కష్టకాలంలో ఇమ్రాన్ ఖాన్

అమెరికాలో పత్రికా ప్రతినిధులతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల స్పందించిన తీరు పట్ల తన విచారాన్ని వ్యక్తంచేశారు. ఇలా అనడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ప్రపంచ మీడియా ‘హౌడీ మోది’ ఈవెంటుపై ఎక్కువ పెట్టుబడి పెట్టాయి. రెండవది టర్కీ, మలేసియాల నుంచి ఏదో కొద్ది స్పందన వస్తే, ఇతర ముస్లిం దేశాలు ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను, విజ్ఘప్తులను లెక్కచేయకపోవడం రెండవ ముఖ్య అంశం. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 74వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భారత శైలి పాకిస్తాన్‌ను మరింత బలహీనపరిచింది. పెద్ద ఎత్తున పాకిస్తాన్‌లో స్పందన అనంతరం ఇమ్రాన్ ఖాన్ యుఎన్‌జిఎలో చేసిన ప్రసంగ సామర్థ్యంపై పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా భారత్‌తో కశ్మీర్ అంశంపై ఎలాంటి వ్యూహాత్మక తీరు ఉంటుందనే దానిపై పలువురు దృష్టిపెట్టారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా విమర్శల వర్సం కురిసింది. రోజు రోజుకూ పాకిస్తాన్‌లో విమర్శల తీవ్రత ఎక్కువవుతోంది. అంతర్గత రాజకీయాలకు సంబంధించి గాని, ఆర్థిక సంక్షోభంపై గానీ, అంతర్జాతీయ స్థాయిలో పలు అంశాలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఇమ్రాన్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్రమైన విమర్శ ఏమిటంటే కేవలం కశ్మీర్ అంశంపై మాట్లాడినంత మాత్రాన అది పరిష్కారం కాదు అని పలువురు వ్యాఖ్యానించారు. సమగ్రమైన విధానం దీనికి అవసరమని అన్నారు. అంతేకాదు సరికొత్త, సుదీర్ఘకాలంతో కూడిన విధానం అవసరాన్ని పేర్కొన్నారు. పాకిస్తాన్ పీలుల్స్ పార్టీ (పిపిపి) అధ్యక్షుడు బిల్వాల్ భుట్టో జర్దారీ యుఎన్‌జిఎలో ఇమ్రాన్ ఇచ్చిన ప్రసంగంపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. అంతేకాదు ఇమ్రాన్ యుఎన్‌జిఎ ప్రసంగాన్ని ఎంపిక చేసిన మీడియా, వ్యాఖ్యాతలు పైకెత్తారని ఆయన విమర్శించారు. కశ్మీరీల కష్టాలను అంతర్జాతీయ వేదిక ముందు పెట్టడంలో పాక్ ప్రధాని వైఫల్యం చెందారన్నారు. ట్రంప్-ఇమ్రాన్ సమావేశం, ట్రంప్ వ్యవహారశైలిని పాకిస్తాన్‌లో పలువురు అనుమానంతోను, జాగ్రత్తగానూ గమనిస్తున్నారు. ఒకవైపు దీన్ని ‘ఫోటో-ఆప్’ గా చూస్తున్నారు. మరోవైపు కశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను వేదికపై తీసుకురావడంలో ఈ అవకాశాన్ని ఇమ్రాన్ సరిగా ఉపయోగించుకోలేకపోయారన్నారు. టివి చర్చల్లో, పాకిస్తాన్ వార్తా పత్రికల్లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో, యుఎన్‌హెచ్ఆర్‌సిలో పాకిస్తాన్ తీర్మానం ప్రవేశపెట్టలేకపోయిందని ప్రచారం అయింది. ఇది ఇమ్రాన్ ప్రభుత్వం ఎదుర్కొం టున్న అతిపెద్ద వైఫల్యంగా పేర్కొనాలి.

మానవహక్కుల ఉల్లంఘనా అంశాన్ని లేవనెత్తడం ద్వారా పాకిస్తాన్ వైపు సానుభూతిని పెంపొందించాలని ఇమ్రాన్ ఖాన్ ఆశించారు. అలాగే అంతర్జాతీయ వేదికలపై ఇండియాకు వ్యతిరేకంగా శత్రుత్వాన్ని పెంచాలని ఇమ్రాన్ వ్యూహ్యం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్కు ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) అక్టోబరు నెలలో జరిగే సమావేశంలో బ్లాక్ లిస్టింగ్‌ కాకుండానే పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడతానంటూ పాకిస్తాన్‌ని అమెరికా హెచ్చరించింది

భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఎన్‌జిఎ సమావేశంలో చేసే ప్రసంగంలో కశ్మీరీ అంశాన్ని లేవనెత్తరాదని నిశ్చయించుకున్నారు. దానికి బదులు ఉగ్రవాదంపై ప్రసంగించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం అసందర్భమైనదనే భావాన్ని కలిగించారు. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అడగాల్సిన ప్రశ్న ఒక్కటే. ఏవీ ఫలితాలు? పటిష్టమైన కార్యక్రమాలు, శక్తివంతమైన వ్యూహాల ద్వారానే మంచి ఫలితాలు వస్తాయని, ప్రసంగాల ద్వారా కాదని విశ్లేషకుల వ్యాఖ్య. కశ్మీర్ అంశంపై ప్రపంచం భారత్‌ పక్షాన నిలబడాలని నిశ్చయించుకుందని పాకిస్తాన్ భావించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఒఐసి), పాకిస్తాన్ సన్నిహిత మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యుఎఇలు సైతం పాకిస్తాన్ అండగా నిలవడానికి సందేహించాయి.

దేశీయంగా చూస్తే, పాకిస్తాన్‌ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వం చాలా కష్టకాలాన్ని చవిచూస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకతాటిపై కొనసాగే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. సమిష్టి వ్యతిరేక వ్యూహాన్ని అనుసరించాలని పథకరచన చేస్తున్నాయి. తద్వారా ఇమ్రాన్ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో, అలాగే దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడంలో వైఫల్యం చెందడం వంటి విషయాలను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి. జమైత్-ఉలేమా-ఇ-ఇస్లామ్ (ఫజల్)కి చెందిన మౌలానా ఫజల్-ఉర్-రెహ్మాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ (ఆజాది మార్చ్)ని ఈ నెలఖర నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. లాంగ్ మార్చ్ పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు. బిల్వాల్ భుట్టో జర్దారీ దేశమంతా పర్యటించి పాకిస్తాన్ ప్రజలకు ఇమ్రాన్ పిటిఐ ప్రభుత్వ వైఫల్యాలను తెలపాలని భావిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ప్రారంభించాలనుకుంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నారు. పాకిస్తాన్ తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించుకుంటే ఇస్లామాబాద్ ఎఫ్ఎటిఎఫ్ బ్లాక్ లిస్టులోకి చేరుతుంది. మరోవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్గత సమస్య, పేదలకు సవాలుగా నిలిచిన ధరల పెరుగుదల వంటివి పరిష్కరించకపోతే పాక్ ప్రభుత్వం సమీప భవిష్యత్తులోనే సాధారణ ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. అంతేకాదు సర్వత్రా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది.

రచన: డా. జైనాబ్ అఖ్తర్, పాకిస్తాన్ విశ్లేషకులు



Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం