భారత్‌లో అధిక సంఖ్యలో పెరుగుతున్న పులుల సంఖ్య

భారతదేశంలోని పులుల సంఖ్య పెరుగుతోంది. వాటి గాండ్రింపులు ఆనందకరమైన రీతిలో పెరిగాయి. వీటి సంఖ్య భారతదేశంలో మూడు వేల సంఖ్యకు చేరుకుంది. ప్రపంచంలో పులుల సురక్షిత స్థావరంగా భారత్ రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోని 75 శాతం పులులకు భారత్ ఇప్పుడు ఇల్లుగా మారింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో (2014లో ఇవి 2,226 ఉంటే, 2018 నాటికి 2967కి చేరుకున్నాయి) వీటి సంఖ్య 33 శాతం పెరిగింది.

ఇది ఇప్పటివరకూ చూడని పెద్ద రికార్డు. ఎందుకంటే 2006, 2010 సంవత్సరాలలో ఇవి 21 శాతం మధ్యలో ఉంటే , 2010 నాటికి ఇవి 30 శాతానికి పెరిగాయి. ఈ గణాంకాలు 2006 నుంచి పులుల పెరుగుదల కనిష్ట పెరుగుదల రేటు ప్రకారం చెపుతున్నవి. ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్, 2018’ ఇటీవలి పులుల సంఖ్యను తెలిపే తెలుపుతుంది.

మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 526 పెద్దపులులు ఉన్నాయి. దీని తర్వాతి స్థానంలో 524 పులుల సంఖ్యతో కర్నాటక నిలిచింది. ఆ తర్వాత 442 పులుల సంఖ్యతో ఉత్తరాఖండ్ ఉంది. పులుల గణాంకాల నివేదికను వైల్డ్‌ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ ఆధారిటీ ( ఎన్‌టిసిఎ), రాష్ట్ర అటవీశాఖా విభాగాలు కలిసి సంయుక్తంగా రూపొందించాయి. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి భారత్ దేశంలోని పులుల గణాంకాలను సేకరిస్తుంది. ఇప్పుడు పేర్కొంటున్నది నాల్గవ విడత నిర్వహించిన గణాంకాల నివేదిక. గతంలో 2006, 2010, 2014 సంవత్సరాలలో పులుల గణాంకాల వివరాల సేకరణను భారత్ నిర్వహించింది.

దేశంలోని పులుల గణాంకాలను తెలుసుకునేటందుకు భారత్ డబుల్ శాంప్లింగ్ విధానాన్ని అనుసరించింది. దీని ప్రకారం ‘మార్క్-కాప్చర్’ ఫ్రేమ్‌వర్కు ఇందులో సమ్మిళితమై ఉంది. దీని ద్వారా పులుల సంఖ్యను నిర్థారిస్తారు. భారతదేశంలోని 382,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంమేర వ్యాపించి ఉన్న అటవీ నివాసప్రాంతాలలో ఈ సర్వే నిర్వహించారు. వీటిల్లో 130,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తరణ ప్రాంతం కెమెరాల(కెమెరా ట్రాప్స్) తో పరిశీలించారు.

పులుల గణాంకాలను రెండు భాగాలుగా చేపట్టారు. మొదటి శాంపిల్‌లో ఫీల్డ్ నుంచి రాబట్టిన గణాంకాల వివరాలు ఉంటాయి. 40 వేల మంది ఫీల్డ్ స్టాఫ్ పెద్దమొత్తంలో డేటాను తవ్వితీసినట్టు చేశారు. ఈ డేటాను పులులు ఎక్కువ పుట్టే 18 రాష్ట్రాల నుంచి వీళ్లు సేకరించారు. ఆ ప్రాంతాలలో పులుల ఉనికిని వీళ్లు డాక్యుమెంట్ చేశారు. అందులో వాటి నివాసాలు చూపారు. కో-ప్రిడేటర్, ఆహారం వేసి పులులను ఆకర్షించడం, మానవ ప్రభావం, ఇతరత్రా అంశాలన్నింటినీ అందులో రికార్డు చేశారు.

రెండవ భాగంలో, శిక్షణ పొందిన వన్యమృగ జీవశాస్త్రవేత్తలు కెమెరా ట్రాప్స్ ను చదనుగా ఉండే ప్రాంతాలంతటా అమర్చి పులుల సంఖ్యను కనుగొన్నారు. పులులకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని వాళ్లు సేకరించారు. తాము సేకరించిన గణాంకాలను పోల్చిచూడడంతోపాటు, డెహ్రాడూన్‌లోని ‘వైల్డ్‌ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో వీటి సంఖ్యాపరమైన లెక్కలు కూడా చేశారు. 

మనదేశంలో 2018లో చేపట్టిన గణాంకాలను అధునాతన సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా వన్యమృగప్రాణుల అంచనాను చేపట్టారు. ఈ సంఖ్య ఎలాంటి అవకతవకలకు, తప్పొప్పులకు తావులేని రీతిలో పక్కాగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కచ్చితమైన గణాంక అంచనాలను మనముందు పెట్టింది. ఈ అంచనాను యాండ్రాయిడ్ ఫోన్ ఆధారిత అప్లికేషన్‌తో చేశారు. దీంట్లో డెస్క్‌ టాప్ వర్షన్ ఎం-ఎస్‌టిఆర్ఎల్‌పిఎస్ (మోనిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటన్సెవ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టాటస్)ను గణాంకాల సేకరణకు, ఆర్కేవ్స్ కు, డేటాను అంచనా వేయడానికి ఉపయోగించారు. గణాంకాల సేకరణకు, అంచనాకు ఈ సాఫ్ట్ వేర్‌ను ఉపయోగిస్తారు.

సర్వేల ట్రాక్ లాగ్‌ను, లైన్ ట్రాన్‌సెక్ట్స్‌ ను ఈ ఫోన్ అప్లికేషన్ దానంతట అదే రికార్డు చేస్తుంది. రికార్డు చేసిన డేటాను జంతువుల సైటింగ్స్‌ ను జియో-టాగ్డ్ ఫోటోగ్రాఫ్స్, సైన్స్‌ తో రికార్డు చేస్తుంది. ఈసారి దగ్గరదగ్గరగా 15 వేల కెమెరాలను ఉపయోగించారు. 2006లో తొలి గణాంకాల విషయంలో తొమ్మిది వేల కెమెరాలను వాడారు.

అధిక సంఖ్యలో వాడిన కెమెరా ట్రాప్స్ వల్ల, ఆండ్రాయిడ్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్‌ వేర్ వినియోగం వల్ల పక్కా లెక్కలు లభించాయని వన్యమృగ ప్రాణుల జీవశాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 83 శాతం పులులు కెమెరా ట్రాప్స్‌ లో దొరికనవే. ఇది గణాంకాలకు పక్కా క్రెడిబిలీటీని ఇస్తోంది. మిగతా 17 శాతం పులుల జనాభాను ‘కాప్చర్-రీకాప్చర్’ స్టాటస్టికల్ మోడల్స్‌ ను ఉపయోగించి లెక్కించారు.

వన్యమృగప్రాణులకు చెందిన శాస్త్రవేత్తలు మెథడాలజీలో కొన్ని మార్పులు చేశారు. టైగర్ల కెమెరా ట్రాప్ ఇమేజెస్ మీద ఎక్కువ ఆధారపడ్డారు. పులుల లెక్కల్లో తప్పే లేకుండా టెక్నాలజీ ఎంతగానో సహాయపడింది. అలాగే కెమెరా ట్రాప్స్ నుంచి తీసిన ఫోటో గ్రాఫులు పులుల శరీరాల మీద ఉండే రకరకాల గీతల పద్ధతులను చూపుతూ వాటిని వేటికి వాటిగా విడిగా గుర్తించడంలో తోడ్పడ్డాయి. పులుల శరీరాలపై వైవిధ్యమైన గీతలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మనుషుల వేలిముద్రల్లో మనుషుల మధ్య ఎలా తేడాలు ఉంటాయో అలాగనమాట.

పులుల గణాంక సేకరణ పరంగా చూస్తే భారత్‌ది ప్రపంచంలోనే అత్యంత పెద్ద వన్యమృగప్రాణుల సర్వే. సర్వే సమగ్రతలో, శాంప్లింగ్‌లో, కెమెరా ట్రాపింగ్ పరంగా కూడా ఇది చాలా విస్తృతమైంది.

సెయిట్ పీటర్స్‌ బర్గ్ ప్రకటన కనుగుణంగా నాలుగు సంవత్సరాలకు ముందే అంటే 2022 సంవత్సరానికి ముందే తన టార్గెట్‌ను భారత్ సాధించింది. ‘గ్లోబల్ టైగర్స్ డే’ సందర్భంగా న్యూఢిల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, పర్యారణాల మధ్య సమతుల్యతను భారత్ సాధించగలుగు తోందన్నారు. అంతేకాదు ‘ భారత ప్రభుత్వం ప్రజల కోసం ఇళ్లను నిర్మిస్తుంది. అలాగే వన్యమృగాలకు కూడా నాణ్యమైన నివాసాలను సృష్టిస్తుంద’న్నారు.

మనదేశంలో పులుల సంఖ్య అధికంగా పెరగడం వల్ల భారత పర్యాటకరంగం కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు బాగా ఉన్నాయి. మన పర్యాటకరంగ అభివృద్ధి భారత ఆర్థికరంగాన్ని కూడా మరింతగా ఉత్తేజితం చేస్తుంది. దీనితోపాటు, ఎకోటూరిజం స్థానిక కమ్యూనిటీలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.

రచన: కె.వి. వెంకట సుబ్రమణియన్, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం