సంబంధాలను పున: సుస్థిరం చేసుకుంటున్న పోలెండ్, హంగేరీలు

భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. ఎస్. జైశంకర్ పోలెండ్, హంగేరీ దేశాలలో పర్యటించారు. మధ్య, తూర్పు యూరప్‌లతో సంబంధాల విస్తరణ విషయంలో భారత నిబద్ధతను ఇది వెల్లడిస్తోంది.

హంగేరీతో సంబంధాలు ఎంతో అర్థవంతమైనవి, బహుముఖమైనవి. ఈ రీతిలో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ హంగేరీ మంత్రి పీటర్ జిజార్తోని కలిశారు. ఆయన మాట్లాడుతూ చలనచిత్ర నిర్మాణం, డిజిటలైజేషన్, నీటి నిర్వహణ, సోలార్ ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో పటిష్టంగా పనిచేయాలని నొక్కి చెప్పారు. హంగేరీలో భారత్ పెట్టుబుడులు పెడుతోంది. హంగేరీ వాణిజ్య అనుకూల పర్యావరణంపై భారత్ ప్రశంసంల వర్షం కురిపించింది. విద్య, పర్యాటకం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని ఇరుదేశాలూ అంగీకరించాయి కూడా. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్‌ లోకి హంగేరీ చేరాలని నిర్ణయం తీసుకుంది. ఇరుదేశాల సహకారాన్ని సౌరశక్తి రంగంలో మరింతగా పెంపొందించుకునే దిశగా ఇది పటిష్టమైన ముందడుగు. రెండు దేశాలు కూడా ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, పార్లమెంటరీ మార్పుచేర్పులను పంచుకోవడంతోపాటు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంపై కూడా ఈ సందర్భంగా రెండు దేశాలు చర్చించాయి.

పోలెండులో భారత విదేశాంగ మంత్రి డా. జైశంకర్ పర్యటించారు. 32 సంవత్సరాల కాలంలో భారత విదేశాంగమంత్రి పోలెండును సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. పోలెండ్ విదేశీ వ్యవహారాల మంత్రి జసెక్ జపుటోవిక్జ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జి20, ఐక్యరాజ్యసమితిలో భారత కీలక పాత్రను నొక్కి చెప్పారు. అంతేకాదు దక్షిణ ఆసియాలో పోలెండ్ కీలకంగా వ్యవహరిస్తోంది. సెంట్రల్ యూరప్‌లో మరింత విస్తృతస్తాయిలో పాలుపంచుకోవాలని భారత్ ప్రగాఢ కోరిక. ‘విజెగ్రాడ్’ బృందంలో పాలుపంచుకోవాలన్న విషయం విస్పష్టంగా వెల్లడిస్తోంది. శక్తివంతమైన బహుళపక్ష వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఇరుదేశాల మంత్రులు పునరుద్ఘాటించారు. నిబంధనల ప్రాతిపదికతో కూడిన ప్రపంచ క్రమం గ్లోబల్ సుస్థిరత నిర్వహణలో చాలా కీలకమైన అంశం.

ఇరుదేశాల మంత్రులు పలు అంశాల మీద అంటే ద్వైపాక్షిక, రాజకీయ సహకారం నుంచి ఆర్థికరంగం, విద్య, సంస్కృతీ రంగాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. అనేక అంశాలలో పోలండ్ ఎంతో స్పష్టతతో వ్యవహరిస్తోంది. దేశ విదేశాంగమంత్రి జపుటోవిక్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై స్పష్టమైన అభిప్రాయంతో వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఇతర భద్రతా అంశాలను అంటే శాంతి నిర్వహణ, ఇండో-ఫసిఫిక్, పశ్చిమ ఆసియా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ప్రొలిఫరేషన్, సముద్రయానం, విమానరంగ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, మానవతా అంశాలు, శరణార్థులు, మానవహక్కులపై కూడా చర్చలు జరిపారు.

రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఇయు-ఇండియా ఎజెండా రూపకల్పనలో పోలెండ్ ఎంతో నిబద్ధతతో వ్యవహరించడంపై భారత్ ప్రశసంల వర్షం కురిపించింది. ఇద్దరు విదేశాంగమంత్రుల సమావేశం మరో గుర్తించదగిన విజయాన్ని కూడా సాధించింది. అదే పోలిష్ నేషనల్ కారియర్ ఎల్‌వొటిన ప్రకటన. అంతేకాదు వార్సా నుంచి ఢిల్లీకి నేరుగా విమానాలు మొదలవుతున్నాయి. వాణిజ్యం, టూరిజం సంబంధాలతో పాటు ఇది కూడా రెండు దేశాల ప్రజలను మరింత సన్నిహితులను చేస్తుందనడంలో సందేహం లేదు.

వాణిజ్య విషయానికి వస్తే, భారత అతిపెద్ద, ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి పోలెండ్. అంతేకాదు సెంట్రల్ యురోపియన్ ప్రాంతాలలో ఎగుమతులకు నిలయం. పోలెండ్, ఇండియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆ దేశంతో మూడు బిలియన్ అమెరికన్ డాలర్ల దగ్గర నిలిచి ఉంది. అంతేకాదు పోలిష్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆసియా మొత్తంలో భారత్ ప్రధాన గమ్యం డెస్టినేషన్. భారత విదేశాంగమంత్రి పోలెండ్ పర్యటన రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న వాణిజ్య సంబంధాలకు మరింత ఊపునిస్తుంది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, ఇండియా తూర్పు, మధ్య యురోపియన్ దేశాలతో స్నేహసంబంధాలు ఉండేవి. భారత, సెంట్రల్ యురోపియన్ దేశాల మధ్య శక్తివంతమైన సహకారం చాలాకాలం లేదు. ముఖ్యమైన రంగాలలో ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను కూడా విస్తరించడంలో కూడా వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని భారత్ కలిగి ఉంది. నిజానికి చైనా 16+1 కార్యక్రమం భౌగోళిక-రాజకీయ ప్రభావాన్ని ఈ ప్రాంతంలో కలిగి ఉంది.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తూర్పు, దక్షిణ, మధ్య యూరప్ దేశాలకు ఇటీవల కాలంలో అత్యున్నతస్థాయి పర్యటనలు చేశారు. వీటి వల్ల ఆ ప్రాంతంతో సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. మరీముఖ్యంగా హంగేరీ మల్టీ-మండల్ ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌ పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్‌టిసి) ప్రాజక్టులో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇది హిందూమహాసముద్రాన్ని, బాల్టిక్ సముద్రాన్ని కలిపే లక్ష్యంతో చేపట్టింది. ప్రత్యక్ష సంబంధానని పోలెండ్ ఏర్పరుస్తుంది. ప్రత్యక్ష సంబంధాన్ని పోలెండ్ వ్యవస్థాపించపూనుకుంది. ప్రధానంగా ఆసియాలో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. యురోపియన్ కూటమిలో మొత్తం 524 బిలియన్ పౌండ్ల జిడిపితో పోలండ్ ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పోలండ్ నిలిచింది. ప్రస్తుతం భారత పెట్టుబడుదారులను ఆకర్షించేలాగ సుస్థిరమైన పొలిష్ ఆర్థికవ్యవస్థతో సంబంధాలను రీసెట్టింగ్ చేస్తోంది. భారత విదేశాంగమంత్రి జైశంకర్ పోలెండ్ పర్యటన కూడా ఎంతో కీలకమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఛైయిర్‌గా పోలండ్ ఎంతో కీలకపాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా కశ్మీర్‌పై పాకిస్తాన్ చర్యలు చేపట్టడాన్ని పోలండ్ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉండడం మరో ముఖ్యమైన అంశం.

రచన: డా. సంఘమిత్ర శర్మ, యురోపియన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం