పార్లమెంటులో ఈ వారం

పదిహేడవ లోక్ సభ తొలి సమావేశాల్లో పలు బిల్లలు ప్రవేశపెట్టారు. వాటిల్లో జమ్ము-కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది. ఇది అంతర్జాతీయ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న ప్రజలకు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లో మూడు శాతం కోటాను కేటాయించేది. లోక్ సభ, రాజ్య సభలు జమ్ము-కశ్మీర్‌లో మరో ఆరునెలలు రాష్ట్రపతి పాలనను కొనసాగించే బిల్లును చేపట్టాయి. అంతేకాదు జమ్ము-కశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2004లో సవరణలు చేపట్టేందుకు బిల్లును చేపట్టాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ రెండు బిల్లులను గతంలోనే లోక్ సభ పూర్తిచేసింది. తర్వాత రాజ్యసభలో కూడా వీటిపై చర్చించారు. ప్రస్తుతం జమ్ము-కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం కోటాను రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి  ఉద్దేశించారు. ఈ చర్చలో పాలుపంచుకున్న హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ చట్టం కింద ఆ సీలింగ్‌ను మరో నాలుగు శాతానికి పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాదు జమ్ము-కశ్మీర్ సమస్య పరిష్కారానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ సిద్ధాంతమైన ‘ఇన్సానియాత్, జమ్హూరియాత్, కశ్మీరియాత్’ సిద్ధాంతాన్నిమోదీ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. 
  

అంతేకాదు ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం రాజీలేని వైఖరిని అనుసరిస్తుందని హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇది సమస్యాత్మక ప్రాంతాలలో ఫలితాలు చూపుతున్నా యన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం జమ్హూరియాత్ ప్రతినను నెరవేరుస్తోందన్నారు. లడఖ్‌ని ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటుచేయడం, ఆ హిల్ కౌన్సిల్‌కు ఎక్కువ అధికారాలను ఇవ్వడం గురించి కూడా అమిత్ షా పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతన్న చర్యలను పేర్కొన్నారు.   

 పార్టీలకు అతీతంగా, రాజ్య సభ ఈ బిల్లుకు మద్దతు పలికింది. ఇది వెనుకబడిన కులాలు, వెనుకబడిన తెగల వారికి, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కేంద్ర విద్యాసంస్థల్లో టీచర్ల పోస్టులకు రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ చేసిన ఆర్డినెన్స్‌ ను భర్తీ చేస్తుంది. ‘సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ( టీచర్స్ కేడర్‌లో రిజర్వేషన్స్) బిల్లు,2019 ద్వారా నలభై ఒక్క కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఎనిమిదివేల ఖాళీలను పూర్తిచేసే అవకాశం ఉంది. అంతేకాదు జనరల్ కేటగిరీ నుంచి  ఆర్థికంగా బలహీన వర్గాలకు పది శాతం రిజర్వేషన్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఇది ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో చేపట్టింది. 
  
డెంటిస్ట్స్ సవరణ బిల్లు, 2019ని కూడా లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లు డెంటిస్ట్స్ చట్టం, 1948లో మార్పులను కోరింది. ఇది డెంటిస్ట్రీ వృత్తిని క్రమబద్ధీకరిస్తుంది. దీంతోపాటు  ఈ వరుసలో రాష్ట్ర డెంటల్ కౌన్సిల్స్, జాయింట్ స్టేట్ డెంటల్ కౌన్సిల్స్ కూడా ఉన్నాయి. ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష వర్థన్ మాట్లాడుతూ ‘మ్యాండేటరీ’ అనే మాటను తొలగించడమే ఈ సవరణ బిల్లు ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఆరోగ్యమంత్రి లోక్ సభలో మాట్లాడుతూ వైద్య విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ‘నేషనల్ మెడికల్ కమిషన్’ (ఎన్ఎంసి) బిల్లును చేపట్టనుందని వెల్లడించారు. భారత వైద్య మండలి (సవరణ) బిల్లు, 2019పై జరిగిన చర్చకు   ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ జవాబిచ్చారు. తర్వాత ఈ బిల్లు లోక్ సభలో వాయిస్ ఓటుతో చేపట్టారు. ఈ బిల్లు వల్ల సెప్టెంబరు 26, 2018 నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) రెండు సంవత్సరాల పాటు అత్యున్నత స్థానంలో కొనసాగుతుంది. ఫిబ్రవరి 21న ప్రకటించిన ఆర్డినెన్స్‌ ను ఇది భర్తీ చేస్తుంది.


వీటితోపాటు  స్వతంత్రప్రతిపత్తితో వ్యవహరించే ఇనిస్టిట్యూషనలైజ్డ్ డొమెస్టిక్, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్  పాలనా విభాగ ఏర్పాటు కోసం లోక్ సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మార్చిలో గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎన్‌డిఎఐసి),2019 బిల్లు భర్తీ చేస్తుంది. ఇది ఇనిస్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ పరంగా స్వతంత్ర సంస్థ స్థాపనకు అవకాశం కల్సిస్తుంది.  వరల్డ్ ఇన్ 2019-20 ఆర్థిక అంశాలకు సంబంధించి బదిలీలు తదితర అంశాలను చూస్తుంది.

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మాలా సీతారామన్ 2018-19 ఆర్థిక సర్వేని జులై నాలుగున పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంతేకాదు అందులో 2019-20కి ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆర్థిక ప్రగతికి రాజకీయ ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 2.0 ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారీస్థాయిలో, సవాళ్లతో కూడిన పాలసీలు, కార్యకలాపాలను కేంద్రం చేపట్టింది. ఇవి భారత దేశాన్ని అత్యధిక ప్రగతి సాధన మార్గంలో తీసుకువెడతాయనడంలో సందేహం లేదు. 

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం