మౌలికసదుపాయాలను మరింత ముందుకు తీసుకెళ్లే బడ్జెట్
రానున్న ఐదు సంవత్సరాలలో ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ చేపట్టారు. అందుకు తగినట్టు మౌలికసదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ పెద్ద పీట వేసింది. రానున్న ఐదు సంవత్సరాలలో నూరు లక్షల కోట్ల పెట్టుబడులను తయారీ రంగంలో పెట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బడ్జెట్ పునరుద్ఘాటించింది. తద్వారా లక్ష్యంగా పెట్టుకున్న ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధికి స్కిప్టును కేంద్రం సిద్ధం చేసింది. ‘వన్ నేషన్, వన్ గ్రిడ్’తో రోడ్లు, సహజవాయువు, నీరు, విమానాశ్రయాల గ్రిడ్స్‌కు విస్తరించి బడ్జెట్లో చేసిన ప్రతిపాదన భారత ఆర్థిక వ్యవస్థను నాణ్యమైనదిగా రూపాంతరం చెందడానికి తోడ్పడుతుంది.
భారత తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన నిర్మలా సీతారామన్ మౌలికసదుపాయాల పెట్టుబడులను పెంచాలన్న నిర్ణయాన్ని సరిగ్గా తీసుకున్నారని చెప్పాలి. తొలి టర్మ్ లో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాల రంగానికి అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. రహదారులు, నౌకాశ్రయాలు, రైల్వేల సామర్థ్యం విస్తృతం చేయడం చూశాం. వీటితో పాటు ప్రభుత్వం మౌలికసదుపాయాల సమస్యలను కూడా లేవనెత్తింది. ఆగిపోయిన ప్రాజెక్టులను ప్రభుత్వం తిరిగి చేపట్టడం ప్రారంభించింది. ప్రస్తుతం మౌలికసదుపాయాల విస్తృతి ఆరోగ్యకరమైన స్థాయిలో పునరుద్ధరించబడింది. ఈ విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందడుగు వేసింది.
బడ్జెట్ 2018-2030 ల కాలానికి 50 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం ఎంతైనా ప్రశంసనీయం. ఎందుకంటే రైల్వేలు కేవలం జాతీయ ట్రాన్స్ పోర్టర్ మాత్రమే కాదు భారత ప్రాణభూతమైన జీవనరేఖ అని చెప్పాలి. రహదారి రంగంతో పోలిస్తే ఆ స్థాయిలో రైల్వేల్లో పెట్టుబడులు గతంలో ఉండేవి కావు. దీంతో సహజంగానే రవాణా, ప్రయాణీకులు రహదారి సౌకర్యాలపై ఎక్కువ ఆధారపడ్డం మొదలైంది. రైల్వేలు తక్కువ ఖర్చుతో కూడినవి, పర్యావరణపరంగా ఎంతో అనుకూలమైన రవాణా సదుపాయం. అందుకే దీనిపై పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకే రైల్వేల్లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పెండింగ్ ప్రాజక్టులపై దృష్టిసారించాలనే ఆలోచన కేంద్రానికి ఉంది. ఇలా ఆలోచిస్తే, బడ్జెట్ రైల్వేల రంగం పరంగా సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఢిల్లీ-మీరట్ వేగవంతమైన రవాణా వ్యవస్థకు ఉపయోగపడే సబర్బన్ రైల్వేస్ మీద సరైన సమయంలో బడ్జెట్ దృష్టిసారించింది. ప్రస్తుతం 657 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ అక్కడ నడవడం వల్ల అక్కడి పట్టణ ప్రాంత ప్రజలు తమ వర్కు ప్లేసులకు వెళ్లడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఇది వారికి సంతృప్తికరమైన సేవలను అందిస్తోంది.
జంట రవాణా కారిడార్లు అయిన తూర్పు, పశ్చిమ కారిడార్ల పూర్తిచేయడాన్ని బడ్జెట్లో కేంద్రం పునరుద్ఘాటించింది. వీటి వల్ల ప్రయాణీకుల సేవల పరంగా ట్రాక్ సామర్థ్యం సుస్థిర రీతిలో పెరుగుతుంది. అంతేకాదు వేగవంతంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలన్న ఉద్దేశాన్ని కూడా బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. దీనికి సంబంధించి నూరు లక్షల కోట్ల నిధులను మౌలికసదుపాయాల కోసం కేటాయించడానికి అన్ని వైపుల్లో అందివచ్చే ప్రత్యామ్నాయ అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అలాగే ‘క్రెడిట్ గ్యారెంటీ ఎన్హాన్స్ మెంట్ కో-ఆపరేషన్’ను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా కేంద్రానికి ఉంది. ఈ నిర్ణయం మనం సరైన దిశగా వేస్తున్న ముందడుగు.
పరిశ్రమల కారిడార్లు అయిన భారత్‌మాలా, సాగర్మాలా, జై మార్గ్ వికాస్, ఉడాన్ వంటి వాటి కింద చేపట్టిన పలు ప్రాజక్టులకు బడ్జెట్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ చర్యలన్నీ ప్రభుత్వ ఉద్దేశమైన రైల్వేలు, రహదారులు, జలమార్గాలు, పవర్, విమానాశ్రయాల వంటి వాటి ‘వన్ నేషన్, వన్ గ్రిడ్’ నినాదానికి ఆర్థిక బలాన్ని ఇవ్వాలని కేంద్ర బడ్జెట్ బలంగా కోరుకుంటోంది. వారణాశి-హల్దియా జలమార్గం ఎంతో శక్తివంతమైంది. దీని ద్వారా సరుకులను తక్కువ ధరకు రవాణా చేసే వీలుంటుంది. ఎగుమతులను పెంపొందించడం ద్వారా సాగర్మాలా ప్రాజక్టులను మరింత కీలకంగా తయారవుతాయి. కొత్త ఓడరేవులను ఏర్పాటు చేయడం, పాత ఓడరేవుల సామర్థ్యాన్ని టౌన్‌షిప్పుల ఏర్పాటుతో మరింత పెంపొందించడం వల్ల ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా పెంచే లక్ష్యంతో కేంద్రం ఉంది. అంతేకాదు ఎగుమతుల రంగం వల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.
ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ, రిపైర్లు, బాగుచేయడాలు వంటి వాటిని శక్తివంతంగా వృద్ధి చేయడం ద్వారా భారత్‌ను విమానయాన హబ్‌గా తీర్చిదిద్దేందుకుగాను విధాన నిర్దేశకత్వాన్ని బడ్జెట్ పెట్టుకుంది. భారత్‌మాలా ఫేజ్ 2 కింద దేశమంతటా 48,000 కిలోమీటర్ల రోడ్డు నెట్వర్కును నిర్మాణ విస్తరణ చేయనుంది. భారత్‌మాలా ప్రాజక్టుల నిర్వహణకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక భూ కేటాయింపుల ద్వారా మద్దతును బడ్జెట్ ప్రతిపాదించింది. కేంద్రం వేసిన ఈ నిర్ణయం వల్ల భూసేకరణ తప్పకుండా వేగవంతమవుతుంది. మరో ప్రశంసనీయమైన అంశం ఏమిటంటే దేశంలోని 97 శాతం జనవాసాలు అన్ని రకాల వాతావరణ సంబంధమైన రహదారీ నెట్వర్కులతో అనుసంధానమై ఉన్నాయి. కేంద్రం చేపట్టిన ‘ప్రధాన మంత్రి సడక్ యోజన’ వల్ల దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలను అర్బన్ కేంద్రాలకు సమీపంలోకి తేగలిగింది. గ్రామీణ ప్రాంతాల రహదారులపై తన దృష్టిని పెట్టనున్నట్టు బడ్జెట్ పునరుద్ఘాటించింది. ఇది రైతులకు భౌతిక కార్యకలాపాల నిర్వహణకు లాభకరంగా సహాయపడగలమని పేర్కొంది. ఆర్థికవ్యవస్థ మూడింతలు వృద్ధి చెయడంలో మౌలికసదుపాయాల పెట్టుబడులు ఎంతో శక్తివంతంగా తోడ్పడతాయి. ప్రతి ఏడాది 20 లక్షల కోట్ల రూపాయలను మౌలికసదుపాయాలపై ఖర్చుచేయాలని బడ్జెట్ పేర్కొనడం దేశ ఆర్థికరంగ భారీ వృద్ధిని సూచిస్తుంది.
రచన: మనీష్ ఆనంద్, సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్

Comments
Post a Comment