భారత సహకారంతో నిర్మించిన తొలి మోడల్ గ్రామాన్ని ప్రారంభించిన శ్రీలంక
శ్రీలంక ప్రభుత్వం హౌసింగ్, నిర్మాణం, సాంస్కృతిక శాఖ మోడల్ విలేజ్ కార్యక్రమం కింద శ్రీలంకలోని గామ్పహ జిల్లాలో తొలి మోడల్ గ్రామాన్ని భారతదేశం సహాయంతో నిర్మించింది. దీనిని జూలై 6, 2019 నాడు ప్రారంభించారు. పూర్తయిన గృహాలను లబ్దిదారులకు ప్రత్యేకంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పగించారు. శ్రీలంక హౌసింగ్, నిర్మాణం, సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి సజిత్ ప్రేమదాసా, మాజీ అధ్యక్షుడు చంద్రికా బండారనాయికే కుమారుతుంగ, భారత యాక్టింగ్ హైకమిషనర్ డా. షిల్పక్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత ప్రభుత్వం, శ్రీలంక హౌసింగ్, నిర్మాణ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రెండూ కలిసి సంయుక్తంగా వంద మోడల్ విలేజీలను శ్రీలంకలో నిర్మించాలని నిర్ణయించుకున్నాయి. దీని కింద శ్రీలంక మొత్తంలో 2,400 ఇళ్లను కడదామని నిర్ణయించుకున్నారు. దీనికి భారత ప్రభుత్వం ఎస్ఎల్ఆర్ సహాయం కింద 1200 మిలియన్ రూపాయల నిధులను అందిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా, భారత-శ్రీలంక దేశాలు రెండూ కలిసి రెండు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ (ఎంవొయులు)లను 2017, అక్టోబర్ 26న చేసుకున్నాయి. ఆ ఒప్పందాలకు అనుగుణంగా గ్రామ శక్తి హౌసింగ్ ప్రాజక్టు కింద శ్రీలంక దక్షిణ ప్రాంతంలో 600 ఇళ్ల నిర్మాణం చేయాలని పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి. మోడల్ విలేజ్ హౌసింగ్ ప్రాజక్టు కింద శ్రీలంకలోని 25 జిల్లాల్లో మొత్తం 600 ళ్లను నిర్మిద్దామనుకున్నారు. భారత్ అందిస్తున్న 600 మిలియన్ల శ్రీలంక కరెన్సీ సహాయాన్ని ఈ లక్ష్య సాధనకు వాడుతున్నారు.
ఈ ఇళ్లను ఆ ఇంటి యజమాని కోరుకుంటున్న మోడల్ పద్ధతిలో కట్టడం విశేషం. ఇందుకు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఘానం మద్దతును కూడా తీసుకోవడమే కాదు. భారత ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సహాయాన్ని శ్రీలంక పొందుతోంది. ఎస్ఎల్ఆర్ కింద నిధుల మంజూరు తక్కువ ఆదాయ వర్గాలకు ఐదులక్షల రూపాయలు ఇస్తోంది. భూమి, స్వంత ఇల్లు లేని వారికి దీన్ని ఐదు వాయుదాలుగా ఇస్తున్నారు. ఇంటి నిర్మాణం ఎంతవరకూ అయిందన్న దాన్ని బట్టి నిధుల మంజూరు ఉంటుంది. అంతర్గతంగా తూర్పు, ఉత్తర ప్రాంత నివాసరహిత ప్రజలకు 50,000 ఇళ్లు కట్టడంతోపాటు ఈ ప్రాజక్టులను సైతం శ్రీలంకతో కలిసి భారత్ చేపట్టింది. అంతేకాదు ప్లాంటేషన్ రంగంలో ఉన్న లబ్దిదారుల కోసం పదివేల ఇళ్లను కట్టించడానికి సంబంధించి కూడా మనదేశం శ్రీలంకతో ఒప్పందం చేసుకుంది. వీటికి సంబంధించి పరస్పర ఒప్పందాలు (ఎంవొయులు)2010 జూన్, 2017, మేలలో వరుసగా ఇరుదేశాలు కలిసి చేపట్టాయి.
రెండు దేశాల ప్రభుత్వాలు కలిసి 2017, జూలై 14న మరో ఒప్పందాన్ని చేసుకున్నాయి. దానిననుసరించి 153 ఇళ్ల నిర్మాణాలతోపాటు, బహుళప్రయోజనాలు అందించే కమ్యూనిటీ బిల్డింగులను, చిన్న హాల్స్ ను, అలాగే అంతర్గత జలపంపిణీ వ్యవస్థ నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్నాయి. అంతేకాదు మాంక్ క్వార్టర్లతో పాటు అనురాధాపురలోని శోబిథా థెరో గ్రామంలో లైబ్రరీ పునరుద్ధరణలకు సంబంధించి కూడా భారత్, శ్రీలంకలు మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కింద భారత ఎస్ఎల్ఆర్ సహాయం 300 మిలియన్ల రూపాయలను శ్రీలంక అందుకుంటోంది.
శ్రీలంకలోని భారత హైకమిషనర్ తరణ్‌జీత్ సింగ్ సాంధు మాట్లాడుతూ శ్రీలంకలోని ఇళ్ల నిర్మాణ ప్రాజక్టు అతి పెద్ద ప్రాజక్టు. ఇప్పటివరకూ ఏ దేశంలోనూ ఇంత భారీ ప్రాజక్టును భారత్ చేపట్టలేదని అన్నారు.
చేస్తున్న ప్రాజక్టులను కాకుండా శ్రీలంకలో భారత్ 70కి పైగా ప్రజా సంబంధమైన అభివృద్ధి ప్రాజక్టులను చేపట్టింది. వాటిల్లో హౌసింగ్ ప్రాజక్టుతో పాటు ఆరోగ్యం, విద్య, నైపుణ్య పెంపుదల, మౌలికవనరులు, వృత్తిపరమైన శిక్షణ వంటి ఎన్నో ప్రాజక్టుల్లో భారత్ పాలుపంచుకుంటోంది. శ్రీలంకలో మొత్తం భారత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను గమనిస్తే వాటి మొత్తం మూడు బిలియన్ల అమెరిన్ డాలర్లు ఉంటుంది. వాటిల్లో 560 మిలియన్ల అమెరికన్ డాలర్లను గ్రాంట్ల రూపంలో భారత్ ఇచ్చింది.
ఎప్పటి నుంచో శ్రీలంకలో ప్రాజక్టులకు భారత్ చేస్తున్న సహాయాన్ని మరో దృక్కోణంలో చూడడం జరుగుతోంది. ఈ ప్రాజక్టులన్నీ కూడా తూర్పు, ఉత్తర ప్రాంతాలలో ఉన్న తమిళుల సౌఖ్యం, అభివృద్ధి కోసమేననే అభిప్రాయం ఉంది. కానీ, యుద్ధం ముగిసిన తర్వాత కూడా భారత ప్రభుత్వం శ్రీలంకకు సహాయం చేయడంలో నిబద్ధతతో కట్టుబడి వ్యవహరిస్తూ వచ్చింది. యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతాలలో సహాయకార్యక్రమాలతో పాటు పునరావాస కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలలో కూడా భారత్ నిలబడింది. ఫలితంగా భారత అభివృద్ధి ప్రాజక్టులు శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి. కానీ భారత సహాయం కేవలం ఈ రెండు ప్రాంతాలకే పరిమితం కాలేదు. శ్రీలంక ప్రభుత్వ అభ్యర్థన, అవసరాలకు అనుగుణంగా భారత్ తన అభివృద్ధి కార్యకలాపాలను, సహాయాన్ని శ్రీలంకలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది.
దీని కింద దీవిలో 1990 ఫ్రీ ఎమర్జన్సీ అంబులెన్స్ సర్వీసులకు భారత్ సహాయాన్ని అందించింది. ఇది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం. ఈ సర్వీసులు తొలుత దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో అమలుచేశారు. అక్కడ పూర్తి స్థాయిలో ఈ సేవలు విజయవంతం పొందడంతో శ్రీలంక ప్రభుత్వం ఈ సర్వీసులను శ్రీలంకలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించవలసిందిగా భారత్‌ను కోరింది. శ్రీలంక అభ్యర్థనను భారత ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అంతేకాదు 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను శ్రీలంకలో రైల్వేల అభివృద్ధికి అందించేందుకు భారత్ ఒప్పుకుంది.
భారత్ సమయానికి సేవలు అందించేలా పటిష్టం కావాలని భావించాయి. అందుకే దీనిపై చర్చలు చేశాయి. అలాగే భారత సహాయంతో రెండు దేశాల పరస్పర ఒప్పందం ద్వారా శ్రీలంకతో స్మాల్ డెవలెప్మెంట్ ప్రాజక్టులను అమలు చేయాలని అనుకున్నాయి. ఈ ఫ్రేమ్వర్కు ద్వారా మొత్తం అమలు విధానం మరింత సంక్షిప్తరూపం సంతరించుకుంటుంది. జివొఐ సహాయం కింద చేపట్టిన ఎన్నో ప్రాజక్టులు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం వరుసలో కొనసాగుతున్నాయి. కొన్నింటి పనులు షెడ్యూల్స్ కన్నా వేగంగా సాగిపోతున్నాయి.
రచన: డా. గుల్బిన్ సుల్తానా, అధ్యయన విశ్లేషకులు, ఐడిఎస్ఎ

Comments
Post a Comment