అహింస: విశ్వశాంతికి గాంధీజీ ఆయుధం

అహింసకు పర్యాయపదం... గొప్ప స్ఫూర్తివంతమైన మహానుభావుడు...శాంతికి ప్రతిరూపం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. భారతదేశంలో ఆయనను అందరూ ‘జాతిపిత’ అని ఎంతో ప్రేమగా, గౌరవంగా పిలుస్తారు. ప్రపంచానికి ఆయన ‘మహాత్మా’ (గ్రేట్ సోల్). ఐక్యరాజ్యసమితి జాతిపిత మహాత్మాగాంధీ పుట్టినరోజైన అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తోంది. తద్వారా అహింసస, శాంతులను గ్లోబల్ స్థాయిలో ప్రచారం చేస్తోంది. సత్యం, అహింస సూత్రాలపై భారత స్వాతంత్ర్యోద్యమాన్ని గాంధీజీ విజయవం తంగా నడిపించారు. మానవాళికి అహింస గొప్ప శక్తివంతమైన బలంగా గాంధీజీ పేర్కొన్నారు. మనిషి గొప్ప చాతుర్యం, తెలివితేటలతో సృష్టించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం కంటే కూడా ఇది ఎంతో బలమైంది.

అంతర్జాతీయంగా ఎందరో నాయకులు, దేశాలు, కమ్యూనిటీలు మహాత్మా గాంధీకి ప్రభావితమైనవారే. ప్రపంచ సర్వత్రా అణచివేతకు గురైన సమాజాలు జనాల సమీకరణకు గాంధీ పద్ధతిని విజయవంతంగా అనుసరించాయి. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, వియత్నాం విప్లవ నాయకుడు హో ఛి మిన్హ్, మయన్మార్ పోరాటంలో ఆంగ్ శాన్ సూకిలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు నిలువెత్తు నిదర్శనాలు.

కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోలండ్‌లో పోరాటం చేపట్టిన లెచ్ వాలెసాని ‘పోలిష్ గాంధియన్’ అంటారు. ఆయన అహింసా సూత్రాల ప్రాతిపదికన తన పోరాటం సాగించారు. కార్డినల్ జైమ్ సిన్ నాయకత్వం కింద ఫిలిప్పినో పీపుల్స్ వార్ మూవ్‌మెంట్ మార్కోస్ నియంతృత్వం నుంచి విముక్తిపొందడంలో కీలకపాత్ర వహించాయి. చెకోస్లోవేకియాలో రష్యా పాలనను కూలదోసింది కూడా అహింసాపోరాటాల మార్గంలోనే.

1990 ప్రారంభంలో, దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి అహంకారానికి, జాతి వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం అహింసాయుతమైన ప్రదర్శనలను ఇస్తూ వీధుల్లో పోటెత్తారు. దీనికి నెల్సన్ మండేలా నాయకత్వం వహించారు. తర్వాత ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీ అహింసామార్గంపై మండేలాకు అపురూపమైన విశ్వాసం. ఆయన నాయకత్వం కూడా మహాత్మా అడుగుజాడల్లో, గాంధీ సత్యాగ్రహం, అహింసలపై అపూర్వ విశ్వాసంతో సాగింది. విజయవంతంగా శ్వేతజాతి ప్రభుత్వాన్ని దక్షిణాఫ్రికాలో కూలదోశారు. శ్వేతజాతీయులను దేశం నుంచి తరిమికొట్టారు. అంతేకాదు మెక్సికన్-అమెరికన్ శ్రామిక ఉద్యమం, పౌర హక్కుల నాయకుడు సెజార్ ఛావెజ్, లాటినో ఫామ్ వర్కర్స్ కోసం ఆయన పోరాటాలపై కూడా గాంధీ ప్రభావం ఎంతో ఉంది. ఇటీవల 2011 ఆరబ్ స్ప్రింగ్‌లో కూడా ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోసం శాంతియుతంగా కొనసాగడంలో అహింసామార్గం జాడలు కనిపిస్తాయి. దశాబ్దాల తరబడి మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలలో కొనసాగుతున్న నియంతృత్వ, అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా ప్రదర్శకులు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. గల్ఫ్ , పశ్చిమాసియాలలోప్రాంతంలో సంస్కరణలకు, మార్పులకు శాంతి, అహింసలు సంఘర్షణలు ఎంతో శక్తివంతంగా నిలువరిస్తాయన్న విషయాన్ని నిరశనకారులు మరొకరసారి నిరూపించారు.

దలైలామా మాట్లాడుతూ ‘ప్రపంచ దేశాల మధ్య నేడు పెద్ద యుద్ధం జరుగుతోంది. ప్రపంచ శాంతికి పోరాటం కూడా జరుగుతోంది. అంతేకాదు మేధా శక్తికి, వాస్తవికవాద బలానికి మధ్య, అలాగే ప్రజాస్వామ్యానికి, నిరంకుశానికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది’ అన్నారు. ఈ పెద్ద యుద్ధాలను గాంధీ ఫిలాసఫీలోంచి పోరాడాల్సిన అవసరం నేటి ప్రపంచంలో ఎంతో ఉంది.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాట్లాడుతూ ‘మానవాళి అభివృద్ధి పథంలో సాగాలంటే గాంధీజీ విధానాలను నిర్లక్ష్యం చేయలేరు. మానవాళి దృక్కోణం లోంచే ఆయన జీవించారు. ఆలోచించారు. పనిచేశారు. ఎందరినో ప్రభావితులను చేశారు. శాంతి, సామరస్య భావజాలాలతో ప్రపంచానికి స్ఫూర్తినిచ్చి ఆ దిశగా ముందుకు మానవాళి సాగేలా స్ఫూర్తి అయ్యారు’ అన్నారు.

పలు పర్యాయాలు గాంధీ పేరు నోబెల్ బహుమతికి నామినేట్ అయినా కూడా మహాత్మాగాంధీ అందుకోలేదు. గాంధీజీని అనుసరించిన వారిలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, దలై లామా, గ్ సాన్ సూకి, బరాక్ ఒబామా, డెస్మండ్ టూటూ, అర్జెంటీనాకు చెందిన అడాల్ఫ్ పెరరెజ్ ఎసక్వివెల్ఉన్నారు. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. ఆయనను అనుచరించిన వారందరికీ నోబెల్ బహుమతులు వచ్చాయి. గాంధీజీ నోబెల్ బహుమతికే అతీతులని అర్థం అవుతుంది.

అహింస అంటే హింసకు తావులేనిది. సంపూర్ణ శాంతితో కూడినది అనేది గాందీ భావన. ఇది ప్రేమను అన్ని రూపాల్లో పంచుతుంది. అహింసను పూర్తి జీవన విధానంగా గాంధీ మార్చారు. మనుషులకు, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని అభివృద్ధి చేస్తూ ఆ భావజాలాన్ని పున:శక్తివంతం చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య ఉన్న గాఢ బంధాన్ని తెలిపారు.

ఈనాడు ప్రపంచ శాంతి ప్రమాదంలో పడింది. మననుషులను, జాతులను సర్వనాశనం చేసే అణ్వాయుధాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సత్యం, ప్రేమ, ఇతరుల హక్కుల పట్ల గౌరవం మహాత్మా బోధనలు. ఇవి గతంలో కన్నా కూడా ఇపుడు మరింత అర్థవంతంగా నిలిచాయి. ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

ఆల్బర్ట్ ఐనిస్టియన్, గాంధీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. వారిద్దరి మధ్య తరచూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. ఐనిస్టియన్ గాంధీని వచ్చే తరాలకు గొప్ప రోల్ మోడల్ అని అభివర్ణించారు. ఈ రోజు ప్రపంచం జాతిపిత గాంధీ 150వ జన్మదిన వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఐనిస్టయిన్ మాటలను గుర్తుచేసుకోవడం ఎంతైనా గౌరవం. ‘ప్రపంచమంతా కూడా గాంధీజీ అంటే ఎంతో ఇష్టపడతారు. నైతికంగా పతనావస్థలో న్న సమయంలో ఆయన అందరికీ ఒక అడ్మిరేషన్. రాజకీయరంగంలో మానవసంబంధాల కోసం ధైర్యంగా నిలబడిన ఏకైక రాజనీతిజ్ఘుడు మహాత్మాగాంధీ . మానవాళికి మంచి భవిష్యత్తును అందిస్తామన్న పూచీ ఇవ్వాలి. అంతేకాదు అంతర్జాతీయ సంబంధాలు, నిర్ణయాలు చట్టం, న్యాయం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి తప్ప తానే అందరికన్నా ఉన్నతుడు, సూపీరియర్ శక్తిని అనే దాంట్లో ఉండదు’ అని అన్నారు.

రచన: డొమినిక్ థోమస్, గాంధీ స్టడీస్‌పై వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం