యుఎస్-తాలిబాన్ చర్చలు, భారత్ ప్రాధాన్యతలు
దోహోలో ఎనిమిదవ రౌండ్ యుఎస్-తాలిబాన్ చర్చలు ఆశావహంగా ముగిశాయి. ఆ శాంతి ఒప్పందం నిర్దేశిత సమయానికి అమెరికా, నాటో సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి విరమించుకునే ఆశలను రేపుతున్నాయి. దీనికి ప్రతిగా, ఆఫ్ఘనిస్తాన్లోని అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులు ఆల్‌ఖైదా, ఐఎస్ఐఎస్లకు తాలిబాన్ నీడనివ్వదు. ఈ సమావేశం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో కూడా చర్చలు నిర్వహిస్తుంది. అధికార భాగస్వామ్యం ఫార్ములాపై ఇది దృష్టిపెట్టనుంది. దాని ఫలితంగా యుద్ధంతో ఛిద్రమైన ఆ దేశంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయి.
అమెరికాతో చర్చలు జరిపేందుకు దోహా కార్యాలయాన్ని తాలిబాన్ 2013లో ప్రారంభించింది. ప్రాథమికంగా కొన్ని సమావేశాలు జరిగాయి కానీ ఎలాంటి ఫలితాలనూ అవి ఇవ్వలేదు. ఎందుకంటే అందులోని ఏ పార్టీ కూడా సర్దుబాటు వైఖరికి సిద్ధంగా లేవు. అమెరికా, ‘నాటో’ దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌లో తమ కంబాట్ మిషన్ ముగిసిన తర్వాత కంబాట్ బాధ్యతను ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన సైన్యానికి అప్పగించింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సంభాషణలకు మంచి అవకాశం ఏర్పడింది.
యాభై శాతం పైగా ప్రాంతం తాలిబాన్ నియంత్రణలో ఉంది. ఆఫ్ఘన్ సైన్యానికి తాలిబాన్ సైన్యంతో ఏవిధంగానూ పోలిక లేదు. తాలిబాన్‌తో సర్దుబాటు వైఖరిని అవలంబించని పక్షంలో తనకు అధికారం ఉండదు . శాంతి స్థాపన ప్రసక్తి ఉండదని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించింది. అంతేకాదు అమెరికాతో ముగింపులేని యుద్ధం చేయాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తెప్పిస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబాన్లకు మధ్య చర్చలు జరిగేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు జల్మే ఖలీల్జాద్ను అమెరికా ప్రత్యేక రాయబారిగా నియమించింది.
ఆఫ్ఘనిస్తాన్ శాంతి ప్రక్రియకు ఎన్నో దశలు ఉన్నాయి. అమెరికా-తాలిబాన్ల మధ్య చర్చలతోపాటు ఈ ప్రాంతంలో ముఖ్యమైన లాభాలు ఉన్న పలు దేశాలు తాలిబాన్‌తో కలిసి పనిచేస్తున్నాయి. చైనా తాలిబాన్‌తో పలు పర్యాయాలు చర్చలు జరిపింది. అమెరికా తాలిబాన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం కావడానికి ముందే చైనాతో జరిగిన సమావేశంలో పాకిస్తాన్ కూడా పాల్గొంది. దీనికి ఒక కన్సల్టేటివ్ మెకానిజం ఉంది. దీన్ని ‘మాస్కో ఫార్మాట్’ అని కూడా అంటారు. ఇందులో తాలిబాన్ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాలే కాకుండా, త్రైపాక్షిక సంభాషణల అంశం కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికాల మధ్య ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల త్రైపాక్సిక సంభాషణలు కూడా ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా త్రైపాక్షిక సంభాషణల నిర్వహణకు పాకిస్తాన్‌ని తొలిసారి ఆహ్వానించారు. ఇది ఈ ఏడాది జూలైలో జరిగింది. అలాగే రష్యా, చైనా, ఇండియా త్రైపాక్షిక చర్చలు కూడా ఆప్ఘనిస్తాన్‌పై జరిగాయి. ప్రాదేశికంగా చేపట్టిన కార్యక్రమాలు ఇవి. ఇవి కాకుండా దోహా సమావేశం ఒకటి. అలాగే ఇస్తాంబుల్ కార్యక్రమం. దీన్నే ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ అంటారు. ఈ సమావేశలన్నీ ఈ దేశాలన్నింటికీ భవిష్యత్ ఆఫ్ఘనిస్తాన్‌లో వాటా ఉందని ముద్రవేసి చెబుతున్నట్టు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ ప్రక్రియలో నిర్లక్ష్యానికి గురి చేసే ఉద్దేశం ఇక్కడి ఏ దేశానికీ లేదు. దీంతో విదేశీ సైన్యాలు నిష్క్రమించడమే కాకుండా తాలిబాన్ల పునరావాసం సైతం సాధ్యమవుతుంది.
అమెరికా-తాలిబాన్ చర్చలు ఒప్పందం దిశగా కొద్దిగా ముందుకు కదిలాయి. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ గురించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎలాంటి ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది అన్నదానిపై కూడా ఆందోళనలు ఉన్నాయి. జర్మనీ, కతార్, దోహాల సారథ్యంలో ఆఫ్ఘన్ రాజకీయ నాయకులకు, పౌరసమాజ సభ్యులకు, వారితోపాటు వ్యక్తిగత స్థాయిలో సమావేశంలో పాల్గొన్న మహిళలతో నిర్వహించిన ఆఫ్ఘనిస్తాన్ అంతర్ సంభాషణల్లో తాలిబాన్ కూడా పాల్గొంది. దూకుడు పాలనకు వెళ్లమని తాలిబాన్ భరోసా ఇచ్చింది. అంతేకాదు తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించనని చెప్పింది. పౌరనష్టం అస్సలు లేకుండా చూస్తామని నొక్కి చెప్పింది. అయితే తాలిబాన్ ప్రధాన సంధానకర్త షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జై మాట్లాడుతూ ‘యుద్ధం కొనసాగుతుంది’ అని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం అందిస్తున్న దేశాలలో భారత్ ఐదవ పెద్ద దేశం. ఆఫ్ఘనిస్తాన్‌లో డెవలెప్మెంట్ ప్రాజెక్టుల కింద మూడు బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను భారత్ ఆ దేశంలో పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఖలిల్జాద్ ద్వారా భారత్‌తో అమెరికా మంతనాలు కొనసాగిస్తున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు దిగజారుతాయన్నదానిపై భారత్ ఆలోచిస్తోంది. దీనివల్ల 1991లో తలెత్తిన అంతర్యుద్ధంలాంటిది అక్కడ తలెత్తే అవకాశం ఉండొచ్చని భావిస్తోంది. రష్యా అక్కడి నుంచి విరమించుకున్న అనంతరం అక్కడ అలాంటి పరిస్థితులు తలెత్తాయి. మొదటి నుంచీ భారత్ ఆఫ్ఘన్ సర్వతంత్రస్వతంత్రంగా, ఆ దేశ సారథ్యంలోనే శాంతి ప్రక్రియ జరగాలని భారత్ నొక్కిచెపుతూ వస్తోంది. శాంతి ప్రక్రియ ద్వారా ఆ దేశంలోని రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాలని గాఢంగా అభిప్రాయపడుతోంది.
షరతులతో అమెరికా సైన్యం అక్కడి నుంచి నిష్క్రమించడం అనేది సంక్లిష్టమైన రెండవ దశ శాంతి ప్రక్రియ కొనసాగేలా చేస్తుంది. ఇందులో ఇంట్రా-ఆఫ్ఘన్ సంభాషణలు ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపన అనేది కచ్చితత్వం లేకుండా ఉండి తాలిబాన్ సంభాషణల ప్రహసనం ఆఫ్ఘన్ ప్రభుత్వంతో సాగేలా ఒక అనిశ్చిత పరిస్థితి కనబడుతోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లోని రూపురేఖలను, పరిధిని నిర్ణయిస్తుంది. దీంతో బయటి శక్తులు ఆ ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలకు ఒడిగట్టడానికి వీలుగా వ్యూహాత్మకమైన మార్గం పట్టే అవకాశానికి వీలు బాగా ఉంటుంది.
రచన: డా. స్మృతి ఎస్ పట్నాయక్, దక్షిణ ఆసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment