మళ్లా నిరసనకు గురైన పాకిస్తాన్

కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ వదిలిపెట్టడం లేదు. జమ్ము, కశ్మీర్ స్పెషల్ స్టేటస్‌ను భారత్ రద్దుచేయడంపై అంతర్జాతీయ దృష్టి పడాలని ఇస్లామాబాద్ సర్వవిధాలా ప్రయత్నిస్తోంది. జమ్ము,కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని న్యూఢిల్లీ చాలాసార్లు విస్పష్టంచేసింది కూడా. భారత తన దృక్కోణాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడంలో సంపూర్ణంగా విజయవంతమైంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల అధిపతులు, ప్రజలు భారత నిర్ణయాన్ని సంపూర్ణంగా ఆమోదించాయి కూడా.

అయినా పాకిస్తాన్ సంతృప్తి చెందలేదు. ఇపుడు పాకిస్తాన్ తన సన్నిహిత మిత్రదేశాలకు సైతం దూరమైంది. గత వారం పాకిస్తాన్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ ఇద్దరూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగమంత్రులను ఆహ్వానించారు. దౌత్య విజ్ఘతను ప్రదరిస్తూ ఇద్దరు విదేశాంగమంత్రులూ పాకిస్తాన్ అభిప్రాయాలను ఎంతో ఓర్పుగా విన్నారు.

తర్వాత పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మెహమూద్ ఖురేషి మాట్లాడుతూ ‘‘ రెండు దేశాలూ మమ్మల్ని నిరాశపరచవని ఆశిస్తున్నాం. మా అభిప్రాయాన్ని రెండు దేశాలకు చెందిన విదేశాంగమంత్రులూ ఎంతో ఓర్పుగా విన్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఎవ్వరూ వీరి పర్యటన నుంచి ఎక్కువ ఆశించలేదు కూడా. పాకిస్తాన్ విశ్లేషకులు సైతం ఇది కేవలం దౌత్యపరంగా ఇరుదేశాల మంత్రుల ఫోటోల ప్రదర్శనగా మాత్రమే భావించారు. కానీ పాకిస్తాన్ దౌత్యపరంగా సౌదీ అరేబియా, యుఎఇలతో సమావేశం విజయవంతమైందని చెప్పుకుంది. కానీ ఎంతో ముఖ్యమైన ఈ రెండు అరబ్ దేశాలు ఏమనుకుంటున్నాయన్నది మటుకు ఎవ్వరి ఊహకు అందడంలేదు. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న ‘బేరసారాల’ శైలి విఫలమైందని స్పష్టమవుతోంది. ఈ సమావేశం పాకిస్తాన్ మీడియాలో ఆగ్రహ జ్వాలలను రేకెత్తించింది. కానీ మీడియా పెద్దలు ఈ అంశం తీవ్రతరం కాకుండా ప్రారంభంలోనే నొక్కిపెట్టారు.

సరైన సలహా లేకుండా ఉన్న తమ చర్యల పట్ల పాకిస్తాన్ తనను తానే నిందించుకుంది. ధనవంతమైన అరబ్ దేశాల నుంచి నిర్దిష్టకాలానికి బెయిల్ అవుట్స్‌ ను (ఆర్థిక సహాయాన్ని) పాకిస్తాన్ అందుకుంటోంది. గత ఏడాది ఇస్లామాబాద్ రియాద్,అబుదాబీల నుంచి ఆరు బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందింది. కింగ్డమ్‌లో పాకిస్తానీయులు జీవించడం అవసరం అని సౌదీ పిలుపునిచ్చింది. ఈ సత్యాన్ని మరవరాదు. అదే సమయంలో గల్ఫ్‌ లో భారత బహిష్కృతులు చాలామంది ఉన్నారు. అక్కడి భారత ప్రజలు పనిసామర్థ్యం బాగా ఉన్నవారు. విద్యావంతులు. దూరదృష్టితోపాటు సాంకేతిక విజ్ఘానం కూడా వారికి బాగా ఉంది. వారు నివసిస్తున్న దేశాల్లోని ఆర్థిక రంగాలలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు.

2016 లో సౌదీ అరేబియా రాజు సల్మాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ‘కింగ్ అబ్దుల్లాజిజ్ సాష్’ (ఇది ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం)ని ప్రదానం చేశారు. సౌదీ రాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా వంద బిలియన్ అమెరికన్ డాలర్లను భారత్‌లో 2021 సంవత్సరం నాటికి పెట్టుబడులుగా పెడతామని భారత్‌కు మాటిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌కు 20 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను అందిస్తామన్నారు. దీన్ని గమనిస్తే అరబ్ దేశాలు ప్రజలకు ఉపయోగపడే సంబంధాల పెంపుదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మతం అన్నది వారికి అంశం కాదని స్పష్టమవుతోంది. పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య సంబంధాలు 2017-18 సంవత్సరానికి కేవలం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే ఉంది. అదే భారత్‌తో సౌదీ వాణిజ్యం అదే సంవత్సరంలో 27.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది.

యుఎఇ పాకిస్తాన్‌కు ఇస్తున్న ప్రాధాన్యం ఇంకా బాగా తక్కువగా ఉంది. భారతదేశానికి యుఎఇ రాయబారిగా వ్యవహరిస్తున్న అహ్మద్ ఆల్ బన్నా కశ్మీర్ పరంగా భారత చర్య ఆ దేశ అంతర్గత ప్రభుత్వ యంత్రాంగ విషయమని అన్నారు. అంతేకాదు ఈ నిర్ణయం ద్వారా శాంతి, సుస్థిరతల దిశగా భారత్ మరో అడుగు ముందుకు వేసిందన్నారు. దీని తర్వాత కొన్ని వారాలకు ప్రధాని నరేంద్రమోదీకి యుఎఇ తమ దేశ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ జాయెద్’ని ప్రదానం చేసింది. ఇది పాకిస్తాన్‌ను తీవ్ర దిగుల్లోకి నెట్టింది. పాకిస్తాన్ సెనేట్ (అప్పర్ హౌస్) ఛైర్మన్ సాదిఖ్ సంజ్రాని తమ యుఎఇ పర్యటనను రద్దుచేసుకున్నారు.

చమురు పుష్కలంగా ఉన్న ఆరబ్ దేశాల వ్యవహారశైలిని పాకిస్తాన్ వ్యాఖ్యాతలు విమర్శిస్తున్నారు. భారత్‌కు మద్దతు తెలపడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. పాకిస్తాన్ వీధుల్లో ప్రజలు యుఘర్ ముస్లింలను బలవంతంగా చైనాలోని పునర్‌విద్యా శిబిరాలకు ఎందుకు పంపించారని తమ నాయకులను, సైన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ వారికి ‘చైనా పాకిస్తాన్ ఎకనిక్ కారిడార్’ తమ దేశానికి జీవనరేఖని బాగా తెలుసు. యెమెన్‌లో సంభవించిన మరణాలు, విధ్వసం గురించి పాకిస్తాన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పాకిస్తాన్ సైనిక, పౌర సహాయం కోసం ఆశపడుతోంది.

రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం