తీవ్రతరమవుతున్న ఇరాన్-అమెరికా ఘర్షణ- దౌత్యమార్గంలో సమస్య పరిష్కార అవసరం

రోజులు గడుస్తున్న కొద్దీ ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరమవుతోంది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ కమ్యూనిటీ తన దృష్టిని దీనిపై సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇరాన్-అమెరికా దేశాల మధ్య ఘర్షణ 1979 ఇరాన్ విప్లవం నాటి నుంచి పుట్టుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య రేగిన ఘర్షణ గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ (జెసిపివొఎ) నుంచి తప్పుకున్నప్పటి నుంచి మరీ పెరిగింది. అప్పటి నుంచి గతంలో ఎత్తివేసిన కొన్ని అంశాలను కూడా కలిపి తిరిగి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను విధించింది. అంతేకాదు ఈ ఆంక్షల జాబితాలో కొన్ని కొత్త అంశాలను కూడా అమెరికా చేర్చింది. వాటిల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ అధినాయకులను సైతం ఈ ఆంక్షల పరిధి కిందకు అమెరికా చేర్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెసిపివొఎ ఒప్పందం మీద తన అయిష్టతను అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారసమయం నుంచి వ్యక్తంచేశారు. ఆ ఎన్నికల అనంతరం అధ్యక్షుడు ట్రంప్ దాని ప్రాంతీయ కార్యకలాపాలకు అడ్డుకట్టవేసే దిశగా ఇరాన్ పట్ల మరింత కఠిన విధాన వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. అది ఎలా ఉండేదంటే అమెరికాతో సరికొత్త అణుఒప్పందంపై చర్చలకు ఇరాన్‌పై పూర్తిస్థాయిలో ఒత్తిడి తెచ్చే విధంగా అమెరికా విధానం ఉండేది. రాజకీయ, ఆర్థిక ఆంక్షలతో పాటు గల్ఫ్ ప్రాంతంలో సైనికబలగాలను దించేవరకూ అమెరికా విధానం కొనసాగింది. వాటిల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్, బి52-బాంబర్స్ లతో పాటు అదనంగా వెయ్యిమంది అమెరికా సైన్యాలను ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టడం ముఖ్యమైంది. అమెరికా చేపట్టిన ఈ చర్యలకు ప్రతిస్పందిస్తూ ఇరాన్ కూడా కొన్ని ప్రతిచర్యలను చేపట్టింది. దీంతో వీటి మధ్య పోరాటం మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వీటిల్లో జెసిపివొఎ కింద అంగీకరించిన కొన్ని అంశాలపై నియంత్రణ వేటును వేయాలని కూడా ఇరాన్ నిశ్చయించుకుంది. దీనితోపాటు యురేనియం ఎగుమతిని ఆపేయాలని నిర్ణయించింది. అదే సమయంలో యురేనియం ఉత్పత్తిని మరింత అధికంగా పెంచాలని నిశ్చయించుకుంది. ఇరాన్ అణు కార్యకలాపాల్లో ఈ నియంత్రణా పరిమితులను జెసిపివొఎ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నిబంధనలను ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా కొనసాగిస్తామని ఒప్పుకున్నట్టు ఇరాన్ వాదించింది. కానీ అమెరికా ఎప్పుడైతే ఈ ఒప్పందం నుంచి వైదొలగిందో దాంతో ఇది ముందుకు సాగలేదని ఇరాన్ స్పష్టంచేసింది. అమెరికా ఈ సరళి అణుఒప్పందం నుంచి ఇరాన్ సాంకేతికంగా వెళ్లిపోయేలా చేసింది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన యురోపియన్ దేశాలు జెసిపివొఎ ఒప్పందానికి అనుగుణంగా స్పందించాలని, అప్పుడే ఒప్పందం సురక్షితంగా ఉంటుందని ఇరాన్‌తో అభిప్రాయపడ్డాయి.

ఇటీవల వారాల్లో కొన్ని ఇతర సంఘటనలు కూడా గల్ఫ్ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. అవి కూడా ఇరాన్-అమెరికాల మధ్య ఘర్షణను మరింత పెంచాయి. వాటిల్లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఆయిల్ టాంకర్ల మీద జరిగిన పలు దాడులు, పర్షియన్ గల్ఫ్ లో అమెరికా డ్రోన్ కూల్చివేత, జిబ్రాల్టార్ వద్ద బ్రిటన్ సైనికులు ఇరాన్ చమురు టాంకర్‌ను పట్టుకోవడం, దీనికి ప్రతిదాడులు చేస్తామంటూ ఇరాన్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ ఘటనలతో పాటు, ఇరాన్ ఊపిరాడని ఆర్థిక పరిమితులు కూడా దానిని స్టైట్ ఆఫ్ హోర్మోజ్ సమీపానికి వచ్చేలా ఒత్తిడి రేపాయి. దీంతో ఆ మార్గంలో పయనించే నౌకల భద్రత, రక్షణ అంశాల పరంగా తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. మూడవ ప్రపంచదేశాల చమురు నౌకలు స్ట్రైట్ హోర్మోజ్ గుండానే వెడతాయి. తీవ్ర ఘర్షణల నేపథ్యంలో దీన్ని మూసివేసిన పక్షంలో, లేదా ఏదైనా తీవ్ర పరిణామాలు ఈ మార్గంలో తలెత్తిన పక్షంలో గల్ఫ్ లో సైనిక దాడులు ప్రమాదం పొంచి ఉంది కూడా.

అందుకే అంతర్జాతీయ శక్తులు ఇరాన్-అమెరికాల మధ్య తీవ్రతరమవుతున్న ఈ ఘర్షణలకు దౌత్యప్రయత్నాల ద్వారా ముగింపు పలకడానికి ప్రయత్నాలు చేయాల్సిన సమయం ఇది. గల్ఫ్ నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటుంది. అందుకే ఈ ప్రాంతం భారత్‌కు ఎంతో ముఖ్యమైంది. అందుకే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ప్రాంతంలో ఏ రకమైన భంగపాట్లు తలెత్తినా అది భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు భారత్ హైడ్రోకార్బన్ దిగుమతులపై ప్రభావం చూపుతుంది. దాని దిగుమతులు తగ్గిపోతాయి. దాంతో భారత ఎనర్జీ భద్రత కాస్తా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణ పరిస్థితులతో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ చెన్నై, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సునయినాను దించింది. తద్వారా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించడం, రవాణా వంటివి పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ల నుంచి సాగుతాయి. ఈ ప్రాంతంలోని దేశాలతో భారత్ ద్వైపాక్షికంగా సత్సంబంధాలను కొనసాగిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో ఏదైనా సైనిక చర్య చోటుచేసుకుంటే తన ప్రయోజనాలకే దెబ్బ అని తెలుసు. ఈ ప్రాంతం వాతావరణఆన్ని పూర్తిగా అస్థిరపాలు చేయకముందే, యుద్ధం చెలరేగకముందే, ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూడకముందే, మానవప్రాణాలు పోకముందే ఘర్షణకు దిగిన రెండు దేశాలూ శాంతియుతంగా సంక్షోభాన్ని పరిష్కరించుకునేలా నిబద్ధత, నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చేయాలి. 

రచన: డా. అసిఫ్ షుజా, ఇరాన్ వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం