సౌదీ అరేబియాతో భారత్ సంబంధాలు తీవ్రతరం
ఇండియా, సౌదీ అరేబియాల మధ్య సంప్రదాయ స్నేహసంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలూ వ్యూహాత్మక భాగస్వామ్యులు. వివిధ అంశాలపై కలిసి పనిచేస్తున్నాయి. ఈ సందర్భంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రెండు రోజుల పర్యటనకు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఎన్‌ఎస్ఎ క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్-సల్మాన్‌ను కలిసింది. ఆయనతోపాటు సౌదీ భద్రతా సలహాదారు ముసాయిద్ బిన్ ఐబాన్‌తో చర్చలు జరిపారు. పలు ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు వీరి సమావేశంలో చర్చకు వచ్చాయి. చర్చకు వచ్చిన ప్రముఖ అంశం ఒకటేమిటంటే ఇండియా-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు విధానాలపై చర్చలు జరిగాయి. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్-సల్మాన్‌లు కో- ఛైయిర్‌గా వ్యవహరించారు.
ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత నెలలో 74వ యుఎన్‌జిఎ సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికా వెడుతూ మార్గ మధ్యలో రియాద్‌లో దిగారు. కశ్మీర్‌పై 370వ రాజ్యాంగ అధికరణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయంగా చెడుగా ఫోకస్ చేయడానికి పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్ము,కశ్మీర్‌కు సంబంధించి భారత్ 370 అధికరణంపై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సౌదీ మద్దతు కూడా కూడగట్టుకోవాలన్నది ఇమ్రాన్ ఖాన్ పర్యటన ప్రధాన ఎజెండా.
దోవల్ సౌదీ నాయకత్వానికి భారత స్టాండును వివరించారు. సరిహద్దు ఉగ్రవాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యను నొక్కిచెప్పారు. సౌదీ అరేబియా కూడా ఉగ్రవాద బాధితురాలే. సెప్టెంబరులో అబ్‌కైక్‌లో ఉన్న రెండు అరామ్‌కో ఆయిల్ ప్రొసెసింగ్ యూనిట్లపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులకు యెమెన్‌కు చెందిన హౌథి మిలిషియా పాల్పడింది. ఇరాక్, సిరియాలలోని ఇస్లామిక్ రాజ్యం (ఐఎస్ఐఎస్) కూడా తన దాడులకు సౌదీ అరేబియాను కేంద్రంగా పెట్టుకుంది.
భారత్, సౌదీ అరేబియా రెండు దేశాలూ దక్షిణ, పశ్చిమ ఆసియాలో ఉగ్రవాదంపై యుద్ధం చేయడంలో ముందున్నాయి. తీవ్రవాదం, ఉగ్రవాదంలకు వ్యతిరేకంగా నిర్దిష్ట రూపును ముస్లిం ప్రపంచంలో ఇవ్వడంలో రియాద్ నాయకత్వ పాత్రను వహించింది. ఉగ్రవాదంపై పోరాట పరంగా భారత పటిష్టమైన పాత్రను సౌదీ అరేబియా నాయకత్వం గుర్తించింది. ఈ అవగాహన రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు బాట వేసింది. రెండు దేశాల భద్రతా ఏజెన్సీలు రాడికలిజం, ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా సహకారం ఇచ్చిపుచ్చుకోవ డానికి కూడా ఇది కారణమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద ఇరుదేశాల మధ్య భద్రతా సహకారం ఎంతో పెరిగింది కూడా.
క్రౌన్ ప్రిన్స్ బిన్ న్యూఢిల్లీ పర్యటనానంతరం ఒక సంయుక్త ప్రకటనను ఫిబ్రవరి, 2019న విడుదల చేశారు. అందులో ఉగ్రవాద మౌలికసదుపాయాల వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయాల్సిన అవసరాన్ని విస్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని అందించడంపై కూడా వేటు వేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇటీవల సంవత్సరాలలో భారత దేశంలో జరిగిన ఉగ్రదాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఈ ఏడాది జనవరిలో పుల్వామా దాడి జరిగినపుడు కూడా సౌదీ ఉగ్రదాడిని ఖండించింది. ఈ దాడిలో 40 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు పఠాన్‌కోట్, యురిలలో కూడా 2016 జనవరి, సెప్టెంబరులలో జరిగాయి.
పుల్వామా దాడి అనంతరం బాలాకోట్ నుంచి దాడులను భారత్ తిప్పికొట్టింది. దక్షిణ ఆసియాలో ఒత్తిడులు తగ్గించడానికి అరేబియా దౌత్యాన్ని కొనసాగిస్తోంది. కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయంపై సౌదీ అరేబియా హుందా శైలిలో వ్యవహరిస్తోంది. జె అండ్ కె అంశం భారత అంతర్గత అంశమని న్యూఢిల్లీ విస్పష్టంగా చెప్పింది. అంతేకాదు 370 వ రాజ్యాంగ అధదికరణ కొట్టివేత నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని తిరిగి రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఆ నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది.
ఎన్ఎస్ఎ దోవల్ ఎజెండాలోని మరో ముఖ్య అంశం ఫైనాన్షియల్ యాక్షన్స్ టాస్క్ ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్) పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టుంగ్‌లో పెట్టే ప్రతిపాదన. దీని ప్లీనరీ సెషన్ ఈ నెల తర్వాత జరగనుంది. 2018 సంవత్సరంలో ఎఫ్ఎటిఎఫ్ పాకిస్తాన్‌ను తన ‘గ్రే-లిస్టు’లో పెట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తోడ్పాటునందివ్వడమే ఇందుకు కారణం. ఎఫ్ఎటిఎఫ్ యొక్క ఆసియా ఫసిఫిక్ గ్రూప్ (ఎపిజి) ప్రకారం, ఇస్లామాబాద్ తాను ఒఫ్పకున్న వాటిని కా పూర్తిచేయాల్సి ఉంది. తీవ్రవాదులకు నిధులు అందించే నెట్‌వర్కులకు ముగింపు పలకాల్సి ఉంది. ప్లీనరీ సమావేశానికి ముందు దీనికి సంబంధించి చర్యలను పాక్ చేపట్టాలి. లేకపోతే ఎఫ్ఎటిఎఫ్ సమావేశంలో పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం ఉంది. రాజ్యం ఉగ్రవాదానికి చేయూతనివ్వడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఎఫ్ఎటిఎఫ్ సమావేశం ఇండో-సౌదీ సంబంధాలు చాలా ముఖ్యమైనవి.
సౌదీ అరేబియాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు గత కొన్నేళ్లుగా బాగా మెరుగయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో రియాద్‌లో పర్యటించారు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా మార్గనిర్దేశనం వేసింది. రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత బలోపేతం, తీవ్రవాద వ్యతిరేక సహకారాలను పెంపొందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాయి.
రచన: డా. మొహమ్మద్. ముదాస్సిర్ ఖామర్, పశ్చిమాశియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment