రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనతో పశ్చిమాఫ్రికాతో వేగం పుంజుకున్న భారత్ సంబంధాలు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారం రోజుల పాటుగా ఆఫ్రికాలో పర్యటించారు. ఫ్రాంకోఫోన్ దేశాలైన పశ్చిమాఫ్రికాలోని బెనిన్, జాంబియా, గునియా దేశాలలో ఆయన పర్యటించారు. రాష్ట్రపతి తన పర్యటనకు ఎంచుకున్న దేశాలను చూస్తే భారత దేశం, ఆఫ్రికాతో చెలిమికి ఎంత ప్రాధ్యాన్యత ఇస్తుందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారత్, పశ్చిమాఫ్రికాలోని ఫ్రాంకోఫోన్ దేశాల పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తోంది.
ఈ మూడు దేశాల పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రాష్ట్రపతి కోవింద్ పర్యటన చారిత్రాత్మకమైంది. భారత్‌కు ఏ రాష్ట్రపతి కూడా ఇంత వరకు ఈ దేశాల్లో పర్యటన చేయలేదు. భారత దేశానికి సంప్రదాయంగానే ఆంగ్లోఫోన్ ఆఫ్రికన్ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ఫ్రాంకోఫోన్ పశ్చిమాఫ్రికా దేశాలతో అంతగా లేదు. భాషాపరమైన అడ్డంకులు, దూరం కారణంగా సంబంధాలు బలోపేతం కాకపోవడంలాంటి పలు కారణాలతో ఈ దేశాలతో అంతంత మాత్రమైన చెలిమి ఉంది. దీనికి తోడు కొన్ని విధానపరమైన నిర్ణయాల కారణంగా కూడా ఈ దూరం ఉండి పోయింది. అయితే ఇపుడు సంబంధాలు పెంపొందించేందుకు ఈ నిర్ణయాలల్లో మార్పునకు ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ క్రమంలోనే భారత దేశం నుంచి ఉన్నత స్థాయి పర్యటనలు జరుగుతున్నాయి. ఫ్రాంకోఫోన్ ఆఫ్రికన్ దేశాలతో సంబంధాలు మెరుగు పర్చుకోవడమే ఈ పర్యటనల ఉద్దేశం. ఈ క్రమంలోనే భారత దేశం ఇటీవల ఆఫ్రికా దేశాలలో 18 మిషన్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఫ్రాంకోఫోన్ దేశాలలోనే ఇవి అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంతో దౌత్యపరమైన సంబంధాలకు ప్రాధాన్యతనిస్తోంది. సరిహద్దు కోణంలో కూడా భారత దేశం పర్యటనల ప్రాధాన్యత గమనించారు. ఆఫ్రికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇది సాగుతోంది.
రాష్ట్రపతి కోవింద్ తన పర్యటనలో భాగంగా ఉన్నత స్థాయి ప్రతినిధి బృంద చర్చలు జరిపారు. ఆయా దేశాధినేతలతో సంభాషించారు. బెనిన్, జాంబియా దేశాల జాతీయ అసెంబ్లీలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు దేశాల్లో ఉన్న భారత సంతతితో ఇష్టాగోష్టి భేటీలు జరిపారు. అయితే చర్చలన్నింటి ఉద్దేశం ఒక్కటే. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పర్చుకోవడమే. వ్యాణిజ్యం, పెట్టుబడులు, సౌర శక్తి, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీలజీ, సామర్థ్యం పెంపు, సముద్ర జలాల రక్షణ, రక్షణ రంగ సహకారం లాంటి ఆంశాల్లో ఇరు దేశాలు పరస్పర అవగాహనతో సంబంధాలు మెరుగుపర్చుకోవడం కూడా పర్యటనలోని ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ అంశాల్లో కూడా సారూప్యమైన అవగాహనతో ఉండాలని చర్చల సందర్భంగా చర్చించారు.
బెనిన్‌లో ఇరు పక్షాలు ఎగుమతుల రంగాన్ని విస్తరించుకోవాలనీ, పరస్పర పెట్టుబడులకు సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. రాష్ట్రపతి కోవింద్ ఈ వీసాల జారీకి అంగీకరించారు. దీని ద్వారా వ్యాపార సంబంధాలు మరింత మెరుగవుతాయని భారత్ ఉద్దేశం. జాంబియాలో కూడా రాష్ట్రపతి కోవింద్ భారత్ ఆకాంక్షలు ఏమిటో వివరించారు. భారత దేశంలో వ్యాపారం, పెట్టుబడులకు సహకరించాలనీ, భారతీయ పెట్టుబడిదారులకు మద్దతుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గునియాలో రాష్ట్రపతి కోవింద్ భారత దేశ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారని ప్రకటించారు. ముఖ్యంగా మైనింగ్, మౌలిక వసతులు, ఆరోగ్యం, ఫార్మూస్యుటికల్ రంగాల్లో ప్రవేశించేందుకు ఆసక్తితో ఉన్నారని తెలిపారు.
అభివృద్ధితో కూడా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రపతి కోవింద్ ఆయా దేశాలల్లోని ప్రాధాన్యతాంశాలతో కూడిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. బెనిన్‌లోని జాతీయ ప్రాధాన్యతతో కూడిన ప్రాజెక్టుల కోసం 100 మిలియన్ అమెరికా డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రత్యేకంగా రూపొందించి ఐటీఈసీ కోర్సు, బెనిన్‌లోని విదేశాంగ దౌత్యవేత్తలకు స్పెషల్ ప్రొఫెషనల్ కోర్సును కూడా అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒక జాంబియాకు నైపుణ్యాభివృద్ధి, కాటేజ్ ఇండస్ట్రీ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 5000,000 అమెరికన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు సుముఖత ప్రదర్శించారు. జాంబియా కోరిక మేరకు జ్యుడీషియరీ, పోలీస్, పరిపాలన, సాంకేతిక విజ్ఞాన రంగంలో శిక్షణ అందిస్తామని మాట ఇచ్చారు. ఇక గునియాకు 170 మిలియన్ అమెరికన్ డాలర్లను అప్పుగా ఇస్తామని కోవింద్ ప్రకటించారు. కోనక్రి నీటి సరఫరా ప్రాజెక్టు కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. రాష్ట్రపతి కోవింద్ వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సోలార్ ఇంధనాన్ని వినియోగించే విషయంలో సహకారాన్ని కూడా కోరారు. అంతేకాక అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌లో భారత్ లబ్ధిదారుగా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసిన బెనిన్, జాంబియా, గునియా దేశాల అధినేతలను అభినందించారు.
రక్షణ, భద్రతా రంగంల్లో కూడా సంబంధాలు మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యతను భారత దేశం ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. గునియా గల్ప్‌లో పైరసీ పెరిగినందున బెనిన్‌కు యాంటీ పైరసీ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గాను శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించింది. పెరుగుతున్న ఉగ్రవాదం పట్ల అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై రూపొందించిన సమగ్ర తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రకటనలో ఆయా దేశాలు అభిప్రాయపడ్డాయి.
ఈ మూడు పర్యటనల సందర్భంగా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు వివిధ ఎంవోయుల మీద సంతకాలు జరిగాయి. బెనిన్‌లో నాలుగు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. సాంస్కృతిక సహకారం, ఎక్స్‌పోర్డ్ క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సూరెన్స్‌ల విషయంలో సహకారం, ఈ విబాబ్ ( ఈ విద్యా భారతి అంగ్ ఈ ఆరోగ్య భారతి) నెట్‌వర్క్ ప్రాజెక్ట్, భారత దౌత్య, అధికారిక పాస్‌పోర్టుల విషయంలో విసా సడలింపు అంశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. జాంబియాలో ఇరు పక్షాలు సంప్రదాయ వైద్య రంగం, హోమియోపతి రంగాల్లో పరస్పరం సహకరించేందుకు కుదిరిన ఎంవోయుపై సంతకాలు చేశారు. గునియాలో కూడా ఇరు దేశాల అధ్యక్షులు రెండు ఎంవోయులపై సంతకాలు చేశారు. సంప్రదాయ వైద్య విధానం, హోమియోపతి రంగాల్లో సహకరించుకునేలా ఒక ఎంవోయు, ఈవిబాబ్ నెట్‌వర్క్ ప్రాజెక్టు, సంప్రదాయ ఇంధన రంగంలో మరో ఎంవోయు కుదిరింది.
మొత్తం మీద చూస్తే రాష్ట్రపతి కోవింద్ ఈ మూడు దేశాల పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంతో ఈ పర్యటన ద్వారా సంబంధాలు మెరుగుపడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
రచన : డాక్టర్ నివేదిత రే, ఆఫ్రికా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment