పరిశుభ్రమైన పర్యావరణానికి భారత్ కట్టుబడి ఉంది

మహాత్మాగాంధీ పరిశుభ్రత పాటించడంలో ఎంతో నిబద్ధత చూపుతారు. భారతదేశం మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాన్ని అక్టోబర్ రెండవ తేదీన జరుపుకుంది. ఈ సందర్భంగా పలు పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌ నిర్మూలనా ప్రతిన సైతం చేసింది. ఇది ఆరోగ్యం, పర్యావరణాల పరిరక్షణకు అవసరం. ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిస్థాయి నిషేధాన్ని ప్రభుత్వం ఇంకా ప్రకటించనప్పటికీ, గాంధీజీ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2022 సంవత్సరం నాటికి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తమ ప్రభుత్వం నిర్మూలించాలని టార్గెట్ పెట్టుకుందని తెలిపారు.

గణాంకాలను బట్టి చూస్తే భారత్ సంవత్సరానికి 62 మిలియన్ టన్నుల చెత్తను పోగేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ప్లాస్టిక్స్ ఉండడం గమనార్హం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిరంతరాయంగా పరిశుభ్రతా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వ్యర్థపదార్థాల నిర్వహణకు స్థిరమైన వ్యవస్థ ఏర్పాటును కూడా ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నొక్కి చెప్పింది. వ్యర్థాలు ఇష్టవచ్చినట్టు పడేసే సంస్కృతి మెల్లగా భారత్‌లో తగ్గుతూ వస్తోంది. ప్లాస్టిక్‌ వస్తువులకి వ్యతిరేకంగా స్పృహ ప్రజల్లో చూస్తున్నాం. అయినప్పటికీ ఇంకా తీవ్రంగా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్ సంచులు, సీసాలు, కప్పుల వాడకాన్ని నిర్మూలించాలి. ఇవి విషతుల్యమైనవి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో కాలుష్యాలు బాగా ఉంటాయి. ఇవి మానవశరీరంలోకి ప్రవేశించి కాన్సర్‌తో పాటు రకరకాల జబ్బులకు కారణం అవుతాయి.

మరోవైపు పర్యావరణ పరిస్థితి కూడా ఆందోళన రేకెత్తించే స్థాయిలో క్షీణిస్తోంది. కారణం ప్లాస్టిక్స్ వల్ల ఉత్పత్తి అయ్యే కాలుష్యం పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వల్ల వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్లు ఎదుర్కొంటున్నాం. జీవన చక్రంలోని ప్రతి స్థాయిలో వీటిని నిర్లక్ష్యం చేయలేం. వ్యర్థాల నిర్వహణ నుంచి, వాటిని శుద్ధిచేయడం, వాటిని వ్యర్థ ఉత్పత్తులుగా గుర్తించడం ఇలా ఇందులో చాలా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం 2050 నాటికి ప్లాస్టిక్ వల్ల భూమిపైన ఉన్న కార్బన్ ప్రమాణంలో మొత్తం విషతుల్యమైన వాయువుల విడుదలలో 13 శాతం మేర కార్బన్ పెరుగుతుందిట.

వీటితోపాటు, ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు, సంచులు వంటివి చాలామంది నిర్లక్షంగా పరిసరాల్లో విసిరిపారేస్తుంటారు. ఇవి నీటి వనరులు అయిన చెరువులు, కుంతలు, సముద్రాలు, నదులును ఆవిరి చేస్తాయి. దీంతో సముద్రం లేదా నదుల వాతావరణ వ్యవస్థలో అసమతుల్యతలు ఏర్పడతాయి. ఈ ప్రమాదం నుంచి మానవాళిని కాపాడాలంటే ఎదురున్న ఒకే ఒక ఏకైక మార్గం ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని భారత్ మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పునరుద్ఘాటించారు.

భారత్ సింగిల్-యూజ్ ప్లాస్టిక్స్ వినియోగాన్ని రానున్న మూడు సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్మూలించడమే కాకుండా, గాంధీ ఎంతో ముఖ్యమైందిగా భావించే, కలలు కన్న పరిశుభ్రత విషయంలో కూడా నిబద్ధతతో పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉంది. దేశంలో 99 శాతం గారమాలు బహిర్భూమికి వెళ్లడం మాని టాయ్‌లెట్లను వాడుతున్నారు. గత 60 నెలల కాలంలో భారతదేశం మొత్తం 11 కోట్ల టాయిలెట్లను భారత ప్రభుత్వం నిర్మించింది. ఈ విజయం క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కాలి. స్వచ్ఛ భారత్‌ను 2014లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తోంది. బహిర్భూమి అలవాటును నిర్మూలించడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే. దీనికి, ప్రజా ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది.

ఒక నివేదిక ప్రకారం, ఒక లక్షమంది పిల్లలు ప్రతి సంవత్సరం మన దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులు సరిగా లేక మరణిస్తున్నారు. పరిశుభ్రతా లోపంతో నిరుపేదలు పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రపంచ అత్యంత పురాతన జర్నల్ అయిన లాన్స్‌ట్ నివేదిక ప్రకారం పోషకాహారలోపం, సెప్టిక్ బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల నీటిలో మానవ, జంతు విసర్జనలు చేరి కలుషితం అవుతున్నాయి. దీంతో మంచి నీరు కాలుష్యం కావడమే కాదు, పారిశుద్ధ్యం కూడా బాగా దెబ్బతింటోంది. అందుకే భారతదేశంలో డయేరియా సంబంధిత మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.

పారిశుద్ధ్య లోపం వల్ల దోమలు పెరుగుతాయి. దీంతో దోమకాట్లు పెరిగి మలేరియా, డెంగు వ్యాధులు వస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. పరిశుభ్రతలో మార్పు అవసరం. ఈ మార్పు రావడం వల్ల జబ్బులు, మరణాల తీవ్రత నుంచి దేశం స్వేచ్ఛ పొందుతుంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మోదీకి ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డును ఇటీవల ప్రదానం చేసింది. ఇది మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ పట్ల ఎంత అంకితభావంతో ఉన్నారో తెలుపుతుంది. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ని ఆరోగ్యం, పరిశుభ్రతలను లక్ష్యంగా పెట్టుకుని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రధాన కార్యక్రమం.

ఈ కార్యక్రమ లక్ష్యం ప్రజారోగ్యాన్ని పెంపొందించడం, లక్షల మంది భారతీయుల గౌరవం, రక్షణ కాపాడడమే. ఇవి బాగుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వీగిపోకుండా పటిష్టంగా ఉంటుంది. యుఎన్‌ఐసిఎఫ్ నివేదిక ప్రకారం, భారత ఈ ముఖ్య కార్యక్రమం వల్ల 75 లక్షల మందికి ఉపాధి లభించింది. అంతేకాదు భారత ఆర్థిక రంగంలో 20 లక్షల కోట్ల రూపాయల లబ్ది చేకూరింది. పరిశుభ్రత ఎంతో పవిత్రమైనది మాత్రమే కాదు దేశాభివృద్ధి, సాధికారతలను పెంపొందిస్తుంది కూడా. పరిశుభ్రమైన పర్యావరణానికి, ఆరోగ్యం పెరుగుదల, సంపద్వంతమైన సమాజానికి ప్రాధాన్యం ఇస్తూ తగిన చర్యలు చేపట్టకపోతే మహాత్మాగాంధీకి ఎంత గొప్ప నివాళి ఇచ్చినా అది గొప్పగా, ప్రతిష్ఠాత్మకంగా, బలంగా ఉండదు

రచన: శంకర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్




Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం