ఆఫ్ఘనిస్తాన్‌లో అధ్యక్ష ఎన్నికలు: శాంతికి అవకాశం ఉందా?
ఆఫ్ఘనిస్తాన్‌లో నాల్గవ అధ్యక్ష ఎన్నికలు ఎట్టకేలకు జరిగాయి. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఇంకోవైపు తీవ్రమైన హింస పొంచి ఉన్నా ఆ పరిస్థితులను అధిగమిస్తూ అక్కడ ఎన్నికలు నిర్వహించారు. తాలిబాన్ ప్రభుత్వం సెప్టెంబరు 28న పడిపోయింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఎన్నికలు రెండుసార్లు వాయుదాపడ్డాయి. మొత్తానికి తాజా అధ్యక్ష ఎన్నికల్లో 15మంది అభ్యర్థులు అధ్యక్షఎన్నికల్లో పోటీ చేశారు. దేశం మొత్తం 4,900 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. నమోదైన ఓటర్ల సంఖ్య 9.6 మిలియన్ల మంది. కానీ ఎన్నికల్లో ఓటుహక్కు ఉపయోగించుకున్న ఓటర్ల సంఖ్య 20 శాతం మాత్రమే. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 60 శాతం మంది ఓటర్లు పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఆఫ్ఘన్లో శాంతి సవాలుగా నిలిచింది. ఎన్నికైన ప్రభుత్వం తాలిబాన్లతో చట్టబద్ధంగా సంభాషణలు జరిపే అవకాశం ఉంది. అది కూడా అలాంటి అనుకూల పరిస్థితులు ఏర్పడితేనే.
ఎన్నికల రోజున మొత్తం 400 దాడులు జరిగాయి. వాటిల్లో రాకెట్ దాడులు, బాంబుదాడులు వంటివి సైతం ఆఫ్ఘన్ దేశమంతటా జరిగాయి. ఇవి ప్రజలను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాయి. ఎన్నికల సమయంలో కొంతమంది ఓటర్ల పేర్లు కూడా గల్లంతయ్యాయని తేలింది. అధ్యక్ష పదవికి పోటీదారులు ప్రధానంగా ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాగా, ఇంకొకరు అబ్దుల్లా అబ్దుల్లా. అబ్దుల్లా అబ్దుల్లా ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్. మాజీ అధ్యక్షుడు ఘనితో కలిసి ఆయన అధికారాలు పాలుపంచుకున్నాడు. గత అధ్యక్ష ఎన్నికలు 2014లో జరిగాయి. అవి వివాదాస్పదమయ్యాయి. అందుకే పడిన ఓట్లను నూటికి నూరు శాతం ఆడిట్ చేశారు. డా. అబ్దుల్లా అబ్దుల్లాని అధ్యక్షుడిగా ఎన్నికునేలా ఒప్పంద ఫార్ములాకు వచ్చారు.
2001లో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షతరహా ప్రభుత్వాన్ని ఏర్పటుచేసింది. ఎన్నికైన పార్లమెంటు కూడా ఉంది. పశ్చిమదేశాల తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో తాలిబాన్ పోటీ చేసింది. కాబూల్‌లోని ప్రభుత్వం అమెరికా చేతుల్లో ఆడే తోలుబొమ్మ ప్రభుత్వమని కూడా తాలిబాన్ అభివర్ణించింది. దానితో ఎలాంటి చర్చలకు తాము సిద్ధంగా లేమని తాలిబాన్ స్పష్టంచేసింది. తాలిబాన్, అమెరికాల మధ్య పలు పర్యాయాలు వరుసగా సంభాషణలు జరిగాయి. ఇవి దోహలోని తాలిబాన్ కార్యాలయం నుంచి జరిగాయి. అమెరికాతో చర్చలతో పాటుగా, పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయి. వాటిల్లో తాలిబాన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రాంతీయంగా కీలకంగా వ్యవహరించిన వాళ్లల్లో రష్యా గత ఏడాది బహుపక్ష శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘనితోపాటు ‘హై పీస్ కౌన్సిల్’కు చెందిన నాలుగురు సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాస్కో ఆఫ్ఘన్ ప్రాంతాల మధ్య సదస్సును కూడా నిర్వహించింది.
తాలిబాన్ పాకిస్తాన్, చైనాలతో కూడా సమావేశాలు జరిపింది. ఈ వేదికల్లో తాలిబాన్ ప్రతినిధులు ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి కార్యక్రమాలలో పాలుపంచుకోవడానికి సందేహించలేదు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. జూలైలో వీటిని ఖతార్, జర్మనీలు దోహలో నిర్వహించాయి. ఇందులో తొలిసారి తాలిబాన్ ప్రతినిధులు 50 మందితో కూడిన ఆఫ్ఘన్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. ‘ఇంట్రా-ఆఫ్ఘన్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్’ లో భాగంగా వీరిని తాలిబాన్ కలిసింది. తాలిబాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులకు మధ్య ఇది ఎంతో కీలకమైన సంబంధం అనిచెప్పొచ్చు.
చర్చలు జరగాలంటే ఆఫ్ఘన్ నుంచి విదేశీ సైనిక బలగాలు వెళ్లిపోవాలని తాలిబాన్ కోరిన విషయం తెలిసిందే. కానీ, అంతర్జాతీయ ఒత్తిడితో, చర్చలకు తాలిబాన్ సిద్ధమైంది. ఉగ్రవాదులైన తాలిబాన్లు బాలికల విద్యకు, మహిళల హక్కులకు అనుకూలంగా ఉన్నట్టు సైతం ప్రదర్శించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాబూల్‌లోని ‘నాటో’ ‘రెసొల్యూట్ సపోర్టు మిషన్’ పై తాలిబాన్ కారు దాడితో అమెరికా చర్చలకు నిరాకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపన అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సందర్భంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు కీలకమైనవి. యుద్ధ వాతావరణంతో అస్తవ్యస్తంగా ఉన్న ఆఫ్ఘన్లో శాంతి స్థాపన ముఖ్యమైంది.
ఈ ఎన్నికల్లో ఓటర్లు చాలా తక్కువమంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాలిబాన్ ఎన్నికల పరంగా ఓటర్లు తక్కువ సంఖ్యలో పాల్గొనడానికి సంబంధించిన ప్రశ్నలను కూడా వదలలేదు. డా. అబ్దుల్లా అబ్దుల్లా మాట్లాడుతూ తన మద్దతుదారులు గత ఎన్నికల్లోలాగ ప్రజాస్వామ్య ప్రక్రియకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఇవ్వలేదన్నారు.
ఎన్నికల ఫలితాలు అక్టోబర్ మూడవ వారంలో ప్రకటించవచ్చు. మరి ఈ ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకూ సమ్మతమేనా? ఆఫ్ఘన్లో శాంతి సుదూరంలో ఉంది. ఎన్నికల ఫలితాలు ఆఫ్ఘన్ నూతన ప్రయాణాన్ని తెలుపుతాయి. ఎందుకంటే వ్యవస్థాగత నిర్మాణ కొనసాగింపు అన్నింటికన్నా చాలా ముఖ్యమైంది. ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలంటే ఎన్నికలు తప్ప వేరే ఏ మార్గం లేదు. స్పెషల్ ఇనెస్పెక్టర్ జనరల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్ (ఎస్ఐజిఎఆర్, ‘సిగార్’)’ నివేదిక ననుసరించి 56 శాతం భూభాగం తాలిబాన్ల అదుపులో ఉంది. దీంతో..కొత్త ప్రభుత్వానికి భారీ సవాలు సిద్ధంగా ఉంది.
రచన: డా. స్మృతి పట్నాయక్, దక్షిణాశియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment