జమ్ము-కశ్మీర్ అభివృద్దికి ప్రధాని రోడ్ మ్యాప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేసించి ప్రసంగించారు. భారత రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దు చేయడానికి కారణాలను సమగ్రంగా వివరించారు. ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్. ఈ వారం పార్లమెంటులోని ఉభయసభలు ఆర్టికల్ 370 కొట్టివేతపై సంపూర్ణమద్దతు తెలుపుతూ ఓటు వేశాయి. రెండు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్, లదాఖ్‌లు ఉనికిలోకి వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి ఉగ్రవాదం, వేర్పాటువాదం, వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి పెద్ద సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయన్నారు. 370 ఆర్టికల్ నుంచి స్వేచ్ఛ పొందడమనేది నేటి వాస్తవం అని వ్యాఖ్యానించారు.ఈ ఆర్టికల్‌ని సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేవారు ఉపయోగించుకున్నారు. భూలోక స్వర్గంగా భావించే కశ్మీర్లో సమస్యలను రెచ్చగొట్టారు. గత మూడు దశాబ్దాల కాలంలో 42 వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడానికి పాకిస్తాన్ కారణం. ఆర్టికల్ 370 వల్ల దేశ చట్టాలను శక్తివంతంగా అక్కడ అమలుచేసే అవకాశం లేకపోయింది. ఇక్కడ భారీగా నష్టపోయింది స్త్రీలు, పిల్లలు, నిరుపేదలు, యువతే. పాత కశ్మీర్‌లోని యువత ఎన్నో అవకాశాలను కోల్పోయింది. వారి శక్తిసామర్థ్యాలను వారు తెలుసుకోలేకపోయారు. 370 ఆర్టికల్ రద్దువల్ల డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ అటల్ బిహారీ వాజ్‌పేయి కలలు సాకారమయ్యాయని మోదీ అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన కశ్మీర్, జమ్ము దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు మల్లేనే ఇవి కూడా అన్ని రకాల హక్కులను అనుభవించనున్నాయి.
కొత్తగా ఏర్పడ్డ జమ్ము, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక గురించి వివరించారు. ఆర్టికల్ 370 వల్లే జమ్ము, కశ్మీర్‌లలో ఉగ్రవాదం పెచ్చరిల్లిందని మోదీ అన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో రెండు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలూ కొత్త శకాన్ని చూడనున్నాయన్నారు. మోదీ మాట్లాడుతూ సుపరిపాలనతోపాటు, పారదర్శకపాలన ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల కీలక అంశం అన్నారు.
జమ్ము,కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలలో అభివృద్ధికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ నూతన చర్యలను ప్రకటించారు. త్వరలోనే ఆ రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి ఫలాలను చూస్తారన్నారు. మొత్తం జాతి, ప్రభుత్వం రెండు కేంద్రపాలితప్రాంతాలు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. చలనచిత్రాల చిత్రీకరణకు కశ్మీర్ పెట్టింది పేరని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ దశాబ్దాలుగా అక్కడి అందమైన ప్రదేశాలను చలనచిత్ర పరిశ్రమ షూటింగ్ చేయలేని పరిస్థితిలో ఉండేదన్నారు. ఈ సందర్భంగా చలనచిత్రరంగం వారిని కశ్మీర్లో చిత్రీకరణకు మోదీ ఆహ్వానించారు. మహాద్భుతంగా ఉండే కశ్మీరీ అందాలను ప్రపంచ ప్రజలంతా ఆస్వాదిస్తారన్నారు.
కొత్తగా ఏర్పడ్డ జమ్ము, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో యువత, మహిళలు పాలుపంచుకోవాలని ప్రధాని మోదీ ఉత్సాహపరిచారు. శాశసనభకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. తద్వారా జమ్ము, కశ్మీర్ ప్రాంతాల అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యం పంచుకోగలరని మోదీ అన్నారు. కశ్మీర్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోదీ భరోసా ఇచ్చారు. ఇంకా మాట్లాడుతూ అభిప్రాయవిభేదాలు ప్రజాస్వామ్యంలో సహజమని వ్యాఖ్యానించారు. జాతి ప్రయోజనాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు. తద్వారా జమ్ము, కశ్మీర్ ప్రగతికి దిశ నిర్దేశం వ్యాప్తిచేయాలని కోరారు.
లదాఖ్‌ను కేంద్రపాలితప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి లదాఖ్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రధాని అన్నారు. లదాఖ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం కేంద్ర ప్రభుత్వ తప్పకుండా చేస్తుందన్నారు. అలాగే జమ్ము, కశ్మీర్ కేంద్రపాలితప్రాంతాలలో మౌలికసదుపాయాల ప్రాజక్టులు అంటే రహదారులు, విమానాశ్రయాల ఆధునీకరణ, రైల్వేలైన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటివి అభివృద్ధిచేస్తామని మాట ఇచ్చారు. పర్యాటకరంగం వల్ల ఈ రెండు కేంద్రపాలిత రాష్ట్రాలలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఇతర సంబంధిత పరిశ్రమలతోపాటు మౌలికసదుపాయాల నిర్మాణం కూడా వృద్ధిచెందుతుందని వ్యాఖ్యానించారు. జమ్ము, కశ్మీర్, లదాఖ్‌లు అభివృద్ధి చెందిన కేంద్రపాలిత ప్రాంతాలుగా నిలవడానికి ఎక్కువ సమయం పట్టదని కూడా ప్రధాని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ప్రధాని మోదీ 38 నిమిషాలు ప్రసంగించారు. అంతసేపూ ప్రధాని మోదీ పూర్తిగా కశ్మీర్, జమ్ము, లదాఖ్‌ల అభివృద్ధిపై మాత్రమే మాట్లాడారు. పాకిస్తాన్ కుట్రలను పట్టించుకోలేదు. కశ్మీర్ సమస్యను భారత పశ్చిమ పొరుగుదేశం అంతర్జాతీయంగా సమస్యాత్మకం చేయాలని కుట్రలు చేస్తోంది. కానీ ఈసారి గ్లోబల్ కమ్యూనిటీ మొత్తం ఇస్లామాబాద్ ప్రవర్తన, కుతంత్రాలతో అలసిపోయింది. దీంతో పాక్ ప్రతిస్పందనకు అవి ప్రతిస్పందించ లేదు. తాజా పరిణామాలు వాటిపై ఎలాంటి ప్రభావం తీసుకురాలేదు.
అభివృద్ధి ఎజెండాను చెప్పే తీరును భారత ప్రధానిని చూసి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేర్చుకోవాల్సిన సమయం ఇది. దీనివల్ల పాక్ ప్రజలు తప్పకుండా లబ్ది పొందుతారు.

రచన: పదం సింగ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు
Comments
Post a Comment