దక్షిణ చైనా సముద్రంలో తీవ్రతరమవుతున్న ఒత్తిడులు
దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో సౌత్ చైనా సీ వివాదం మళ్లా వార్తల్లోకెక్కింది. బ్యాంకాక్‌లో జరగబోయే తొమ్మిదవ తూర్పు ఆసియా విదేశాంగమంత్రుల శిఖరాగ్ర సదస్సులో సౌత్ చైనా సీ వివాదం తప్పకుండా చర్చల్లో తలెత్తే అవకాశాలు భాగా ఉన్నాయి. ఈ సదస్సుకు భారతదేశ విదేశాంగమంత్రి డా. ఎస్. జైశంకర్ హాజరవు తున్నారు.
ఈ ఏడాది జూలైలో మొదటి వారంలో వరుస సంఘటనలు జరిగాయి. చైనా సర్వే నౌక ‘హయాంగ్దిజి’ 8 ను రెండు చైనా తీరప్రాంత గస్తీ నౌకలు పహరాకాస్తున్నాయి. అది సముద్ర సిస్మిక్ సర్వేను వియత్నాం ఎక్స్ క్లూజివ్ జోన్ (ఇఇజడ్) 200 నాటికల్ మైల్స్ పరిధిలో చేసింది. ఈ చర్య ఆ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా హనోయ్‌లో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
చైనా, తైవాన్, ఇతర ముఖ్యమైన ఆగ్నేయాసియా దేశాలు (బ్రూనె, మలేసియా, ఫిలిప్పైన్స్, వియత్నాంలు) దక్షిణ చైనా సముద్రప్రాంతంలో విస్తృత ప్రాంతీయ హక్కులను లేవనెత్తాయి. ఇది చాలా తీవ్రమైన సముద్ర సరిహద్దు వివాదం. ఇందులో చైనా కేంద్రంగా ఉంది.
సౌత్ చైనా సీ ప్రాంతంలో చైనా ప్రవర్తనా పంథాను జాగ్రత్తగా విశ్లేషిస్తే, చైనా కొద్దిగా కూడా తన హక్కులను, వాదనలను ఈ ప్రాంతంపై వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అంతేకాదు ఇందులో ఉన్న ఇతర పక్షాలకు ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి కూడా అది సుముఖంగా లేదు. రోడ్రిగో డ్యుటెర్టే నాయకత్వంలోని ఫిలిప్పైన్స్ తన వాదనలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే, వియత్నాం సౌత్ చైనా సీ వివాదంపై సముద్ర సరిహద్దుల పరంగా గట్టి నిర్ణయంతో వ్యవహరిస్తోంది. ఇదంతా సౌత్ చైనా సీ ప్రాధాన్యాన్ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని స్పష్టంచేస్తోంది. కారణం ఈ సముద్ర ప్రాంతంలో సహజనవనరులు పుష్కలంగా ఉన్నాయి. కనీసం 11 బిలియన్ బ్యారెల్స్ చమురు, అలాగే సముద్ర సీబెడ్ అడుగున 190 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల వద్ద సహజవాయువు సంపద ఉంది. పైగా ముఖ్యమైన సముద్ర కమ్యూనికేషన్ లైన్‌తో పాటు చైనాకు చమురు దిగుమతుల్లో 80 శాతం ఈ మార్గం నుంచే వస్తాయి.
ఎంతోకాలం ఓర్పుతో వ్యవహరించిన వియత్నాం తిరిగి ఈ అంశాన్ని అంతర్జాతీయస్థాయిలో కేంద్రీకరించడం ప్రారంభించింది. ఈసారి, ఈ సమస్యపై వియత్నాంకు అంతర్జాతీయ మద్దతు అవసరం. నాలుగుపక్షాల భద్రతా సంభాషణల కింద వియత్నాం దీనిపరంగా జరుగుతున్న ప్రయత్నాలకు ఎంతో మద్దతును అందిస్తోంది.
ఈ వివాదంలో భారత్ పార్టీ కాదు. అదేవిధంగా ఏ ఒక్కదేశంతోనో కలుస్తూ తన మద్దతును భారత్ తెలపడంలేదు. కానీ న్యూఢిల్లీకి కూడా సౌత్ చైనా సీలో పెద్ద వాటానే ఉంది. భారతదేశానికి కూడా సౌత్ చైనా సీ ఎంతో కీలకమైంది. భారత చమురు, సహజవాయివుల కో-ఆపరేషన్ (ఓఎన్జిసి)కి వాణిజ్యపరమైన వాటాలు ఉన్నాయి. ఈ వివాదం పరంగా నావిగేషనల్ ఫ్రీడం పరిరక్షణే తన అధికారిక విధానంగా భారత్ అనుసరిస్తూ వస్తోంది. అంతర్జాతీయ జలాల వినియోగం పరంగా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా చట్టబద్ధ వాణిజ్య విధానాలతో ముందుకు సాగాలన్నది భారత విధానం. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ‘కన్వెన్షన్ ఆణ్ ది లా ఆఫ్ సీ (యుఎన్సిఎల్ఓఎస్) 1982 నిబందనలను అనుసరించాలని భావిస్తోంది.
ఆగ్నేయాసియా ప్రాంతంలో విస్తరిస్తున్న భారత ఉనికిని వియత్నా ఎప్పుడూ ఆహ్వానిస్తూ వచ్చింది. భారత, వియత్నాంల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. వియత్నా తమ సహజమైన, విశ్వసనీయమైన మిత్రదేశంగా భారత్ భావిస్తుంది. వియత్నాంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న మూడు దేశాలలో భారత్ ఒకటి. అంతేకాదు ఇరుదేశాల మధ్య అత్యున్నత రాజకీయ విశ్వసనీయత కూడా పరస్పరం పాదుకుని ఉంది. ఆగ్నేయాసియా దేశాలలో భారత్ ఎంతో బాధ్యతాయుతమైన శక్తిగా గుర్తింపుపొందింది. అంతేకాదు ఆసియన్ సారథ్యంలో సాగుతున్న ఈస్ట్ ఆసియా సమ్మిట్, ఆసియన్ రీజనల్ ఫోరమ్ వంటి వాటిల్లో భారత్ ఎంతో కీలకమైన భాగస్వామి కూడా. అంతర్జాతీయంగా భారత పేరుప్రఖ్యాతలు, దాంతోపాటు ఆ దేశానికి వియత్నాం, చైనా రెండింటితో ఉన్న పటిష్టమైన సంబంధాల వల్ల సహజంగానే వియత్నాం తనకు సంబంధించిన ముఖ్యమైన సముద్రసంబంధిత ప్రధాన సమాచార లైన్‌ను పరిరక్షించుకునేందుకు భారత్ వైపు తన చూపు సారిస్తోంది.
గతంలో చైనాతో బహుపక్ష చర్చలు డిమాండ్ జరపాలంటూ చేస్తూ వచ్చిన ఫిలిప్పైన్, వియత్నాం సైతం ఆ ప్రతిపాదనను వదిలేశాయి. ఇవి ద్వైపాక్షిక చర్చల పట్ల స్నేహపూర్వకంగా సంసిద్ధతను తెలిపాయి. నేటి పరిస్థితుల్లో ద్వైపాక్షిక చర్చలే చైనా పరంగా అనుసరించాల్సిన విధానంగా గుర్తించడమే కాదు అందుకు అవి ముందుకొచ్చాయి కూడా.
భారత్, వియత్నాలు వ్యూహాత్మక భాగస్వామ్యదేశాలు. అదే సమయంలో చైనాతో సంబంధాల పరంగా భారత్ అనుకూల ధోరణులతో ముందుకు వేగవంతంగా సాగుతోంది. ఆసియన్ ప్రాధాన్యాన్ని భారత్ ఎప్పుడూ చెప్పుకొస్తూనే ఉంది. అంతేకాదు సౌత్ సీ చైనా పరంగా ‘కోడ్ ఆఫ్ కాండక్ట్’ పై వీలైనంత తొందరగా సంతకాలు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెస్తోంది. దీని పరంగా అన్ని దేశాలు సహకారాన్ని అందించాలని కోరుతోంది. సివొసి చట్టబద్ధమైన ముసాయిదా కాదు. కాకపోతే తమ తమ వాదనలతో వ్యవహరిస్తున్న చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న అన్ని దేశాల ప్రయోజనాల దృష్టిలో చూస్తే యుఎన్సిఎల్వొసి నిబంధనలకు అనుగుణంగా అవి ఉండాలి.
రచన: సనా హష్మీ, తూర్పు ఆసియా, యురేసియన్ వ్యవహారాల విశ్లేషకులు

Comments
Post a Comment