యాక్ట్ ఈస్ట్ విధానాన్ని పునరుద్ఘాటించిన భారత్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో రెండురోజుల పర్యటించారు. ఆ సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి షింజో అబెని కూడా కలిసారు. జపాన్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు రెండు దేశాల ప్రధానమంత్రులూ మంచి స్నేహితులు కూడా. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ఇరువురి నాయకుల సమావేశం ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని పేర్కొంది.
వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా త్వరలో జపాన్ ప్రధానమంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి భారత పర్యటనపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ శిఖరాగ్ర సదస్సు డిశంబరులో జరగనుంది.
తొలుత 2+2 మంత్రివర్గ సమావేశాన్ని జరపాలని రెండు దేశాల నాయకులు ఒక అంగీకారానికి వచ్చాయి. దాని ప్రకారం రెండు దేశాలకు చెందిన విదేశాంగమంత్రి, రక్షణ మంత్రులు వార్షిక శిఖరాగ్రసదస్సుకు ముందరే సమావేశం కావాల్సి ఉంది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల జపాన్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా విస్తృతస్థాయిలో పలు అంశాలను చర్చించినట్టు జపాన్ ప్రధాన మంత్రి పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఇరుదేశాలూ ఇచ్చిపుచ్చుకోవడాలపై, సహకారాన్ని అందించుకోవడానికి సంబంధించి సంభాషణలు జరిపారని జపాన్ ప్రధాని తెలియజేశారు.
జపాన్, అమెరికా, భారత త్రైపాక్షిక సమావేశంపై ఇరుదేశాల ప్రధానులు అనుకూల అంచనాకు వచ్చారు. వీటిల్లో రెండు బ్యూనస్ ఐరిస్, ఒసాకాలో జరిగిన జి20 సమావేశాల మధ్య జరిగాయి. ఇద్దరు నాయకుల పాజిటివ్ కృషి ఫలితం ఇది. మూడు దేశాల మధ్య సమావేశాల నిర్వహణ సంప్రదాయం ఆగకుండా కొనసాగుతుండాలని ఆయా దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు.
ఇండో-ఫసిఫిక్ అంశానికి సంబంధించి కూడా భారత్, జపాన్‌లు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశాయి. జపాన్ ప్రధాని అబె మాట్లాడుతూ స్వేచ్ఛాయితమైన, బహిరంగమైన ఇండో-ఫసిఫిక్ని ప్రస్తావించారు. అంతేకాదు ఈ దిశగా ద్వైపాక్షిక సహకార ప్రాధాన్యాన్ని కూడా పేర్కొన్నారు. ఆర్థికంగానే కాదు రెండు దేశాల ప్రజల మధ్య కూడా సంబంధాలు వృద్ధి చెందడం ద్వారా ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతతో కూడిన, సంపద్వంతమైన పరిస్థితులను, అభివృద్ధిని నెలకొల్పగలుగుతామని ఆయన భావించారు.
ఆర్‌సిఇపి- మీద సంక్షిప్తమైన చర్చ చోటుచేసుకుంది. ప్రాంతీయ ఆర్థిక సహకార ఒప్పందం గురించి మొత్తం పదహారు దేశాలు చర్చలు చేశాయి. వాటిల్లో పది ఎస్ఇఎఎన్ (ఆసియాన్) దేశాలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై అన్ని దేశాలు తమ దృక్కోణాన్ని వ్యక్తంచేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇరువైపులా సరుకుల వాణిజ్యం, వ్యాపార సేవా అంశాలపై ఆసక్తిని కలిగి ఉన్నాయన్నారు. ఏ ప్రాంతీయ వాణిజ్య ఒప్పందం చేసుకునేటప్పుడైనా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మోది అభిప్రాయపడ్డారు. దీనివల్ల రెండు వైపులా ఒప్పందం పరంగా సమస్థాయిలో సానుకూలత ఉంటుందని వ్యాఖ్యానించారు.
మలేసియా ప్రధాన మంత్రి డా. మహథీర్ మొహమద్తో కూడా ప్రధాని సమావేశమయ్యారు. డా. మొహమద్ ఎన్నిక ఎంతో చారిత్రకమైందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభిర్ణించారు. మలేసియాతో కలిసి సమిష్టిగా పనిచేయాలని భారత్ ఆశావహదృష్టితో ఉందని మోది అన్నారు.
ఇరు నాయకుల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధాని మహథీర్ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందడం పట్ల ఆనందాన్ని వ్యక్తంచేశారు. మలేసియా ఈ విషయంలో ఇంకా మిగులుతో ఉందని అంటూ ట్రేడ్ మలేసియాని ఇంకా పెంపొందిస్తామని, ఇరుదేశాలు వాణిజ్య అభివృద్ధిని సమతుల్యం చేసే మార్గాలను చూస్తున్నామని అన్నారు. అంతేకాదు మలేసియా భారత దేశం నుంచి ఎన్నో దిగుమతులను చేసుకుంటోందన్నారు. అలాగే ఇండియా ఎగుమతులు కూడా మలేసియాలో పెరుగుతాయని అన్నారు.
కశ్మీర్, జమ్ములలో ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందించే దిశగా పటిష్టమైన పాలనను ఇవ్వాలనుకుంటున్నట్టు మలేసియ ప్రధాని వివరించారు. 370 రాజ్యాంగ అధికరణ రద్దువెనుక ఉన్న కారణాలను కూడా మలేసియా ప్రధానికి విపులంగా తెలిపారు. పెరుగుతున్న ఉగ్రవాద ప్రమాదం గురించి కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. దాన్ని ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కృషిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రధాని మహథీర్ మొహమద్ మాట్లాడుతూ ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య అన్నారు. ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా మలేసియా దాన్ని సహించబోదని స్పష్టంచేశారు.
భారత ప్రధాని మోదీ మంగోలియన్ ప్రెసిడెంట్ ఖాల్తమాజిన్ బట్టుల్గాని కలిశారు. ఇరుదేశాల నాయకుల మధ్య సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ప్రెసిడెంట్ బట్టుల్గా ఈ నెల తర్వాత భారత్‌లో పర్యటించనున్నారు. రకరకాల పరిణామాల గురించి ఇరువురూ చర్చించారు. ఇప్పటికే పని మొదలైన కొన్ని ప్రాజక్టుల గురించి మాట్లాడుకున్నారు. వాటికి భారత్ అందిస్తున్న సహాయాన్ని మంగోలియా ప్రెసిడెంట్ ప్రస్తావించారు. ముఖ్యంగా భారీ చమురు శుద్ధికర్మాగార నిర్మాణంలో భారత చేయూతను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇది మంగోలియ చమురు అవసరాలను తీరుస్తుంది. ఈ సహాయాన్ని భారత్ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అందించడానికి సంబంధించి చర్చలు జరిగాయి.
ఇరు దేశాలకు సంబంధించిన పలు ప్రజల సమస్యలను కూడా చర్చించారు. అంతేకాదు ఇరుదేశాల సంస్కృతి, ఆధ్యాత్మిక సంబంధాలని గురించి కూడా చర్చించారు. భారత్ పర్యటన సందర్భంగా మంగోలియా ప్రెసిడెంట్ బోధ్‌గయ, ఢిల్లీ, బెంగళూరులను కూడా సందర్శించనున్నారు. ఉలాన్బాతార్లోని మంచు ప్రభావం గురించి కూడా చర్చించారు. కాలుష్య నివారణలో ముఖ్యంగా చలి కాలంలో భారత్ అనుసరిస్తున్న ఫలవంతమైన విధానాలను ఈ సందర్భంగా మంగోలియా ప్రెసిడెంట్ ప్రస్తావించారు.
ఈ సమావేశాలన్నీ ఎంతో ఆశావహంగా, సత్ఫలితాలను ఇచ్చేలా చక్కగా జరిగాయని భారత్ అభివర్ణించింది. భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని పునరుద్ఘాటించేలా జరిగేయన్నారు.
రచన: పదమ్ సింగ్, ఎఐఆర్, వార్తా విశ్లేషకులు

Comments
Post a Comment