దేశం ఎదుర్కొంటున్న నీటి వెతలను పరిష్కరించే జల్ శక్తి మంత్రిత్వశాఖ

మానవ జీవితాలు ఏరకమైన ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగాలంటే నీటి వనరులు అత్యావశ్యకం. కానీ ఇప్పటికీ ప్రపంచం మొత్తంలో దాదాపు 844 మిలియన్ల మంది ప్రజలు నీటి కరువుతో బాధలు పడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) నివేదికలో గ్లోబల్ స్థాయిలో ఎదుర్కొంటున్న నాల్గవ అతి కీలకమైన సమస్య నీటివనరుల లోటేనని నివేదిక పేర్కొంది. ఇది సమాజంపై చూపే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా తన నివేదిక పేర్కొంది.

భారతదేశంలో కూడా నీటి వనరుల లోటు సమస్య అధికంగానే ఉంది. భారత్ గత కొన్ని దశాబ్దాలుగా మున్సిపల్ తాగు నీరు అందించడంతోపాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సైతం కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారతదేశంలోని అధిక జనాభా నీటి ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. అక్కడి ప్రజలు నీటి ఆశనే వదులుకొన్న దుస్థితిని చూస్తున్నాం. మరోవైపు దేశంలోని పట్టణ ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి చోటుచేసుకుంటున్న వాతావరణంలో ప్రభుత్వం నీటి పరంగా ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. చివరకు నీటిని అందజేయడానికి భారీగా ప్రైవేటు వర్గాల మీద ఆధారపడుతోంది.

వీటికి తోడు, తాగునీటి వనరుల మెరుగవుతున్నా దానితో సంబంధం లేకుండా ఇతర నీటి వనరులు రసాయన కాలుష్యాలతో నిండిపోయాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు జబ్బులలో 21 శాతం కలుషితమైన నీటి ని తాగడం వల్ల వస్తున్నవే. అంతేకాదు పారిశుద్ధ్య పరిస్థితులు ఇపుడిపుడే మెరుగుపడుతున్నప్పటికీ దేశంలో కేవలం 33 శాతం మందికి మాత్రమే సంప్రదాయ విధానంతో కూడిన పారిశుధ్య వసతులు అందుబాటులో ఉన్నాయి.

ఆందోళన కలిగించే మరో అంశం ఏమిటంటే నీటి వనరులు ఇంకిపోతున్న ప్రస్తుత తరుణంలో దీర్ఘకాలంలో భారత్‌లో ఎదురయ్యే నీటి లోటు పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం భారత జలాశయాలు ఇతర జలవనరులతో నిండేలా అనుబంధం చేశారు. దీంతో ధాన్యాన్ని ఉత్పత్తి చేసే పెద్ద దేశంగా భారత్ నిలిచింది. ధాన్యం పంట వృద్ధి చెందాలంటే ఆ పంటకు నీళ్లు బాగా కావాలి. అన్ని దేశాలు భారీ వ్యవసాయ ఉత్పత్తులను కలిగి ఉండడంతో, ఆహార ఉత్పత్తులకు అయ్యే అధిక నీటి వనరుల వినియోగం కారణంగా మొత్తం జలవనరుల్లో లోటు తలెత్తుతోంది. జలవనరులు అపురూపం అవుతున్నాయి.

ప్రభుత్వ ‘థింక్ టాంక్’గా పేరుపడ్డ నితి ఆయోగ్ దీనిపై స్పందిస్తూ భారతదేశంలో 600 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర జనవనరుల లోటు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొంది. మరొక విషయం ఏమిటంటే మొత్తం 75 శాతం ఇళ్లల్లో తాగునీరు అందుబాటు లేదు. మరోవైపు దేశంలో సురక్షిత నీటి వనరులు అందుబాటులో లేక ప్రతి ఏడాది దేశంలో రెండు లక్షల మంది చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకూ దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో నీటి నిల్వల లోటు తీవ్రంగా ఉంటున్న పరిస్థితులను చూస్తున్నాం. వీటికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్‌గా పెరుగుతున్న ఉష్ణోగ్రతల తాపం వంటి విషయాలు కూడా జలవనరులను మరింత క్షీణింపచేశాయి.

రోజు రోజుకీ పెరుగుతూ పోతున్న నీటి వనరుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ‘జల్ శక్తి’ లేదా ‘వాటర్ పవర్’ మంత్రిత్వ శాఖను ప్రారంభించింది. దీని లక్ష్యం ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించడంతో పాటు భారత దేశం ఎదుర్కొంటున్న నీటి వనరుల లోటు సమస్యను పరిష్కరించే దిశగా కృషిచేస్తుంది. జలవనరుల మంత్రిత్వశాఖ, నదుల అభివృద్ధి, గంగానదీ పునరుద్ధరణ, తాగునీరు, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖలన్నింటినీ సమ్మిళితం చేసి ప్రభుత్వం ఈ కొత్త ‘జల శక్తి’ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. పరిశుభ్రమైన తాగు నీటిని అందించడం, అంతర్జాతీయంగా, దేశీయంగా రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు, అలాగే ‘నమామి గంగే’ ప్రాజెక్టు(గంగా జలాలను శుభ్రం చేసేందుకు ఏర్పడినది), ఉపనదులు, వాటి ఉపనదులు ఇవన్ని అంశాలు కొత్త మంత్రిత్వ శాఖ కిందకు వస్తాయి. ఇవే కాకుండా పరిశుభ్రమైన తాగునీరును ప్రజలకు అందించడాన్ని ఈ శాఖ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

రెండవ పర్యాయం అధికారంలోకి వస్తే ఎన్డీఎ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఒక్కటేనని, అందరికీ సురక్షిత మంచినీటిని అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. ఆ మాటను నిలుపుకుంటూ జలవనరులకు సంబంధించి ఈ కొత్త చర్యలను మోదీ చేపట్టారని విస్పష్టమవుతోంది. ఎన్నికల ప్రచారంలో మోదీ జలవనరులకు ప్రత్యేకంగా నూతన మంత్రిత్వ శాఖను ఏర్పరచనున్నట్టు తెలిపారు. దీని లక్ష్యం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమేనన్నారు. రైతుల కోసం ఎంతో నాణ్యమైన సాగునీటి వనరుల సదుపాయాలను కల్పిస్తామన్నారు. వీటన్నింటినీ కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు ద్వారా ప్రధాని పరిష్కరించడానికి పూనుకున్నారు.

నీళ్ల పరంగా ఎన్నో కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అవి కొద్ది కొద్దిగా చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఉదాహరణకు అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు దేశంలోని నదులను పరిరక్షించే బాధ్యతను అప్పగించారు. పట్టణ ప్రాంతాల్లో నీటి పంపిణీ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, సూక్ష్మ-సాగునీటివనరుల ప్రాజక్టులు వ్యవసాయశాఖ మంత్రిత్వ శాఖ కిందకు వస్తాయి.

భారత ప్రభుత్వం చెపుతున్నదాని ప్రకారం కొత్తగా ఏర్పడిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ లక్ష్యం గతంలోని నీటి వనరులు, తాగునీరు, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖలను ఒక గొడుగు కిందకు తీసుకురావడం కన్నా కూడా ఎంతో ఉన్నతమైంది. ఈ కొత్త శాఖ దేశంలోని మొత్తం నీటి పంపిణీ, డిమాండ్లను సమైక్యపరచడం ద్వారా సమగ్ర విధానంతో నీటి సమస్యను పరిష్కరించే యోచనలో ఉంది.

మరీ ముఖ్యంగా ఈ కొత్త శాఖ సాధికారతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యవసాయ మంత్రిత్వ శాఖతో విధానపరమైన సహకారాన్ని సాధించగలదు. ఈ శాఖ దేశంలోని నీటి డిమాండులో 80 శాతం కలిగి ఉంది. వివిధ రకాల వాతావరణాలు ఉన్న ప్రాంతాల్లో సరైన ప్రత్యామ్నాయ పంటల మార్గనిర్దేశకత్వం కూడా ఈ శాఖ అందిస్తుంది. అంతేకాదు నీటివనరులను సంరక్షించే కొత్త సాంకేతిక పరిజ్ఘానాన్ని ప్రవేశపెడుతుంది. అంటే వర్షాలు పడని ప్రాంతాల్లో ఉపయోగపడే స్ర్పింకిల్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు లాంటివి అనమాట. అందుబాటులో ఉన్న నీటివనరుల్లో తగినంత మేరే ఉపయోగించుకునేలాంటి సాంకేతిక సాధనాలను ప్రవేశ పెట్టడం వంటి వాటిని కూడా ఈ శాఖ చేపడుతుంది.

రచన: బిమన్ బసు, సీనియర్ సైన్స్ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం