ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా బారత్ ముందుకుసాగడంలో మౌలికసదుపాయాల పాత్ర
భారతదేశ ఆర్థికరంగం ఐదుసంవత్సరాలలో ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా వృద్ధిచేయడానికి ముందుకుసాగుతోంది. తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో పది ట్రిలియన్ డాలర్ల వరకూ పెంచాలనేది లక్ష్యం. ఈ బృహత్తర లక్ష్యంలో మౌలికసదుపాయాల పాత్ర ఎంతో కీలకమైంది. భారత్ సంవత్సరానికి మౌలికసదుపాయాలపై ఒక ట్రిలియన్ డాలర్ల పైగా ఖర్చుపెడుతోంది. ఇటీవల పార్లమెంటు ముగింపు సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక సహాయమత్రి అనురాగ్ సింగ్ థాకూర్ ఈ విషయాన్ని లోక్ సభలో వెల్లడించారు. 2018-19 సంవత్సరంలో మౌలికసదుపాయాల మీద ప్రభుత్వం పెట్టిన ఖర్చు5.97 ట్రిలియన్ రూపాయలు ఉన్నాయని అనురాగ్ సింగ్ థాకూర్ తెలిపారు.
దేశీయ ఆర్థికరంగం 2025 సంవత్సరం నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా మౌలికసదుపాయాల పెంపుదలకు ఆశావహ చర్చలను చేపడుతోంది. వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం ఇందులోని ప్రధాన విషయం. ఇప్పుడు ఆర్థిక రంగం 2.8 ట్రిలియన్ డాలర్లు ఉంది. రానున్న ఐదు సంవత్సరాల కాలలో దీన్ని వార్షికంగా ‘ఎనిమిది శాతం పైగా పెంపొందించాలని లక్ష్యం ఉంది. ఇది నమ్మదగ్గ లక్ష్యమే. భారత ఆర్థిక రంగం క్షీణదశలో ఉన్నప్పుడు కూడా ఇటీవల అది 6 నుంచి 7 శాతానికి పెరిగిన దాఖలాలు ఉన్నాయన్నది నిపుణుల వాదన. బడ్జెట్‌కు ముందు వచ్చిన ఆర్థిక సర్వే గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావిస్తూ వివిధ పెట్టుబడులను పెంపొందించడానికి వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరనాన్ని పేర్కొంది. అలాగే ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి, ఎగుమతులు, వినియోగం, పెరుగుదల ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కమిటీ తాజా ద్రవ్య విధానం కనుగుణంగా సంప్రదాయరహిత రుణగ్రహీతలకు ముఖ్యమైన రంగాలలో 35 పాయింట్ల లెండింగ్ రేటు దగ్గర ఆగింది. ప్రధాన బ్యాంకు కార్యాలయం నాలుగు సంవత్సరాలు వరుసగా ప్రకటించిన విధాన ప్రకటనలకు అనుగుణంగా గత ఏడాది ఫిబ్రవరి నుంచి మొత్తం 110 పాయింట్లకు వచ్చి ఆగింది. అలా ఉత్పత్తుల విభాగంలో క్రెడిట్ ప్రవాహానికి పెద్ద లిఫ్టింగ్ ఇస్తున్నట్టు సూచించింది. ఆర్థిక కార్యకలాపాలు సాధారణమైనవి, ప్రత్యేక మౌలికసదుపాయాల పరంగా వేగవంతమవుతాయి.
మౌలికసదుపాయాల పెట్టుబడులు, ఆర్థిక ప్రగతికి సంబంధం చాలా ఉంది. దేశం జిడిపిలో పెట్టుబడులు పెట్టడానికి, రహదారులు, రైళ్లు, విమానాశ్రయాల మౌలికసదుపాయాలు 0.90 కన్నా ఎక్కువ ఉంది. జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడెక్ట్)కి, పెట్టుబడులకు మౌలికసదుపాయాల రంగంలో ఎంతో సంబంధం ఉంది. అందే నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఎ) ప్రభుత్వం ప్రధానంగా మౌలికసదుపాయాల హక్కులపరంగా పెట్టుబడులు పెట్టడంపై 2014 నుంచి దృష్టిపెట్టింది. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం కూడా ‘గోల్డన్ క్వాడ్రిలేటరల్’ కింద జాతీయ రహదారులను నిర్మించడానికి పూనుకుంది.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్థికరంగంలో సామాజిక, ఆర్థిక బదలాయింపు అనేది ప్రజలకు ఇంక్లూజివ్, సుస్థిర మౌలికసదుపాయాలను అందించడంపై ఉంటుంది. పబ్లిక్ పెట్టుబడులు, ప్రైవేటు రంగాలను కలుపుకుపోవడం ద్వారా భౌతిక మౌలికసదుపాయా లపై ప్రణాళికలు ఇలా చేపట్టడం ఆశ్చర్యం అనిపించదు. దేశంలో సుదీర్ఘకాలం పట్టే ఇన్ఫాప్రాజెక్టులు, రైలు, రహదారులు, విమానాశ్రయాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి
ఇన్ఫ్రా సెక్టర్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకుంది. వాటిల్లో వినూత్నమైన ఆర్థికపరమైన పద్ధతులు అంటే ఇన్ఫ్రాస్టక్చరర్ డెబ్ట్ ఫండ్స్, ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స్ (ఐఎన్విఐటిఎస్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్స (ఆర్ఇఐటిఎస్)లతో పాటు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అన్ని మౌలికసదుపాయాల రంగాలల్లో ప్రధానస్రవంతిలో చేర్చడం (నిధులపరంగా తగినంత ఎడం ఉండేలా), అలాగే నిర్దిష్టకాలపరిమితితో హర్మొనైజ్డ్ మాస్టర్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్-సెక్టర్లను సమీక్షించడం వంటి వాటిని కూడా ప్రారంభించారు.
మౌలికసదుపాయాల్లో పెట్టుబుడులు పెంచే లక్ష్యంతో నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)ని 400 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటుచేశారు. వాణిజ్యపరంగా లాభకరమైన ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉండేలా పెట్టుబడుల అవకాశాలను సమకూర్చేందుకు దేశంలో దీన్ని ఏర్పాటు చేశారు.ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన నిధులు, అలాగే కెనడా ఒంటారియో ప్రావిన్స్ లు ఒక బిలియన్ డాలర్ల వరకూ ఎన్ఐఐఎఫ్ మాస్టర్ ఫండ్‌లో పెట్టేందుకు ఒప్పందాలు చేశాయి. ఎన్ఐఐఎఫ్లో తాజాగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలు సుదీర్ఘకాలం పెట్టుబడులకు దారితీస్తాయి. అంతేకాదు మౌలికసదుపాయాల ఫైనాన్సింగ్‌ను సైతం మెరుగుపరుస్తుంది. ఎన్ఐఐఎఫ్ని 2015లో నెలకొల్పారు. మౌలికసదుపాయాల అభివృద్ధి పరంగా మరింత ముందుకు వెళ్లేలా ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ఆశావహ చర్యలతో ముందుకు దూసుకువెడుతోంది. ఈ రంగంలో 100 లక్షల కోట్ల పెట్టుబడులను రానున్న ఐదు సంవత్సరాల కాలపరిమితిలో పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెడుతోంది.

రచన: జి. శ్రీనివాసన్, సీనియర్ ఎకనామిక్ జర్నలిస్ట్
Comments
Post a Comment