సైనిక దళాల ఆధునీకరణ
గత దశాబ్దకాలంగా విదేశీ శక్తుల తోడ్పాటుతో భారత పొరుగుదేశం సరిహద్దుల్లో చోటుచేసుకుంటూ వస్తున్న కార్యకలాపాలను గమనిస్తే భారత సైనిక దళాల సామర్థ్యాలను మరింత పెంచాల్సిన అవసరాన్ని అది విస్పష్టం చేస్తోంది. ఈ పని అంత సులవైనదేమీ కాదు. ఎందుకంటే భారత్ తన ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన సమగ్ర అభివృద్ధి అనేది పూర్తిస్థాయి భద్రతా పరిస్థితుల్లో తప్ప సాధ్యం కాదు. ఈ కోణంలోంచి చూస్తే, ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి 4.31 ట్రిలియన్ నిధులను కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది భారత జాతీయ ఉత్పత్తిలో కేవలం 2.04 శాతమే. కనీస కస్టమ్స్ డ్యూటీ నుంచి రక్షణ సామగ్రి మినహాయించడం రక్షణరంగ ఆధునీకరణ ప్రభుత్వ ప్రధాన అంశంగా స్పష్టమవుతోంది.
భారత సైనిక దళాల ఆధునీకరణ ‘లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ పర్స్పెక్టివ్ ప్లాన్’ (ఎల్టిఐపిపి) చేపట్టడంలో కనిపిస్తుంది. దీని కాలపరిమితి 2027 వరకూ ఉంది. భారతదేశంలో రూపొందించిన ప్రాజెక్టులనే ఉపయోగించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల దేశీయ సామర్థ్యం పెరుగుతుంది. ప్రభుత్వం కూడా ప్రొయాక్టివ్ ధోరణితో ముందుకు వెడుతోంది. నిర్దేశిత సమయంకు అనుగుణంగా పని పూర్తిచేయడానికి కృషి కొనసాగిస్తోంది. రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రముఖ ప్రైవేటు సంస్థలు కూడా పాలుపంచు కుంటున్నాయి. ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్య మోడెల్‌ని చేపట్టింది. ఇందులో భారత్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలు కూడా పాలుపంచుకుంటున్నాయి. తద్వారా జాయింట్ వెంచర్లను విదేశీ భారీ రక్షణ కంపెనీలతో పంచుకుంటున్నాయి. వీటితో కలిసి ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు, జలాంతర్గాములు, ప్రధాన యుద్ధ ట్యాంకులు నిర్మిస్తారు. సైనికదళాల పోరాట సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం దీర్ఘకాలంతో కూడిన పలు సంస్కరణలను కూడా చేపట్టింది. ఈ దశాబ్దంలోని కీలక చర్యలుగా వీటిని చూడాలి. అంతేకాదు ప్రపంచంలో రెండవ అతిపెద్ద సైన్యాన్ని తగ్గించడం, సైన్యం సంఖ్య మరింత తగ్గించడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా అత్యాధునిక ఆయుధాలు, సామగ్రితో భారత సైన్యాన్ని సంసిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యమైన కార్యక్రమం ఎఫ్-ఐఎన్ఎస్ఎఎస్ (ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ సిస్టమ్). ఇది సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తుంది. కంబాట్ గియర్ని ఇస్తుంది. దీన్ని 2020 సంవత్సరానికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సైన్యం ఎం777 హోవిట్జర్స్, కె9 విజ్రాలు సమీకరించుకుంది. ఇటీవల రష్యాతో 13,500 కోట్ల రూపాయల విలువైన 464 టి-90 ట్యాంకులను ఒప్పందం చేసుకుంది. ఇది సైన్యంలోని టి-90 సంఖ్యను రెండు వేల వరకూ పెంచుతుంది. ఇవి కాకుండా టి-72, టి-55 లు కూడా ఉన్నాయి.
భారత వైమానిక దళానికి సంబంధించి చూస్తే, రఫేల్ ఫైటర్ జెట్స్ ‘గేమ్ ఛేంజర్’ గా నిరూపించుకోనుంది. వీటి వల్ల ఏ శత్రు దేశం గగనతలం ఆపరేషన్లలో కలుగజేసుకోలేవు. ఇవి న్యూక్లియర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడంతోపాటు గగనతలంలోనూ, గగనతలం నుంచి భూమిపైకి దాడులు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ముందుగా అనుకున్నట్టు సెప్టెంబరులో తొలి రఫేల్ ఫైటర్ జెట్ భారత వైమానిక దళానికి అందనుంది. మిగతా 36 రఫేల్ జెట్లు రానున్న రెండు సంవత్సరాల కాలంలో భారతదేశానికి అందుతాయి. సుఖోయ్-ఎం30, తేజాల కొత్త వర్షన్లు త్వరలోనే వస్తాయి. ఇంకా వైమానికదళానికి సంబంధించి ప్రధాన ఆపరేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్ మిగ్-21 బైసన్ సామర్థ్యాలను పెంపొందుతుంది. ఇది పాత మిగ్-21 సామర్థ్యం కన్నా ఎక్కువ ఉంటుంది.
ఐఎఎఫ్ ఇప్పుడు బాగా ఆధునీకరించడం జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై చేసిన రెండు సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో దీని సామర్థ్యం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతోపాటు లేజర్ డిసిగ్నేటర్ పాడ్ (ఎల్‌డిపి) కూడా ఉంది. ఇది లేజర్ సెన్సర్-కమ్-టార్గెటింగ్ సిస్టమ్. అన్ని ఎయిర్‌క్రాఫ్ట్ సమూహాల్లోనూ ఇది ఉంటుంది. దీనివల్ల గగనతలం నుంచి చేసే దాడుల సామర్థ్యం బాగా మెరుగుపడింది. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ సామర్థ్యం కేవలం మిరాజ్ 2000లో మాత్రమే ఉంది. ఇప్పుడు జాగర్, ఆధునీకరించిన మిగ్-27, సుఖోయ్-30లలో కూడా ఈ సౌకర్యం ఉంది. యుఎవితో పాటు, రీఫ్యూలర్స్, ఇవిఎసిఎస్ (ఏరోనాటికల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్) కూడా సైన్యంలో ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా భారత వైమానికదళం ఎంత ముందుకు ఆధునీకరించబడుతోందన్నది స్పష్టం చేస్తోంది.
సముద్రయానానికి సంబంధించి చూస్తే, ఇందులో సవాళ్లను ఎదుర్కోవడానికి ఆపరేషనల్‌గా, అలాగే సముద్రమార్గాల భద్రత సామర్థ్యం పరంగా మౌలిక సదుపాయాలు బాగా మెరుగుపడాల్సిన ఉంది. ప్రస్తుతం చూస్తే 77 శాతం విలువైన 90 శాతం భారత వ్యాపారం సముద్రసంబంధితమైంది. దీంతోపాటు పొరుగున ఉన్న శత్రుదేశాల నౌకా ఆధునీకరణ వేగంగా వృద్ధిచెందుతోంది. ఇది భారత్‌కు తీవ్ర ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం ఆరు జలాంతర్గాములను, అలాగే 56 కొత్త నౌకలతోపాటు 32 వెజల్స్ నిర్మించడానికి అంగీకరించడమే కాదు వాటి తయారీ జరుగుతోంది.
భారత స్థాయి పెరుగుతోంది. దీంతో ఆర్థికంగా, సాంకేతికంగా ప్రపంచస్థాయిలో ముఖ్య స్థానంలో భారత్ ఉంది. ప్రస్తుతం ఇది తన సైనిక శక్తిని అత్యాధునిక పరికరాలతో అభివృద్ధి పరుచుకోవాల్సి ఉంది. వీటి సహాయంతో శక్తివంతమైన శత్రుదేశాల నుంచి ఎదురయ్యే హెచ్చరికలు, సవాళ్లను సమర్థవంతంగా అడ్డగించే వీలుంటుంది.
రచన: ఉత్తమ్ కుమార్ బిస్వాస్, రక్షణ విశ్లేషకులు
Comments
Post a Comment