ఇజ్రాయెలీల ఆవాసాలను చట్టబద్ధం చేసిన ట్రంప్ !
వెస్ట్ బ్యాంక్ ఆక్రమిత భూ భాగంలోని ఇజ్రాయెలీల ఆవాసాల గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఒక ఆకస్మిక, అనూహ్య ప్రకటన చేశారు. సదరు ప్రకటన అంతర్జాతీయ ఏకాభిప్రాయానికి విరుద్ధం మాత్రమేగాక 1967 జూన్ యుద్ధం నాటినుంచీ అనుసరిస్తున్న అమెరికా ద్విపక్ష విధానానికి వ్యతిరేకం కావడం గమనార్హం. పైగా ఈ విషయంలో అమెరికా మునుపటి విధానం పరస్పర విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక- వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ పౌర ఆవాసాల ఏర్పాటు స్వతహాగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమేమీ కాదన్నారు. మరోవైపు ఈ ఆవాసాలతోపాటు వెస్ట్‌బ్యాంక్ స్థితిగతులు ‘ఇజ్రాయెల్-పాలస్తీనా’ చర్చల్లో తేలాల్సిన అంశాలని పాంపియో ప్రకటించారు. ఇజ్రాయెలీల ఆవాసాలంటే- 1967 జూన్ నాటి యుద్ధంలో తూర్పు జెరూసలెంసహా ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న‘సినై ద్వీపకల్పం, గోలాన్ హైట్స్, గాజా స్ట్రిప్, వెస్ట్‌బ్యాంక్’ ప్రాంతాల్లో నిర్మించిన గృహ సముదాయాలు. ఆ యుద్ధం ముగియగానే ఈ గృహ సముదాయాల నిర్మాణం మొదలైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ముందు జోర్డాన్ నియంత్రణలోగల జెరూసలెం తూర్పు ప్రాంతానికి తొలుత తన అధికార పరిధిని విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ తర్వాత తన అధీనంలోని గోలాన్ హైట్స్‌లో తొలి గృహ సముదాయ నిర్మాణం మొదలుపెట్టి, మెల్లగా ఇతర ఆక్రమిత ప్రాంతాలకూ కార్యకలాపాలను విస్తరించింది.
ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్‌లో 130 చట్టబద్ధ ఆవాసాలు ఉండగా, 100 వరకూగల అనధికార శిబిరాల్లో 4 లక్షల మంది ఇజ్రాయెలీలు నివసిస్తున్నారని అంచనా. దీంతోపాటు 1967 జూన్ యుద్ధం నిర్దేశిత సరిహద్దుకు ఆవల తూర్పు జెరూసలెంలోని 12 యూదు పరిసరాల్లో 2 లక్షల మంది ఇజ్రాయెలీలు నివసిస్తున్నారు. ఇక గోలాన్ హైట్స్‌లోని 32 ఆవాసాల్లో 22వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. పొరుగునగల అరబ్బులతో శాంతి ఒప్పందాల్లో ఇక్కడి ఇజ్రాయెలీ ఆవాసాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. కాగా, క్యాంప్ డేవిడ్‌లో ఈజిప్టుతో శాంతి ఒప్పందం వల్ల సినై ద్వీపకల్పాన్ని వదిలివెళ్లిన సందర్భంగా యామిత్ ప్రాంతంలోని ఆవాసాలను 1982లో ఇజ్రాయెల్ కూలగొట్టింది. అదేవిధంగా 2005 ఆగస్టులో గాజా స్ట్రిప్ నుంచి ఏకపక్షంగా వైదొలగినప్పుడు అక్కడి 21 ఆవాస ప్రాంతాల్లో నివసించే 8వేల మంది ఇజ్రాయెలీలను వెనక్కు తీసుకెళ్లింది. అయితే, 1990 దశకం చివరినాళ్లలో ఇజ్రాయెల్-సిరియా మధ్య చర్చలు విఫలమయ్యాయి. మౌంట్ హెర్మోన్ పరిధిలోగల తన వ్యూహాత్మక ఆస్తులను వదులుకునేందుకు ఇజ్రాయెల్ ససేమిరా అనడమే ఇందుకు కారణం.
ఆక్రమిత భూ భాగాల్లో ఇజ్రాయెల్ ఆవాసాల విస్తరణకు ఆ దేశంలోని అధికశాతం రాజకీయ పార్టీలే కారణం. కాలక్రమంలో ఆయా ఆవాసాల్లోని జనాభాయే మితవాద పార్టీలకు కీలక మద్దతుగా నిలిచింది. మొత్తంమీద ఈ ఆవాసాల అంశమే ఇజ్రాయెల్-పాలస్తీనా చర్చలకు సదా ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. పాలస్తీనా భూ భాగాల ఆక్రమణ తర్వాత అక్కడ నివసించే తమ పౌరుల కోసం ఇజ్రాయెల్ సకల సదుపాయాలూ కల్పించడమే ఇందుకు కారణం. ఆ మేరకు పాఠశాలలు, ఆస్పత్రులు, భారీ దుకాణ సముదాయాలు, బైపాస్ రోడ్లు నిర్మించింది. దీనికితోడు వాటన్నిటికీ పటిష్ఠ భద్రతసహా ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. ఆదిలో వీటన్నిటినీ పాలస్తీనా జనావాసాలకు దూరంగా నిర్మించినా క్రమేణా వారి పట్టణాలు, గ్రామాలకు సమీపంలో నిర్మాణాలు చేపట్టింది. మరోవైపు ఓస్లో శాంతి చర్చలతో ఇజ్రాయెల్ దూకుడు తగ్గుతుందని పాలస్తీనియన్లు ఆశించినప్పటికీ ఆ ప్రక్రియవల్ల ప్రయోజనం కనిపించలేదు. శ్వేతసౌధం పచ్చిక బయలులో చారిత్రక శాంతి ఒడంబడిక కుదిరిన పాతికేళ్ల తర్వాత కూడా ఇజ్రాయెలీ ఆవాసాల విస్తరణ, వలస జనాభా పెరుగుదల విస్తరించిందే తప్ప తగ్గలేదు. పాలస్తీనా పట్టణాల నుంచి ఇజ్రాయెల్ వెనక్కు వెళ్లినా అక్కడి భూ భూగంపై పెత్తనం దాని చేతిలోనే ఉండిపోయింది. పాలస్తీనా జనావాసాలకు సమీపానగల ఇజ్రాయెలీ ఆక్రమిత భూ భాగంవల్ల పాలస్తీనా ప్రాదేశిక పరిధి ముక్కలైంది. ఇజ్రాయెలీ ఆవాసాలు 4వ జెనీవా సదస్సు తీర్మానాలకు విరుద్ధమని చాలా కాలంనుంచీ అంతర్జాతీయ సమాజం కూడా అభిప్రాయపడుతోంది. కాగా, 2004లో అంతర్జాతీయ న్యాయస్థానం కూడా సదరు ఆవాసాలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది.
ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించడంతోపాటు గోలాన్ హైట్స్‌ను ఆ దేశపు అధికారిక భూ భాగంగా పరిగణిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు ఇబ్బందుల్లో ఉన్న ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు మద్దతునిచ్చింది. ఈ వివాదాస్పద నిర్ణయాలకు తోడు ఇజ్రాయెలీ ఆవాసాలపైనా ట్రంప్ ప్రభుత్వ విధానంలో మార్పు రావడం గమనార్హం. ఇజ్రాయెల్ జాతీయ చట్టసభ ‘‘కెనెసెట్’’కు ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో రెండుసార్లు ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం తొలగలేదు. మరోవైపు తనపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ జోర్డాన్ లోయ స్వాధీనమే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనట్లు నెతన్యాహు వాదిస్తున్నారు. కాగా, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన కొద్ది రోజుల్లోనే పాలస్తీనాకు స్వీయ నిర్ణయాధికార హక్కును పునరుద్ఘాటిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానానికి భారత్‌సహా 165 దేశాలు మద్దతు ప్రకటించగా కేవలం అమెరికా, నౌరూ, మైక్రోనేషియా, మార్షల్ ఐలాండ్స్ మాత్రమే ఇజ్రాయెల్‌ను సమర్థించాయి. సంపూర్ణ శాంతిభద్రతల సహితంగా ఇజ్రాయెల్‌తో సహజీవనం చేయగల సర్వ స్వతంత్ర, సర్వామోద పాలస్తీనాయే తమ ఆకాంక్షగా భారత్ తొలినుంచీ విస్పష్టంగా ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆవాసాలపై ట్రంప్ తాజా నిర్ణయం సర్వామోద పాలస్తీనా భావనను తోసిపుచ్చుతుండగా, ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
రచన: ఆచార్య పి.ఆర్.కుమారస్వామి, పశ్చిమాసియా అధ్యయన కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం

Comments
Post a Comment