శ‌క్తివంత‌మైన దేశాల‌న్నీ గ‌ట్టి బంధాల‌ను కోరుకునే ద్వీప దేశ‌పౌరులు. ఎప్పుడూ కూడా భార‌త్ తో బ‌ల‌మైన బంధాలు కావాల‌నీ, వాటిని నిలుపుకోవాల‌నీ ఆకాంక్షించే మారిష‌స్ ప్ర‌జ‌లు భార‌త్ వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు, ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

ఐరోపా అన్వేష‌కులు మారిష‌స్ ను హిందు మ‌హాస‌ముద్ర‌పు తార‌గా కీల‌క‌మైన‌దిగా అభివ‌ర్ణించారు. ఐరోపా - భార‌త్ ల మ‌ధ్య క‌మ్యూనికేష‌ను స‌ముద్ర మార్గాల‌ను ప‌దిల‌ప‌ర‌చుకోవ‌టానికై ప‌ట్టు సాధించ‌టానికి యూరోపియ‌న్లు పోటీ ప‌డ్డారు.

కాగా 2015లో పోర్ట్ లూయి సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోది హిందూ మ‌హాస‌ము్ర‌దంపై త‌న వ్యూహం అంద‌రికి భ‌ద్ర‌త - వృద్ధి - సాగ‌ర్ - గురించి మాట్లాడారు.

విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (FDI) ల ప్ర‌వాహానికి మారిష‌స్ అగ్ర వ‌న‌రు అయినందున భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి చెంద‌టంలో గ‌ణ‌నీయ‌మైన పాత్ర‌ను వ‌హిస్తుంది. ఆఫ్రిక‌న్ యూనియ‌న్ (AU), హిందు మ‌హాస‌ముద్ర రిమ్ అసోసియేష‌న్ (IORA), హిందు మ‌హాస‌ముద్ర క‌మీష‌ను (IOC) - ల స‌భ్య దేశంగా ఆఫ్రికా ఖండంలోను హిందు మ‌హాస‌ముద్ర తీర దేశాల్లోను భార‌త‌దేశ వ్యూహాత్మ‌క‌, ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను మ‌రింత పెంపొందించే సామ‌ర్థ్యం మారిష‌స్‌కు వుంది.

ఈ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే ప‌ర‌స్ప‌ర ఆర్థిక - భ‌ద్ర‌తా ప్ర‌యోజ‌నాల‌ను ముందుకు కొనిపోవ‌టంలో ఇరుదేశాల పాత్ర కీల‌క‌మ‌ని గుర్తించిన మారిష‌స్ - భార‌త్ ప్ర‌ధాన‌మంత్రు లిరువురు బ‌హుముఖ ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణంలో స‌న్నిహితంగా క‌ల‌సి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించారు. అలాగే ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు, ప్రాధామ్యాల ఆధారంగా నిమ‌గ్నం కావ‌టానికి నూత‌న మార్గాల‌ను అన్వేషించాల‌ని నిశ్చ‌యించారు.

కాగా నాగ‌రిక‌త బంధాల‌ను పంచుకునే జ‌నాభా గ‌ల ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌టంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌వీంద్ జుగ్నాథ్ భార‌త్ సంద‌ర్శ‌న‌ ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌న‌టంలో ఎట్టి సందేహం లేదు.

ర‌చ‌న : రంజిత్ కుమార్‌, సీనియ‌ర్ పాత్రికేయులు


Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం