ఇండియా-రష్యా ఎనర్జీ సహకారంలో కొత్త పుంతలు
భారత , రష్యా దేశాల మధ్య నెలకొన్న స్నేహసంబంధాలు, సహకారం ఎంతో లోతైనవి. దృఢమైనవి. వివిధ రంగాలకు అవి విస్తరించాయి. అంతేకాదు రెండు దేశాలు ఎనర్జీ సహకారంలో కూడా పటిష్టమైన సహకారాన్ని పెంపొందించేందుకు ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాయి. ఇది ఈ రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న సరికొత్త అధ్యాయం. ఇంకొద్ది రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి హాజరయేందుకు రష్యా పర్యటన చేస్తున్నారు. ఈ సమయంలో ఇది చోటుచేసుకోవడం మరింత ఆనందకరమైన విషయం. ఇదే సమయంలో వ్లాదివోస్తోక్లో ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశం కూడా జరగనుంది. మోదీ, వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశంకు అన్ని ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. గతవారం భారత పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రష్యాలో పర్యటించారు. భారత, రష్యాల మధ్య సంప్రదాయ న్యూక్లియర్ ఎనర్జీ సహకారం ప్రచ్ఛన్న యుద్ధ సమయం నుంచి కొనసాగుతోంది. ఇదే సహకారన్ని కొత్త పథంలో ముందుకు తీసుకువెళ్లాలని రెండు దేశాలు నిశ్చయించుకోవడం రష్యా, భారత్ సంబంధాల మధ్య మరో కొత్త మలుపు.
ఇండియా, రష్యాల మధ్య కొనసాగున్న ప్రస్తుత ఎనర్జీ విధానాలు ఎంతో విస్తృత మూలాలతో రూపుదిద్దినవి. రెండు దేశాలు కూడా తమ మార్కెట్ నెట్వర్కులను విస్తృతం చేసుకోవడానికి కృషిచేస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేలా సంసిద్ధమవుతున్నాయి. భారత దేశం ప్రధానంగా ఇతర దేశాలపై ఆధారపడడ్డాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎనర్జీకి అనుసంధానమైన సమస్యలను అస్థిర వాతావరణం ఉన్న గల్ఫ్ ప్రాంతం మీద ఆధారపడ్డం వద్దనుకుంటోంది. రష్యా తరచూ ఆంక్షల హెచ్చరికలను ఎదుర్కొంటోంది. షాలె గ్యాస్ విప్లవానంతరం అంతరాయాలను ఎదుర్కొంటోంది. అందుకే రష్యా ‘మల్టీ-పోలారిటీ’ విధానాన్ని అనుసరిస్తోంది. దీనిననుసరించి ఆసియాలో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది. అలా పరస్పర ఆధారితమైన పరిస్థితి ఏర్పాటు చేసుకుని ఎనర్జీ సమానత్వాన్ని బలోపేతం చేసేదిశగా పటిష్ట సంబంధాల కోసం భారత పెట్రోలియం, సహజవాయువుల శాఖా మంత్రి ప్రధాన్ రష్యా పర్యటన చేపట్టారు.
రచన: సత్యజిత్ మొహంతీ, ఐఆర్ఎస్, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు

భారత పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో, పరిశ్రమల ప్రతినిధులతో కలిసి రష్యా అధికారులతో, ప్రైవేటు రంగ ప్రతినిధులతో పలుపర్యాయాలు చర్చలు జరిపారు. రష్యా డిప్యూటీ ప్రధాని యూరీ ట్రూటెన్వీ, ఎనర్జీ మంత్రి అలెగ్జాండర్ నోవాక్ లతో కలిసి హైడ్రోకార్బన్ రంగంలో సహకారం, సోర్సింగ్ చమురు, సహజవాయువు కోసం, అలాగే ఖనిజాలతో కూడిన బొగ్గు మరీ ముఖ్యంగా తూర్పురష్యా ప్రాంతం నుంచి ఆ వనరులను పొందడం వంటి అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశాలు జరిగాయి. అంతేకాదు ఇరుదేశాల ఎనర్జీ రంగ పెట్టుబడులను పెంపొందించే దిశగా కృషిచేయడంపై కూడా దృష్టిసారించాయి.
భారత మంత్రి రష్యా పర్యటన వల్ల కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్ తన అంచనాల దిశగా అడుగులు ప్రారంభించింది. రష్యా సభ్య దేశంగా ఉన్న ఒపిఇసి (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)ముడి చమురు పంపిణీ పరంగా అనుకూల పాత్ర వహించాలన్నది ఒకటి. చమురు ధరలలోని హెచ్చుతగ్గులను స్థిరీకరించడం మరొకటి . దీని పరంగా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఒక గందరగోళ పరిస్థితి వల్ల ఇరుదేశాలలోని ఉత్పత్తిదారులు, వినియోగ దేశాలు పరస్పరం దెబ్బతిన్న, ప్రతిష్ఠంభన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఒపెక్ చమురు కంపెనీల మీద 4/5 కన్నా కూడా ఎక్కువగా భారత్ ముడి చమురు కోసం ఆధారపడుతోంది. భౌగోళిక-రాజకీయ అస్థిరతల కారణంగా కూడా చమురు ఉత్పత్తులు కోతలకు గురికావడం, ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం తీవ్రంగా పడడం జరిగింది.
ఇండియా, రష్యా దేశాల ఎనర్జీ మంత్రుల సమావేశం సమగ్ర ఎనర్జీ సహకార ఒప్పందానికి సంబంధించి బీజం వేసింది. ఈ ఒప్పందంపై రష్యాలో పర్యటన సమయంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు వ్లాదివోతస్టోక్ సమావేశంలో దీనిపై సంతకాలు చేస్తారు. ఎనర్జీ కారిడార్స్ రష్యాలో ఎనర్జీ బాగా ఉన్న ఫార్ ఈస్ట్రన్ ప్రాంతాలను ఇండియాతో అనుసంధానం చేస్తాయి. దీంతో ఎనర్జీ రంగంలో ఇరుదేశాల పెట్టుబడులు ప్రాజక్టులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రష్యా భారత అతిపెద్ద చమురు, సహజవాయువుల పెట్టుబడి డెస్టినేషన్. భారత ప్రభుత్వ రంగ చమురు, సహజవాయువు కంపెనీల కూటమిలో ఉన్న ఒఎన్‌జిసి, ఐఒసిఎల్ వంటివి రష్యా ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాదు షఖాలిన్, వాంకోర్, టాస్ యుర్యాఖ్లలోని ప్రాజక్టులలో కూడా పెట్టుబడులు పెడుతున్నాయి.
రష్యా దృష్టిలోంచి గమనిస్తే ఇది చైనా విస్తరిస్తున్న ఎనర్జీ రంగ పెట్టుబడులను సమతుల్యం చేస్తుంది. చైనా సైబీరియా వంటి ప్రాంతాలలో పెట్టుబడుల విస్తరణ చేస్తోంది. భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న సహజవాయువుల కంపెనీ ‘జిఎఐఎల్ ఇండియా’ 2018లో రష్యన్ గాజ్ప్రోమ్ గ్రూపు వారితో తిరిగి సుదీర్ఘ కాలానికి ఎల్ఎన్జి కాంట్రాక్టును చేసుకుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రష్యా కంపెనీలైన రోజ్‌నెఫ్ట్ వంటివాటివి ఎస్సార్ ఆయిల్ వంటి వాటిల్లో పెద్దఎత్తున ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి. ఎస్సార్ ఆయిల్‌నే ప్రస్తుతం నోవాటెక్ ఎనర్జీగా పేరు పెట్టారు. భారత దేశం కూడా రష్యా సంస్థలైన నోవాటెక్ వంటివాటితో వాటి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఎల్ఎన్జి ప్రాజక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకవచ్చింది. అంతేకాదు పలు పరిశోధనా ప్రొడక్షన్లలో, శుద్ధికార్యకలాపాలలో పాల్గొంది కూడా.
శిఖరాగ్ర సదస్సు జరగడానికి ముందు భారత పెట్రలియం శాఖా మంత్రి ప్రధాన్ రష్యా పర్యటన చేయడం వల్ల రెండు దేశాలు ఎనర్జీ రంగంలో సహకారానికి సంసిద్ధమయ్యాయి. వ్లాదివోస్తోక్లో 20 వ వార్షికత్సవ సమావేశం సందర్భంగా జరగనున్న శిఖరాగ్ర సమావేశంతో ద్వైపాక్షిక ఎనర్జీ దౌత్యంలో గుర్తించదగ్గ మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ ఎనర్జీ విస్తరణ పరంగా సువిస్తరమైన పరిణామాలకు మార్గం వేయనుంది.

Comments
Post a Comment