ఒసాకాలో జి20 శిఖరాగ్ర సదస్సు
జి20 సదస్సు జపాన్లోని ఒసాకాలో జరిగింది. అంతర్జాతీయ ఆర్థికరంగంలో 80 శాతం జి20 నుంచే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక పాలనపరమైన చర్చలకు ఇది అతి ముఖ్యమైన వేదిక. జి20 సభ్య దేశాల నాయకులు ఒసాకాలో సమావేశమయ్యారు. వీరు పెట్టుకున్న ప్రాధాన్య అంశాలలో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థపై పునర్ విశ్వాసాన్ని నెలకొల్పడం ఒకటి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపుతోంది. అందుకే జి20 దేశాలన్నీ ఒకచోట కూడి వాణిజ్యపరమైన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంపొందించాలని పూనుకున్నాయి. జి20 సమావేశానికి సంపన్నదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఉన్నత నాయకులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత తరపున ఈ శిఖరాగ్రసదస్సుకు ప్రాతినిధ్యం వహించారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో ఒసాకా ప్రకటనను చేపట్టారు. దాని ప్రధాన లక్ష్యం స్వేచ్ఛాయుతమైన, వివక్షారహిత, పారదర్శకమైన, సుస్థిర వాణిజ్య, పెట్టుబడి పర్యావరణలను ఆవిష్కరించడమేనని ఒసాకా ప్రకటనలో జి20 దేశాలు స్పష్టం చేశాయి. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డబ్ల్యుటివొ)ని సంస్కరించాల్సిన అవసరాన్ని కూడా జి20 దేశాల నాయకులు నొక్కిచెప్పారు. ఇది అతి పెద్ద బహుపాక్షిక వాణిజ్య సంస్థ. అంతేకాదు గ్లోబల్ వాణిజ్య వ్యవస్థ ఫౌండేషన్ కూడా. డబ్ల్యుటివొ ‘అప్పాలంట్ బాడీ’కి నూతన అపాయింట్మెంట్ల రద్దును అమెరికా కొనసాగిస్తోంది. దీనివల్ల వివాదాస్పద అంశాల యంత్రాంగం బలహీనపడే అవకాశం ఉంది. అందుకే డబ్ల్యుటివొ సభ్యులు నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా వివాదాల పరిష్కార వ్యవస్థ సుస్థిరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఒసాకా ప్రకటనలో సభ్యదేశాలు స్పష్టంగా పేర్కొన్నాయి.
జి20 దేశాల ప్రెసిడెంట్గా జపాన్ ఎజెండా రూపకల్పనలో కీలకపాత్ర పోషించాలి. జపాన్ ప్రధాని షింజో అబె ‘ఒసాకా ట్రాక్’ని ప్రారంభించారు. డేటా గవర్నెన్స్ కు సంబంధించి నిబంధనల నిర్మాణానికి పూనుకోవడం దీని లక్ష్యం. అంతేకాదు ‘డేటా ఫ్రీ ఫ్లో విత్ ట్రస్ట్’ (డిఎఫ్ఎఫ్టి)తో కలిసి కొత్త పాలన నిర్మాణానికి పూనుకోవడం కూడా ఇందులో ఉంది. జి20లోని అధిక సంఖ్యాక దేశాలు దీనికి మద్దతు తెలిపినప్పటికీ, భారత్ దీనిపై తన ‘రిజర్వేషన్ల’ను వ్యక్తంచేసింది. సరిహద్దుల గణాంకాల ప్రవాహం, సమాచారాలు ఉత్పత్తిని, నూతన ఆవిష్కరణలను వృద్ధి చేసినప్పటికీ, ప్రైవసీ, గణాంకాల పరిరక్షణ, మేధోసంపద హక్కులు, భద్రత వంటి అంశాలకు సంబంధించిన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. డేటా సైతం కొత్త రూపంలోని సంపదగా భారత్ అభిప్రాయపడుతోంది. అంతేకాదు 2018లో రిజర్వుబ్యాంక్ ఇండియా జారీచేసిన ఆదేశాలననుసరించి డేటా స్థానికీకరణ మీద దృష్టిపెట్టనుంది.
ఒసాకా సమావేశంలో చోటుచేసుకున్న మరో వివాదాస్పద అంశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పారిస్ ఒప్పందాన్ని ప్రస్తావించకుండా వ్యవహరించడం. అయితే ఫ్రెంచి ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ నుంచి పలువురు దేశాధినేతలు దీనిపై అమెరికా వ్యవహార తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్రెంచి ప్రెసిడెంట్ మక్రాన్ సారథ్యంలో చేపట్టిన ఒసాకా ప్రకటనలో కూడా పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి సంబంధించి దానిపై సంతకాలు చేసిన దేశాలన్నీ నిబద్ధతతో వ్యవహరించాలని నొక్కిచెప్పడం జరిగింది. పారిస్ ఒప్పందంపై అమెరికా శైలికి సంబంధించి విడిగా చర్చ జరిగింది. అమెరికా వర్కర్లకు, పన్ను చెల్లింపుదారులకు ఇది నిష్ప్రయోజనకరమైందిగా అమెరికా దీనిపై అభిప్రాయ పడింది. నాణ్యమైన మౌలికసదుపాయాల పెట్టుబడిని జి20 సభ్యదేశాల వ్యూహాత్మక మార్గనిర్దేశకత్వంగా పేర్కొంటూ ప్రభుత్వ ఆర్థికనిధుల సుస్థిరత, జీవనశైలి ఖర్చువెచ్చాల పరంగా ఆర్థిక నైపుణ్యం పెంచడం, పర్యావరణ, సామాజిక అంశాలను సంమ్లీనం చేయడం, మహిళల ఆర్థిక సాధికారత, ప్రకృతి వైపరిత్యాల నియంత్రణలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం, ఇతరత్రా సమస్యలతోపాటు మౌలికసదుపాయాల పాలనను బాగా పటిష్టం చేయడం వంటి అంశాలపై జి20 దేశాలు దృష్టిపెట్టాయి.
‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఎటిఎఫ్) ప్రమాణాలను అమలు చేసేందుకు తీవ్రంగా కష్టపడాలని ఒసాకా ప్రకటన నొక్కి చెప్పింది. ఎందుకంటే హవాలా లావేదేవీలు, ఉగ్రవాదులకు నిధుల సహాయం చేయడం, నిధుల సమీకరణ వంటి వాటిని నియంత్రిస్తూ వాటిపై పోరాడాలని ఒసాకా ప్రకటన స్పష్టంచేసింది. అవినీతిపై చేస్తున్న పోరులో జి20 దేశాలన్నీ వాస్తవ సహకారాన్ని కొనసాగించాలని ఒక అంగీకారానికి వచ్చాయి. అలాంటి శక్తులకు తమ దేశాలు నిలయం అవడమనే ఆలోచనను తీవ్రంగా అవి నిరశించాయి కూడా. అలాగే అవినీతి విషయంలోనూ అన్ని దేశాలదీ ఒక్కటే మాట. అవినీతిపై పోరులో జి20 దేశాలన్నీ కూడాయి. ఆ అంశంపై నిబద్ధమైన పోరాటానికి సిద్ధమయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడానికి సంబంధించి జి20 అంతర్జాతీయ సహకారాన్ని కోరింది. అవినీతికి పాల్పడడం ద్వారా దోచుకున్న ఆస్తులను తిరిగి పొందేలా సహకరించాలని కూడా ఈ సందర్భంగా వ్యక్తంచేసింది.
అంతర్జాతీయ ఆర్థిక, ఫైనాన్షియల్ ఎజెండా ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాళ్లపై చర్చలు చేస్తున్న ప్రముఖ సంస్థల్లో జి20 చాలా ముఖ్యమైంది. ఈ సదస్సు జరిగేటప్పుడు ప్రపంచ దేశాల నాయకులు ముఖ్య అంశాలపై సమావేశమై చర్చించేందుకు ద్వైపాక్షిక, త్రైపాక్షిక సమావేశాలకు అవకాశాలు ఈ శిఖరాగ్ర సదస్సులో సౌలభ్యం కల్పించారు. ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. వాటిల్లో అమెరికా-చైనా దేశాల సమావేశం కూడా ఉంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధానికి సంబంధించి సంధి ప్రయత్నాల చర్చలు కూడా ఇక్కడ పేర్కొనాలి. పలు ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలను భారత ప్రధాని నిర్వహించారు. వాటిల్లో అమెరికా, జపాన్ దేశాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ, భద్రతా అంశాలపై దృష్టిపెట్టాయి. అంతేకాదు ఇండో-ఫసిఫిక్లో జపాన్-అమెరికా-ఇండియా వ్యూమాత్మక సహకారావకాశాలను కూడా చర్చించారు. అంతేకాదు బహుధృవ ప్రపంచానికి సంబంధించిన సవాళ్లను రష్యా-ఇండియా-చైనా సమావేశంలో చర్చించారు. దాంతోపాటు బహుపాక్షిక, అభివృద్ధి సహకారం, సరిహధ్దు తీవ్రవాదం గురించిన అంశాలపై ‘బ్రిక్స్’ (బిఆర్ఐసిఎస్) సమావేశంలో కూడా దృష్టిపెట్టారు. ‘ఇంటర్నేషనల్ కొయిలేషన్ ఫర్ డిసాస్టర్ రీసాలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ లో జి20 దేశ నాయకులను చేరాల్సిందిగా భారత ప్రధాని మోదీ ఆహ్వానించారు. 2022 సంవత్సరంలో జి20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
రచన: డా. తిత్లీ బసు, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు
రచన: డా. తిత్లీ బసు, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు
Comments
Post a Comment