సంబంధాలను పటిష్టంచేసుకునేందుకు రక్షణ మంత్రి జపాన్ పర్యటన

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబరు 2-3 తేదీల్లో ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా జపాన్‌ వెళ్లారు. సెప్టెంబరు 5-6 తేదీల్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో కూడా రక్షణ మంత్రి పర్యటించనున్నారు.ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో తలెత్తుతున్న భౌగోళిక-వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో ఈ రెండు పర్యటనలూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆయా దేశాల రక్షణ మంత్రులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై అర్థవంతమైన చర్చలు చేశారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల సాధనను లక్ష్యంగా పెట్టుకున్నారు.

జపాన్ రక్షణ మంత్రి తకషి ఇవాయాతో పాటు మంత్రి సింగ్ కూడా వార్షిక రక్షణ మంత్రుల సంభాషణలకు కో-ఛైయిర్‌గా వ్యవహరించారు. ఇండియా-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ఈ సంభాషణల ప్రధానోద్దేశం. రెండు దేశాలకు చెందిన నాయకులు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ, భద్రత అంశాలను వృద్ధి చేసుకునే దిశగా చర్చలు జరిపారు. అంతేకాదు ఇరుదేశాలూ పెద్ద ఎత్తున సైనిక వేదికలను సమిష్టిగా అభివృద్ధిచేసుకోవడానికి ముందుకు కొనసాగాలని నిర్ణయించుకున్నాయి. రాజ్‌నాథ్ పర్యటనలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాల గురించిన ప్రతిపాదనలను కూడా చర్చించారు.

సింగ్ జపాన్ పర్యటనలో కీలక అంశం ఏమిటంటే జపాన్ రక్షణ మంత్రితో సుదీర్ఘకాలంగా ఆగిపోయి ఉన్న యుఎస్-2 ఆమ్ఫిబియస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ను భారత్‌కు జపాన్ పంపిణీ చేస్తానంది. దానిపై జపాన్ రక్షణ మంత్రితో సింగ్ విస్తృతస్థాయిలో చర్చలు చేశారు. అంతేకాదు మొత్తం ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన విషయాలపై సమగ్ర సమీక్షను ఇరుదేశాల మంత్రులూ చేశారు. అంతేకాదు వారి చర్చల్లో ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలోని సంపూర్ణ పరిస్థితులను కూడా చర్చించారు. ఆ ప్రాంతంలో చైనా తన సైనిక ఉనికిని బాగా పెంచుతోంది. ఇండియా, జపాన్, అమెరికాలు మలబార్ నౌకా విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ విన్యాసాల ద్వారా నౌకాపరంగా మూడు దేశాల అంతర్గతంగా కార్యకలాపాలు విస్తృతమవుతాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు ప్రారంభం వరకూ మలబార్ నౌకా విన్యాసాల నిర్వహణ కొనసాగుతుంది. కశ్మీర్ అంశంపై బారత్, పాకిస్తాన్ల నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మంత్రి రాజ్‌నాథ్ పర్యటన చోటుచేసుకుంది. అందుకే కశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్ దుష్ట ఆలోచనలను జపాన్ నాయకులకు మంత్రి వివరించారు. కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయం చేయాలని నిర్ణయించుకోవడాన్ని తెలిపారు.

రక్షణ మంత్రి సింగ్ ఈ విషయాన్ని జపాన్ రక్షణ మంత్రి దగ్గర లేవనెత్తారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్‌కు అనుకూలంగా చైనా కొనసాగడాన్ని కూడా మంత్రి వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ఉన్న స్పెషల్ స్టాటస్‌ను భారత ప్రభుత్వం కొట్టివేయడాన్ని దౌత్యపరంగా మిత్రదేశాలతో పంచుకున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో చేపట్టిన నౌకాపరమైన స్వేచ్ఛపై భారత్ చైనాపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకువస్తోంది.

వివాదాస్పదమైన సౌత్ చైనా సీ విషయంలో బీజింగ్ ఆధిక్యధోరణి అంశాన్ని న్యూఢిల్లీ లేవనెత్తింది. జమ్ము,కశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణపై చైనా తీరుకు ప్రతిగా ఈ అంశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఆ తర్వాతే ఇండో-జపాన్ ప్రకటన వెలువడింది. ఇవాయాతో ద్వైపాక్షిక సమావేశానంతరం సమిష్టి ప్రకటన వెలువడింది. అందులో ‘‘ఇరుదేశాల మంత్రులూ ఇండో-ఫసిఫిక్ సముద్రాలలో శాంతి, సుస్థిరతల ఆవశ్యకతను గుర్తించాయి. ఇండో-ఫసిఫిక్ ప్రాంతం, అలాగే మొత్తం ప్రపంచ అభివృద్ధికి ఇవి అవసరం. అంతేకాదు ప్రస్తుతం ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో ఉన్న భద్రతా పరిస్థితుల మీద కూడా ఇరు దేశాలూ తమ అభిప్రాయాలను సూటిగా పంచుకున్నాయి. అందులో భాగంగా కొరియా ద్వీపకల్పం, సౌత్ చైనా సీ పరిణామాలపై కూడా చర్చించారు. జపాన్ ప్రధాని సింగ్‌తో సమావేశంలో జమ్ము, కశ్మీర్‌లు భారత దేశంలో భాగమని వివరించారు. అలాగే 370 వ అధికరణ రద్దు వల్ల ఉత్తర రాష్ట్ర ప్రజలకు ఒనగూడే ప్రయోజనాలను వివరించారు. అంతేకాదు జమ్ము,కశ్మీర్ విషయంలో కలుగజేసుకోవడానికి పాకిస్తాన్‌కు ఎలాంటి అధికారం లేదని జపాన్ ప్రధాని బెకి వివరించారు. ఇది ఎంతోకీలకమైన ప్రభావాన్ని చూపింది. జపాన్ ప్రధాని అబె ఈ నెల అనంతరం జరగనున్న ఐక్యరాజ్యసమతి సర్వప్రతినిధుల సమావేశ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిసే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండు దేశాల సమిష్టి ప్రకటన అక్టోబర్ 2018 విజన్ స్టేట్‌మెంట్ ఆఫ్ మోదీ గురించి కూడా ప్రస్తావించింది. ఇందులో ఈ రెండు దేశాల నాయకులు స్వేచ్చాయుతమైన ఇండో-ఫసిఫిక్ ప్రాంత స్థాపన కోసం సమిష్టిగా కలిసి పనిచేయాలన్న నిర్ణయాన్ని మరోమారు పునరుద్ఘాటించారు. భారత, జపాన్లు తమ తొలి విదేశీ, రక్షణ మంత్రుల సంభాషణలను ఈ సంవత్సరం తర్వాత జరగనున్న జపాన్-ఇండియా వార్షిక శిఖరాగ్ర మహాసభలో చర్చించనున్నాయి. అందులో భాగంగా రెండు దేశాలూ ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో సహకారం, శాంతి, సంపదలను వృద్ధిపరిచే దిశగా కృషిచేయనున్నాయి. రెండు వైపులా జపాన్-ఇండియా-యుఎస్ త్రైపాక్షిక గనుల కౌంటర్ చర్యల విన్యాసాలను (ఎంఐఎన్ఇఎక్స్) పరిష్కరించుకోవాలనే అభిప్రాయం కూడా వ్యక్తమయింది. ఎంఐఎన్ఇఎక్స్ గత జూలై నుంచి ప్రారంభమైంది.

రచన: ప్రొఫెసర్ రాజారామ్ పాండా, లోక్ సభ రీసెర్చ్ ఫెలో, పార్లమెంట్ ఆఫ్ ఇండియా

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం