అణు ఒప్పందం కింద అంగీకరించిన అంశాలకు అప్రధాన్యం ఇవ్వాలని నిశ్చయించుకున్న ఇరాన్

అణు ఒప్పందం కింద అంగీకరించిన అంశాల నుంచి మరింతగా పక్కకు తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని 2015, జూలైలో ప్రపంచ శక్తివంతమైన దేశాలతో కలిసి ఇరాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్ ఈ చర్య వెనుక కారణం లేకపోలేదు. అణుఒప్పందం విషయంలో యురోపియన్ కూటమి తమ నిబద్ధత విషయంలో వైఫల్యం చెందినపప్పటి నుంచి ఇరాన్ కూడా అణు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని భావించడం లేదు. అమెరికా ఏకపక్షంగా అణు ఒప్పందం నుంచి తప్పుకున్న నాటి నుంచి ఇరాన్, యురోపియన్ కూటమి రెండూ అణు ఒప్పందాన్ని పరిరక్షించేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. అణు ఒప్పందం కింద యురోపియన్ కూటమి ఇరాన్‌కు చేసిన ఆర్థిక ప్రతినలు దానికి చేరినప్పుడు అణు ఒప్పందం కింద తను ఒప్పందపడిన వాటిని ఇరాన్ కొనసాగించగలదు. తన అణు కార్యక్రమాల పరిమితులను సైతం అనుసరించగలదు.

ఇరానియన్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ ఆలీ అక్బర్ సలేహి స్పందిస్తూ ఈ నిర్ణయం వెనుక ఇరాన్‌కు స్పష్టమైన కారణం ఉందంటూ దాని గురించి సమగ్రంగా వివరించారు. సలేహి అన్నట్టు, యురోపియన్ కూటమి తమ మాట నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందడంతో ఇరాన్ కూడా తన కమిట్‌మెంట్లను తగ్గించుకొనే హక్కును పొందిందదన్నారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ యురోపియన్ కూటమి విదేశాంగ విధాన అధిపతికి ఒక లేఖను గత వారం రాసినట్టు ఒక ఇరాన్ వార్తా ఏజెన్సీ పేర్కొంది. ఆ లేఖలో జవాద్ ఇరాన్ అణు అధ్యయయనం, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి అంగీకరించిన వాటి నుంచి మరింతగా విరమించుకుంటోందంటూ పేర్కొన్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఇరాన్ యురోనియం అభివృద్ధిని వేగవంతం చేయడానికి సిద్ధమవుతోంది. ఏమైనప్పటికీ, కొత్త చర్యలు ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాయంటే దానికి కారణం అది ఐఎఇఎ నిఘా కింద ఇంకా ఉండడమే. ఒకవేళ యురోపియన్ అగ్రదేశాలు తామిచ్చిన మాటను నిలబెట్టుకున్న పక్షంలో తమ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటామని ఇరాన్ పేర్కొంది.

న్యూక్లియర్ ఒప్పందం పరంగా అంగీకరించిన అంశాలకి అప్రధాన్యం ఇవ్వాలని ఇరాన్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక అణు ఒప్పందం ముగిసినట్టేనని భావించనవసరం లేదు. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం యురోపియన్ కూటమిపై ఒప్పందం పరంగా ఒత్తిడి తెచ్చే దృష్టితో చేపట్టిందని కూడా చూడొచ్చు. ఇరాన్ వేగవంతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉంది. నిజానికి, ఫ్రాన్స్ సారథ్యంలో నడుస్తున్న యురోపియన్ కూటమి అణు ఒప్పందాన్ని రక్షించేందుకు ఎంతగానో ప్రయత్నించింది. దీనికి సాక్ష్యం కూడా విస్పష్టంగా కనిపిస్తోంది. జి7 శిఖరాగ్ర సభ గత నెల ఫ్రాన్సులో జరిగింది. ఆ సమావేశంలో యురోపియన్ కూటమిలో ఈ తరహా ధోరణి కనిపించింది. ఫ్రెంచి ప్రెసిడెంట్ మ్మన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మీద బియార్రిట్జ్‌ కు ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ వచ్చారు. ఆ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యారు. ఫ్రెంచి ప్రెసిడెంట్ ఈ దిశగా చేసిన ప్రయత్నం ఇరాన్, అమెరికాల మధ్య సంభాషణలకు దారితీయకపోయినా అణు ఒప్పందాన్ని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్న విషయం ప్రపంచానికి స్పష్టమైంది.

ఇరాన్, అమెరికాల మధ్య ఘర్షణ సాగుతున్న పరిస్థితిలో, ఇరాన్ రోజు రోజుకూ చెలరేగుతున్న నేపథ్యంలో, పర్షియన్ గల్ఫ్‌ లో ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న ఘటనలు ఇవన్నీ పరిస్థితులను మరింత తీవ్రతరం చేశాయి. దీంతో సంక్షోభ పరిస్థితులను అడ్డుకునేందుకు అన్ని పక్షాలూ నిజాయితీతో కూడిన ప్రయత్నాలను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం తలెత్తింది. అమెరికా ఇప్పటిదాకా ఇరాన్‌పై పూర్తిస్థాయిలో ఒత్తిడి తెచ్చే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీంతో అమెరికా ప్రభుత్వ యంత్రంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసిన ప్రతి దేశంపై పరిమితులను విధించడంలో పట్టు విడుపులు లేకుండా మొండిగా వ్యవహరిస్తోంది. ఈ విధానం ఇరానియన్ అణు ఒప్పంద మౌలిక ఉద్దేశాన్ని పరిమితిస్తోంది. అణు కార్యక్రమాన్ని నిరోధించే విషయంలో నిబద్ధత పాటించడం వల్ల ఇరాన్ ఆర్థిక ప్రయోజనాలను పొందుతుంది. అమెరికా అణు ఒప్పందం నుంచి విరమించుకోవడంతో ఈ తరహా సందిగ్ధం తలెత్తింది. తిరిగి ఇరాన్‌పై పరిమితులు విధించింది. ఈ డైలమా లేదా సందిగ్ధావస్థ స్థితినే యురోపియన్ కూటమి పరిష్కరించాలని ప్రయత్నం చేస్తోంది.

ఇరాన్, అమెరికా, యురోపియన్ దేశాల మధ్య న్యూక్లియర్ ఒప్పందం పరంగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను ఎంతో దగ్గరగా భారత్ పరిశీలిస్తోంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్‌కు కూడా ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి. కారణం ఎనర్జీ వనరుగా ఇరాన్ అతి ముఖ్యమైందన్న విషయం విస్పష్టమే. భారత పొరుగుదేశాల విస్తరణ లో ఇరాన్ కూడా వస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు భారత్‌కు ఎంతో ముఖ్యం. ప్రపంచ శక్తులన్నీ సమైక్యంగా, స్నేహంగా ఇరాన్ అణు సంక్షోభాన్ని త్వరలోనే పరిష్కరించుకోగలవని ఆశిద్దాం.

రచన: డా. అసిఫ్ షుజా, ఇరాన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం