సంవత్సరం పూర్తిచేసుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం: సంబరాలు-వ్యతిరేక ప్రదర్శనలు
గత వారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. కృతజ్ఘతా దినోత్సవంగా ఆ రోజును పాక్ ప్రభుత్వం జరుపుకుంది. మరోవైపు ప్రతిపక్షపార్టీలు భారీ ఎత్తున వ్యతిరేక ప్రదర్శనలను దేశమంతటా నిర్వహించాయి. జూలై 25వ తేదీని పాకిస్తాన్ చరిత్రలో అతి చీకటి రోజుగా అవి అభివర్ణించాయి. పాకిస్తాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు-పిఎంఎల్(ఎన్), పిపిపి, జెఇఐలు లాహోర్, కరాచీ, క్వెట్టా, ఇతర ప్రాంతాలలో భారీ స్థాయిలో వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహించాయి. మరియం నవాజ్, బిలావల్ భుట్టో జర్దారీ, మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తదితరులు తమను వ్యతిరేకించేవారిని ఇమ్రాన్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని, మీడియాను నియంత్రిస్తోందని, అంతేకాదు దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం వైపు నెడుతోందని, అప్పులపాలు చేస్తోందని నిందించారు. అంతేకాదు ప్రాంతీయ భావజాలాన్ని ప్రజల్లో పెంచడమే కాకుండా యుఎస్ చెప్పినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ మరింత ముందుకు వెళ్లి ఆగస్టు నెలలో ప్రధాని పదవికి ఇమ్రాన్ రాజీనామా చేయాలంటూ అల్టిమేటం జారీచేశారు. అలా చేయని పక్షంలో దేశం మొత్తం ఇస్లామాబాద్ తరలివచ్చి పాక్ ప్రభుత్వం లొంగేట్టు చేస్తుందని ప్రకటించారు.
గతంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇమ్రాన్ ఖాన్ పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆందోళనలను నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక ప్రదర్శనలు ఎంతవరకూ సాగాయంటూ ఇస్లామాబాద్‌కు ‘లాంగ్ మార్చ్’ నిర్వహించే దాకా వెళ్లాయి. అంతేకాదు నాలుగు నెలల పాటు ఇరవై నాలుగు గంటలూ ఇస్లామాబాద్‌లో బైఠాయించి నవాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలను కొనసాగించారు. మొత్తం నగరంలో ప్రతిష్ఠంభన తలెత్తేట్టు ఇమ్రాన్ చేశారు. ఇప్పడు ప్రతిపక్షాలు కూడా ఇమ్రాన్ అనుసరించిన పంథానే చేపట్టి ముందుకు సాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి కూలదోయాలని నిశ్చయించకున్నాయి.
సరికొత్త పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రతిన చేస్తూ ఇమ్రాన్ ఖన్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టారు. యువతకు ఉపాధిని కల్పిస్తానన్నారు. దేశ ఆర్థికరంగాన్ని మెరుగుపరుస్తానన్నారు. అంతేకాదు నాణ్యమైన పాలనను ప్రజలకు అందిస్తానని ఇమ్రాన్ మాటిచ్చారు. కానీ దేశ ఆర్థిక రంగం చూస్తే తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజలకు ఉద్యోగాలు లేవు. మరోవైపు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. మరో వ్యంగ్యపూరిత విషయం ఏమిటంటే పాకిస్తాన్ ప్రధాని ఇటీవల ఒక ఆర్డర్ జారీచేశారు. రోటీ, నాన్ల ధరలను పునుద్ధరించాలని ఆ ఆర్డర్ చెపుతోంది. ఈ చర్య ఎలా ఉందంటే ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పరిగణించవలసిన అవసరమే లేనట్టు ఉంది. అంతేనా...పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ను తిరిగి పునరుద్ధరించారు. ఆ విధంగా ముగ్గురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నవాజ్ షరీఫ్, ఆసిఫ్ ఆలి జర్దారి, షాహిద్ ఖాకాన్ అబ్బాసిలను అవినీతి ఆరోపణల మీద జైళ్లల్లో నిర్బంధించి నానా బాధలు పెడుతున్నారు. జర్దారీ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు కూడా.
ఇమ్రాన్ ఖాన్ని తోలుబొమ్మ ప్రధానిగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. ప్రభుత్వ కళ్లాలు సైనిక వ్యవస్థ చేతుల్లో ఉన్నాయి. ఆ సైనిక ప్రభుత్వమే ఇమ్రాన్‌ను అధికారంలోకి తీసుకువచ్చింది. అంతేకాదు ఇమ్రాన్‌కు ‘సెలక్టడ్ ప్రధాని అనే నిక్‌నేమ్‌ని కూడా తెచ్చిపెట్టింది. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వంపై సైనిక ప్రభావం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇటీవల ఏర్పరచిన ‘ఎకనామిక్ డెవలెప్మెంట్ కౌన్సిల్’ (ఆర్థిక అభివృద్ధి మండలి)లో పాకిస్తాన్ ప్రధాన సైనికాధికారి జనరల్ కమర్ జావెద్ బజ్వాను సభ్యుడిగా చేయడంతో ఈ విషయం మరింత విస్పష్టమైంది. ఆ దేశ చరిత్రలో తొట్టతొలిసారి పాక్ ప్రధాని వెంట సైనికాధికారి సైతం అమెరికా పర్యటనకు వెళ్లడం, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సమావేశంలో పాల్గొనడం చూస్తాం.
పాకిస్తాన్ యంత్రాంగంలో సైనిక వ్యవస్థ ఆధిపత్యాన్ని ఇది విస్పష్టంచేస్తోంది. ఒక సంవత్సరం క్రితం పాక్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నేపథ్యం గల అమెరికా ఆర్థికవేత్త అటిఫ్ మియాన్‌కు ‘ఎకనామిక్ డెవలెప్మెంట్ కౌన్సిల్’లో అవకాశం కల్పిస్తానంటూ ఇచ్చిన మాటను తప్పారు. ఇందుకు కారణం పాకిస్తాన్ సైన్యం, వ్యతిరేకవర్గాలు అటిఫ్ మియాన్‌ను ప్యానల్లో తీసుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకించడమే. అప్పటి నుంచి పాక్ సైన్యం మరి వెనక్కి చూసింది లేదు. ప్రభుత్వ పరంగా ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రజలకు ప్రధానిగా బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వ నిర్వహణ, నియంత్రణలు మొత్తం పాక్ సైనిక జనరల్స్ చేతుల్లోనే ఉన్నాయి. తన స్వంత పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ దేశంలో ఇంకా బలంగా వేళ్లూనుకోలేదు. అందుకే ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సైన్యం అవసరం ఎంతో ఉంది.
మీడియా మీద కూడా సైనిక నియత్రణ అక్కడ తీవ్ర స్థాయిలో ఉందనే చెప్పాలి. టెలివిజన్ ఛానల్స్ 25వ తేదీ సంబురాలను విస్తృతంగా కవర్ చేసింది. అదే ప్రతిపక్షాల ర్యాలీలను, నిరశన ప్రదర్శనలను ఛానల్స్‌లో ప్రసారం చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. మీడియా సిబ్బంది తరచూ సైనిక హెచ్చరికలను ఎదుర్కొంటున్నారు. దీనికి మీడియా సిబ్బంది నిర్వహించిన ప్రదర్శనలే సాక్ష్యం. ఇదే మీడియా ప్రతిపక్షనాయకుడిగా ఇమ్రాన్ ఖాన్‌కు ఎంతో కవరేజ్ ఇచ్చి పైకెత్తిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ మర్చిపోయినట్టున్నారు. 2018 పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ విజయానికి ఈ మీడియానే కారణమనే సంగతి ఆయనకు గుర్తులేదు పాపం. మీడియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ మీడియా కోర్టులను ఏర్పాటు చేయాలనే ఒక అంశం కూడా అక్కడ తాజాగా పైకి వచ్చింది. దానిపై తీవ్ర చర్చలకు కూడా దారితీసింది.
ఈ నేపథ్యంలో చట్టప్రకారం పాలన అందించే సరికొత్త పాకిస్తాన్ నిర్మాణ స్థాపన ప్రతిన ఇమ్రాన్ ఖాన్ చేతుల్లోంచి మెల్లగా జారిపోతోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య సంఘర్షణలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కూడా.

Comments
Post a Comment