ఈస్ట్ వార్డుతో లోతైన సంబంధాల దిశగా భారత్
భారత విదేశాంగమంత్రి డా. ఎస్. జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ఆసియాన్’ (ఎఎస్ఇఎఎన్) ప్రాంతంలో ద్వైపాక్షిక పర్యటనలో మొదటి విడతగా ఇండొనేసియా, సింగపూర్లలో పర్యటించారు.
ఆగ్నేయాసియా పర్యటనలో తొలి అడుగుగా డా. జైశంకర్ ఇండోనేసియా విదేశాంగమంత్రి రెత్నో మర్సుదితో చర్చలు జరిపారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జనరల్ (రిటైర్డ్) లుహత్ బిన్సార్ పాండ్జైతాన్తో భారత విదేశాంగ మంత్రి సమావేశమయ్యారు. పాండ్ జైతాన్ సముద్రయాన వ్యవహారాల కో-ఆర్డినేటింగ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల మంత్రులూ భారత అండమాన్-నికోబార్ దీవులు, ఇండొనేసియా అసైహ్ దీవుల మధ్య సహకారానికి ఉన్న మార్గాల గురించిమ చర్చించారు. సముద్రయానం పరంగా ఇండొనేసియా ఉత్తరప్రాంత పాయింట్ నుంచి దక్షిణాన 90 మైళ్ల కన్నా తక్కువ దూరంలో భారత్ ఉంది. భారత్‌కు ఇది అత్యంత సన్నిహితమైన పొరుగు దేశం. దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందిన ఇరు దేశాల మధ్య సముద్రయాన సహకారం ఇరు దేశాల విదేశాంగమంత్రుల చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండొనేసియా ‘గ్లోబల్ మారిటైమ్ ఫల్‌క్రమ్’ రెండూ కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ స్వభావం ఉన్న విధానాలు. రెండు దేశాలు ‘ఆసియాన్’ ప్రాధాన్యం, ఐక్యమత్యానికి ఎంతో విలువనిస్తున్నాయి. ఇండో-ఫసిఫిక్ విజన్, లక్ష్యాల పెంపుదల నేపథ్యంలో ఈ పరిణామం చాలా కీలకమైనవి. రెండింటిమధ్య ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. దాంతో వీటిని అవి చేపట్టడం సహజం. ముఖ్యంగా పరిమిత కాలం నుంచి దీర్ఘకాల రాజకీయ-ఆర్థిక, అనుసంధాన అంశాల లక్ష్యాల్లో ఒకేరకమైన పోలికలు ఉన్న పలు అంశాలను ఆ దేశాల పంచుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇండో-ఫసిఫిక్‌పై ఆ ప్రాంతంలోని దేశాలు ఆసియాన్ అవుట్‌లుక్‌తో బహిరంగ, స్వేచ్చయుతమైన, స్వచ్ఛమైన, నియమాల ప్రాతిపదికన, శాంతియుతమైన, సంపద్వంతమైన, కలుపుకుపోయే ఇండో-ఫసిఫిక్ ప్రాంతం వంటి అంశాలను లక్ష్యాలుగా పెట్టుకున్నాయి. అంతేగాని ఏ దేశానికి వ్యతిరేకంగా ఇవి కూటమి కట్టడం లేదు.
జనరల్ (రిటైర్డ్) హెచ్. విరాన్టోను కూడా భారత విదేశాంగ మంత్రి కలిసారు. విరాన్టో ఇండొనేసియా రాజకీయ, న్యాయపరమైన, భద్రతావ్యవహారాలకు సంబంధించిన, అలాగే రక్షణ, భద్రత, కౌంటర్ టెర్రరిజం సంబంధమైన అంశాలకు కో-ఆర్డినేటింగ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు భారత విదేశాంగమంత్రి ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కుల్లాని కూడా గౌరవపురస్కరంగా కలిశారు.
భారత విదేశాంగమంత్రి ఈ పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశం భారత్, ఇండొనేసియా సంబంధాలను విస్తృతస్థాయిలో పలు రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని. భారత ప్రాంతీయ కార్యకలాపాల్లో ఇండొనేసియా స్థానాన్ని తెలిపే హేతుబద్ధమైన ముందడుగుగా దీన్ని చెప్పాలి. అంతేకాదు దీర్ఘకాల విదేశాంగ విధానంలో సైతం ఇండొనేసియాకు ఎంతో ప్రాధాన్యమైన స్థానం ఉంది.
సింగపూర్ తర్వాత ఈ ప్రాంతంలో భారత రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండొనేసియా. రెండు దేశాల మధ్య 2018-19 వాణిజ్యం 21.12 బిలియన్ అమెరికన్ డాలర్ల దగ్గర నిలిచింది.
న్యూఢిల్లీ, జకార్తాలు రక్షణ, భద్రతా సంబంధాలను బాగా పెంపొందించుకున్నాయి. రక్షణ సహకార పెంపుదల ఒప్పందం (ఎన్హాన్స్ డిఫెన్స్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్), ‘అలాగే శాంతియుత లక్ష్యాల కోసం అవుటర్ స్పేస్ ఉపయోగాలు, పరిశోధలకు సంబంధించిన సహకారంతో కూడిన ఒప్పందం ( ఫ్రేమ్వర్కు అగ్రిమెంట్ ఆన్ కో-ఆపరేషన్ ఇన్ ది ఎక్స్ ప్లొరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ అవుటర్ స్పేస్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్) లపై ప్రధాని 2018లో ఇండొనేసియాలో పర్యటించినపుడు ఇరుపక్షాలూ సంతకాలు చేశాయి. భారత, ఇండొనేసియాలు ‘కాంప్రహెన్సివ్ స్ట్రేటజిక్ పార్టనర్స్’. 2017 సంవత్సరం నుంచి సముద్రయానం గురించిన సహకారంపై సమిష్టి ప్రకటనలను ఈ రెండు దేశాలూ ఎంతో నిబద్ధతతో విడుదల చేస్తూవస్తున్నాయి.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ఈ రెండు దేశాలు వాటి తొలి నౌకా విన్యాసాలను ‘సముద్ర శక్తి’ అనే కోడ్ నేమ్‌తో 2018లో ఇండొనేసియాలోని సురబయలో నిర్వహించాయి. జకార్తా లోతైన సముద్ర ఓడరేవును అసెమ్లోని సబాంగ్ దగ్గర అభివృద్ధి చేసే పనిలో భారత్ కూడా ఇండొనేసియాలతో కలిసి పాలుపంచుకుంటోంది. ఆగ్నేయాసియాకు, భారత మారిటైమ్ గేట్ వే సబాంగ్. దీంతో ఈ ప్రాంతంలో భారత అనుసంధాన చర్యలు మరింత పెంపొందుతాయి.
డాక్టర్ జైశంకర్ సింగపూర్‌లో కూడా పర్యటించారు. ఆరవ ఇండో-సింగపూర్ జాయింట్ మినిస్ట్రీరియల్ కమిటీ (జెఎంసి) సమావేశానికి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్‌తో పాటు డా. జై శంకర్ కూడా కో-ఛైయిర్‌గా వ్యవహరించారు. సింగపూర్-భారత వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. అంతేకాదు సింగపూర్ ప్రధానమంత్రి లీ-హైసెన్ లూంగ్ని భారత విదేశాంగ మంత్రి కలిశారు. లూంగ్‌తో పాటు ఆ దేశ డిప్యూటీ ప్రధాన మంత్రి హెంగ్ స్వీ కీట్, రక్షణ మంత్రి నిగ్ ఎంగ్ హెన్లను కూడా కలిశారు.
ఇండియా-సింగపూర్ బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ శిఖరాగ్రమహాసభకు కూడా భారత విదేశాంగ మంత్రి డా. జైశంకర్ హాజరయ్యారు. ఆ సమావేశంలో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ (ఆర్‌సిఇపి) ఒప్పందంలో చేరే విషయంలో భారత్‌కు ఉన్న రిజర్వేషన్లను ఏకరువు పెట్టారు. ‘ఆర్‌సిఇపి’ ప్రతిపాదించబడిన అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇందులో పది ఆసియాన్ సభ్యదేశాలతో పాటు ఆరు చర్చలను నిర్వహిస్తున్న భాగస్వామ్యపక్షాలు కూడా ఉన్నాయి.
ఆసియాన్ ప్రాంతంలో భారత కార్యకలపాలలో సింగపూర్ ప్రాధాన్యాన్ని డా. జైశంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత స్మార్ట్ సిటీ కార్యక్రమాలలో సింగపూర్ ప్రధాన భాగస్వామి. అంతేకాదు వాణిజ్యం, ఫైనాన్స్, కామర్స్ ఇతర ఉపరంగాలలో కూడా ఎంతో కీలకమైన భాగస్వామి. ఇటీవల భారత్ ద్రవ్యపరమైన పారదర్శకత కోసం చేస్తున్న కృషిపై సింగపూర్ ప్రశంసలు కురిపించింది. ఆయా రంగాలలో భారత్‌తో కలిసి పనిచేయాలనే ప్రగాఢ ఉద్దేశం సింగపూర్‌కు ఉందనేది విస్పష్టమవుతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ పర్యాయం దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ సుసంపన్నంగా కొనసాగుతోంది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ ’ కింద భారత్ తూర్పు దిశగా కార్యకలాపాల పెంపుదలకు ఇండో-ఫసిఫిక్ దేశాలకు నిత్యనిర్దిష్ట లక్ష్యాలతో కూడిన పర్యటనలను కొనసాగిస్తోంది. ఈ రకమైన కృషి నేపథ్యంలో డా. జైశంకర్ పర్యటన ఎంతో ముఖ్యమైన అంశం.
రచన: డా. రాహుల్ మిశ్రా, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment