ఇండియా-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత, రష్యాల మధ్య 20వ వార్షిక శిఖరాగ్రసదస్సు ఎంతో ప్రత్యేకమైంది. కాలపరీక్షను ఎదుర్కొంటోంది. అంతేకాదు ప్రపంచ క్రమంలో వస్తున్న డైనమిక్ మార్పుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటోంది.

ఎకనామిక్ ఫోరమ్ సమావేశ సమయంలో భారత్ తన ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ పాలసీని వెల్లడించింది. ఇది భారత ఆర్థిక దౌత్యానికి కొనసాగింపుగా చెప్పొచ్చు. వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధికి ప్రధాని ఒక బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ప్రకటించారు. ఈ విధానం వల్ల న్యూఢిల్లీ ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగలగడమే కాదు ఆ ప్రాంతంతో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీలవుతుంది. వజ్రాలు, బొగ్గు, బంగారు గనుల తవ్వకాలలో భారతదేశం పెట్టుబడులు పెడుతోంది.

రష్యా, భారతదేశాల మధ్య సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవి. విలక్షణమైనవి. పరస్పర ప్రయోజనాలతో కూడినవి. అవకాశమున్న అన్ని రంగాలలో సహకారాన్ని విస్తరించుకుంటున్న దేశాలు ఇవి. అంతేకాదు ఒకేరకమైన నాగరికతా విలువలు, అన్ని పరీక్షలకు తట్టుకుని నిలిచిన స్నేహం, పరస్పర అవగాహన, విశ్వాసం, నమ్మకం, ఒకేరకమైన ప్రయోజనాలు, సాన్నిహిత్యం వంటివి అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నాయి. రెండు దేశాలు ప్రాంతీయంగానే కాదు గ్లోబల్ స్థాయలో కూడా మరింత దగ్గరయ్యేందుకు సహాయపడుతున్నాయి. రెండు దేశాల నాయకుల మధ్య చర్చల్లో షాంఘై కో-ఆపరేషన్ కౌన్సిల్ ప్రధానంగా చర్చకు వచ్చింది.

వార్షిక శిఖరాగ్ర సదస్సు సమయంలో రెండు దేశాల నాయకులు ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారు. ఇరుదేశాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరి శైలి ఎంతో మన్ననలను అందుకుంటోంది. వాటిల్లో భారతదేశానికి సంబంధించి పొరుగుదేశంతో అంతర్గత విషయాలపై చెలరేగిన గందరగోళ పరిస్థితులపై కూడా ఇరు దేశాల నాయకులు దృష్టిపెట్టారు. భారత్‌కు రష్యా ఎంతో మద్దతును అందిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకూడా భారత్‌కు తన మద్దతును అందిస్తోంది. భారత్ 370 అధికరణాన్ని రద్దు చేయడం విషయమై భద్రతా మండలిలో కూడా స్పష్టంగా తన అభిప్రాయాన్ని రష్యా వెల్లడించింది.

20వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల నాయకులు ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త పుంతలు తొక్కించాలనే దానిపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ, అంతరిక్షం, ఎనర్జీ, నౌకాయానం అనుసంధానం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాల నాయకులు నిశ్చయించుకున్నారు.

ఆర్థిక విషయ పరంగా చూస్తే, రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్షిక వాణిజ్యం విలువ 17 శాతం పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దీని విలువ 2018లో 11 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. రెండు దేశలు పటిష్టమైన, బహుముఖమైన వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని పునాదిగా చేసుకుని ఆర్థిక, వాణిజ్య ఇతరత్రా పరస్పర ప్రయోజనకరమైన కార్యకలాపాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో రష్యా కూడా పాలుపంచుకునేలా విస్తరించాలని భారత్ ఆసక్తితో ఉంది. అంతేకాదు రష్యాలోని పెట్టుబడుల ప్రాజక్టులలో భారతీయులు పాలుపంచుకోవడం అంశంపై కూడా ఇరుదేశాల నాయకుల మధ్య చర్చ జరిగింది.

ఎనర్జీ రంగంలో ప్రస్తుతం కొనసాగిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, భారత్, రష్యాలు భౌగోళికపరమైన శోధనల్లో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. చమురు, సహజవాయువుల రంగాలలో రష్యా, ఇండియా సమిష్టి అభివృద్ధికి కృషిచేయాలని నిర్ణయించుకున్నాయి. వాటిల్లో సముద్ర తీరాలలో చేపట్టే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇరుదేశాల నాయకులు సుదీర్ఘకాలం రష్యా నుంచి ఎనర్జీ భారత్‌కు చేర్చే విషయంలో అంగీకారానికి వచ్చాయి. అందులో ఆర్కిటిక్‌లోని నార్త్రరన్ సీ రూట్ గుండా కూడా కార్యకలాపాలు చేపడుతుంది. ఆర్కిటిక్‌లో రష్యాకు సహకారాన్ని అందించాలని భారత్ ఆసక్తిగా ఉంది. రెండు దేశాలు కూడా హైడ్రోకార్బన్స్ పరంగా 2019-24 సంవత్సరం వరకూ సహకారాన్ని అందించుకోవడానికి రోడ్ మ్యాప్‌పై సంతకాలు చేశాయి. దీంతో ఎనర్జీ రంగం రానున్న ఐదు సంవత్సరాల కాలంలో కొత్త శిఖరాలను అందుకుంటుంది. అణురంగంలో రష్యా రూపకల్పన చేసిన 12 పవర్ యూనిట్స్ రానున్న 20 సంవత్సరాల కాలంలో నిర్మాణ రూపును సంతరించుకోనున్నాయి.

ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌ పోర్టు కారిడార్ (ఐఎన్ఎస్‌టిసి) గురించి కూడా రెండు దేశాల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ వర్క్ ఫ్లోపై దృష్టి పెట్టారు. దాంతోపాటు రవాణా చేసే క్రమంలో డిజిటల్ టెక్నాలజీస్, శాటిలైట్ నావిగేషన్‌ను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాయి. చెన్నై, వ్లాదివోస్తోక్‌ల మధ్య సరికొత్త అనుసంధాన మార్గాన్ని చేపట్టారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక పెట్టుబడడుల పరంగా ఎంతో మద్దతునిస్తాయి.

రక్షణరంగం పరంగా పెద్ద పరిణామం చోటుచేసుకోనుంది. సాంకేతిక పరిజ్గానం బదలాయింపు కింద రష్యా సైనిక పరికరాలకు సంబంధించిన విడిభాగాల తయారీని భారత్ మొదలెట్టనుంది.అంతేకాదు ఇరుదేశాలు సమిష్టి వెంచర్లను ఏర్పాటుచేయనున్నాయి. అంతేకాదు ఇరుదేశాలు పరస్పర లాజిస్టిక్ మద్దతును ఇచ్చిపుచ్చుకునేందుకు ఫ్రేమ్ వర్కును తయారుచేసుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చాయి.

అంతరిక్షానికి సంబంధించి భారత్ గగన్‌యాన్ మిషన్‌ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇస్తారని భారత్ ప్రకటించింది.

సంస్కతి, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల పరంగా స్మారక తపాలాబిళ్లను మహాత్మాగాంధి 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రష్యా విడుదల చేసింది. 

మొత్తం మీద, వార్షిక శిఖరాగ్ర సదస్సు, ఐదవ ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం ఎంతో బాగా విజయవంతమయ్యాయి. పలు రంగాలలో సరికొత్త అభివృద్ధిని ముందుకు తీసుకువెడుతుంది. వాటితోపాటు భారత ‘యాక్ట్ ఫార్ ఈస్ట్ ’ పాలసీని కూడా రెండు దేశాల సంబంధాల విస్తృతిపరంగా చేర్చారు.

రచన: డా. ఇంద్రాణి తాలుక్‌దార్, రష్యా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం