శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన... బలోపేతం కానున్న బంధం
శ్రీలంక అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి వంటి ఉన్నత పదవికి ఎన్నికయ్యే నేతలు తొలుత భారత పర్యటనకు రావడం కొత్తేమీ కాదు... మునుపటి నుంచీ ఉన్నదే! అయితే, అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే గోటాబయ రాజపక్ష తొలి విదేశీ పర్యటన కోసం న్యూఢిల్లీకి రావడంలో ఒక ఆవశ్యకత, ఆశాభావం కనిపిస్తున్నాయి. శ్రీలంక- సమీప పొరుగుదేశమైన భారత్ నడుమ స్నేహసంబంధాల మాట అటుంచి ప్రస్తుత వాస్తవాలు, వాస్తవిక అంచనాల మేరకు ఉభయపక్షాలూ అవగాహనకు రావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కాగా, శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ఒకటిరెండు రోజుల్లోనే ఆయనతో సమావేశమైన విదేశీ ప్రముఖుడు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ S.జైశంకర్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా భారత్ తరఫున శుభాకాంక్షలు తెలపడంతోపాటు భారత పర్యటనకు ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన అధికారిక లేఖను గోటాబయ రాజపక్షకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ వచ్చిన ఆయన, శ్రీలంకను సందర్శించాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. తదనుగుణంగా మోదీ పర్యటన కార్యక్రమం త్వరలో ఖరారయ్యే అవకాశాలున్నాయి.
ఈ పరిస్థితుల్లో స్నేహ సంబంధాలు మునుపటి అభాసల నడుమ బందీ కాకుండా చూడాలన్న ఆవశ్యక అవగాహన ఉభయపక్షాల నుంచీ వ్యక్తమవుతోంది. ఈ అపోహలు ప్రత్యేకించి... ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’-LTTEతో శ్రీలంక ప్రభుత్వం పోరాడుతున్న కాలంలో మొదలయ్యాయి. అప్పట్లో మహింద రాజపక్ష శ్రీలంక అధ్యక్షుడు కాగా, గోటాబయ రాజపక్ష రక్షణశాఖ మంత్రిగా ఉండేవారు. అంతర్యుద్ధంలో భారత్ పూర్తిగా శ్రీలంక ప్రభుత్వానికి మద్దతు పలికింది. అదే సమయంలో తమిళ ప్రజానీకానికి సముచిత భాగస్వామ్యంపై ఒప్పందం దిశగా ఒత్తిడి తెస్తూ వచ్చింది. దీనికి అనుగుణంగా ఉమ్మడి శ్రీలంకలో తమిళులకు సముచిత వాటా అంశం ప్రస్తావన న్యూఢిల్లీ చర్చల్లో అనివార్యమైంది. వాస్తవానికి ఇది తమిళ పులులతో పోరుకు ముగింపు దిశగా శ్రీలంక ప్రభుత్వ ప్రతిపాదిత పరిష్కారమే అయినా, ఆ కృషి అసంపూర్ణంగానే మిగిలిపోయింది. గతకాలపు హామీలకు భిన్నంగా న్యాయమైన ఒప్పందం తమిళులకు అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించగా, శ్రీలంక సానుకూల స్పందన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తమిళుల సమస్య పరిష్కారంపై మరోసారి భరోసా ఇస్తూ రాజపక్ష ఇటీవల ఒక ప్రకటన చేశారు. అధిక సంఖ్యాక సింహళీయుల ఓట్ల బలం తన విజయంలో ప్రధాన పాత్ర పోషించడం వాస్తవమేని ఆయన పేర్కొన్నారు. అయితే, దేశంలోని అల్ప సంఖ్యాక తమిళులు, ముస్లిములకూ సముచిత వాటా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గోటాబయ రాజపక్ష ప్రకటనను ఒక సానుకూల సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు శ్రీలంక విషయంలో భారత్‌కు ఆందోళనల గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టే ఈ పర్యటన సందర్భంగా చైనా లేదా పాకిస్తాన్‌తో తమ సంబంధాలు భారత్-శ్రీలంక స్నేహబంధాన్ని ప్రభావితం చేసే పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు. వివాదాస్పద హంబన్‌టోటా రేవు ప్రాజెక్టును చైనాకు అప్పగించడం ఒక తప్పిదం కావచ్చునని కూడా ఆయన అంగీకరించారు. ఇదంతా చూస్తుంటే రాజపక్ష పారదర్శక ఆలోచన విధానంతో బాధ్యతలవైపు సాగుతారన్న ఆశాభావం కలుగుతోంది.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా శ్రీలంకలో వివిధ పథకాల కోసం 450 మిలియన్ డాలర్ల మేర దశలవారీ రుణసాయాన్ని భారత్ ప్రకటించింది. ఈ సాయంతో పోలిస్తే చైనా నుంచి శ్రీలంకు లభించిన ఆర్థికపరమైన హామీలు భారీగానే ఉన్నాయి. కానీ, శ్రీలంక మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో భారత్‌కు మంచి పేరుంది. అలాగే పెద్ద ప్రాజెక్టులు, భారీ నగదు రుణాలు ఈ ద్వీపదేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరం కాదన్న అవగాహన శ్రీలంక ప్రజల్లో పెరుగుతోంది. మరోవైపు భారీ పెట్టుబడులకు, వాటిపైగల అంచనాలకు పొంతనే ఉండదన్న వాస్తవాన్ని హంబన్‌టోటా రేవు, మత్తల అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులే నిరూపిస్తున్నాయి. కాబట్టి వాస్తవిక దృష్టితో వ్యవహరిస్తే భారత-శ్రీలంక ద్వైపాక్షిక బంధం ఉభయతారకం కాగలదనడంలో సందేహం లేదు. కాగా- తన పదవీ కాలంలో భారత-శ్రీలంక సంబంధాలను అత్యున్నత స్థాయికి చేర్చాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు గోటాబయ రాజపక్ష ప్రకటించారు. చారిత్రంగానేగాక రాజకీయంగానూ రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సానుకూల దృక్పథాన్ని బట్టి భారత-శ్రీలంక సంబంధాలపై ఆయన తాజా వైఖరితో ముందడుగు వేస్తారని ఆశించవచ్చు!
రచన: ఎం.కె.టిక్కూ, రాజకీయాంశాల వ్యాఖ్యాత

Comments
Post a Comment