ఆఫ్రికాకు బాగా చేరువవుతున్న భారత్

ఆఫ్రికాతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందుకే రెండవసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం భారత ప్రభుత్వం విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి వి. మురళీధరన్ మూడు రోజుల పర్యటనకు నైజీరియాకు పంపింది. అక్కడి నాయకత్వంతో ఆయన సంభాషణలు జరిపారు. ప్రెసిడెంట్ ముహమ్మదు బుహారీ, వైస్‌ప్రెసిడెంట్ యెమి ఒసినొబాజోలతో కూడా సమావేశమయ్యారు. అంతేకాదు ఈ ఉత్సవానికి హాజరైన దక్షిణాఫ్రికా, నిగర్, ఇథియోపియా, ఈజిప్టు తదితర దేశాలకు చెందిన మరికొంతమంది ఆఫ్రికా నాయకులను కూడా భారత మంత్రి కలిశారు.

ఈ పర్యటన ఇరుదేశాల మధ్య ఉన్న సుస్థిరమైన, సన్నిహిత సంబంధాలను ప్రతిఫలిస్తోందంటూ భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. 2007 లో భారత, నైజీరియా దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి కూడా. ఇరుదేశాల మధ్య పటిష్టమైన రక్షణ సహకారం కూడా కొనసాగుతోంది. 2017-18 సంవత్సరంలో ఈ రెండు దేశాల మధ్య 11.76 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. నైజీరియాలో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు ఉన్నారు కూడా. నైజీరియా భారత అతి పెద్ద వాణిజ్య భాగస్వామి.

అంతర్జాతీయంగా కూడా నైజీరియాకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశానికి ముడిచమురు పంపిణీ చేస్తున్న ఐదవ అతిపెద్ద దేశం. భారతదేశానికి ఎల్ఎన్‌జి పంపిణీ పరంగా నైజీరియా రెండవ స్థానంలో నిలుస్తోంది. నిజం చెప్పాలంటే భారత ఎనర్జీ భద్రతాపరమైన విషయాల్లో సైతం నైజీరియాది కీలకస్థానం. ఎందుకంటే నైజీరియా నుంచి మనకు కావలసిన ముడి చమురు అవసరాల్లో పన్నెండు శాతం తెప్పించుకుంటున్నాం. మొత్తం 7.65 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే దిగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు మాత్రమే 2016-17 సంవత్సరంలో 7.46 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. నైజీరియాతోనే కాకుండా ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాలతో కూడా భారత్ వ్యూహాత్మక, వాణిజ్య పరంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్ పర్యటన అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వచ్చే నెలలో పశ్చిమ ఆఫ్రికాను పర్యటించనున్నారని వార్తలు సూచిస్తున్నాయి.

గత ఐదు సంవత్సరాల కాలంలో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు పటిష్టం చేసేందుకు పలు సుస్థిర చర్యలను న్యూఢిల్లీ చేపట్టింది. 2014, 2018 మధ్య కాలంలో ఆఫ్రికా ఖండానికి భారత అత్యున్నత అధికార బృందం 25 పర్యాయాలు పర్యటించి ద్వైపాక్షిక స్థాయి చర్చలు నిర్వహించింది. ఇది ఆ ఖండంతో సంబంధాలకు భారత్ ఎంత ప్రాధాన్యం ఇస్తోందో స్పష్టమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆఫ్రికాతో సంబంధాలను పటిష్టం చేసే అంశంపై దృష్టి పెట్టింది. ‘ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్’ వచ్చే ఏడాది తర్వాత న్యూఢిల్లో జరగనుంది. ఈ సదస్సులో 40 దేశాల ప్రభుత్వ నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు.

తొలిసారి కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మోదీలు దాదాపు 24 ఆఫ్రికా దేశాలకు పలుమార్లు పర్యటించారు. 2015 ఆఫ్రికా ఫోరమ్ శిఖరాగ్ర సదస్సును భారత్ నిర్వహించింది. దీనికి 41 దేశాల ప్రభుత్వ నాయకులు హాజరయ్యారు. ఆఫ్రికాకు చెందిన 55 దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వం పరంగా అనుకూలంగా స్పందిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.

2015లో న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్రికా ఫోరమ్ శిఖరాగ్రసభలో పది బిలియన్ డాలర్లు కాన్సెన్సస్ రుణంకు భారత్ సమ్మతించింది. 600 మిలియన్ల డాలర్లను గ్రాంట్ సహాయంగా అందించడానికి అంగీకరించింది. ఇప్పటివరకూ భారత కంపెనీలు 54 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆఫ్రికాలో పెట్టాయి. ఆఫ్రికాతో భారత్ ప్రస్తుతం 62 బిలియన్ అమెరికన్ డాలర్లు వాణిజ్యం నిర్వహిస్తోంది. దీని మొత్తం గత ఏడాది కన్నా 21 శాతం ఎక్కువగా ఉంది. భారతదేశానికి ఆఫ్రికా చేస్తున్న ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే భారత్ 152 లైన్స్ ఆఫ్ క్రిడిట్ అంటే 11 బిలియన్ అమెరికన్ డాలర్లను 44 ఆఫ్రికా దేశాలకు ఇచ్చింది. ఈ నిధులను వ్యవసాయం, మౌలికసదుపాయాలు, ప్రజా రవాణా, పరిశుభ్రమైన ఎనర్జీ, సాగునీటి వనరులకు ఉపయోగిస్తారు. వీటన్నింటికీ మించి భారత ప్రభుత్వం గత ఏడాది 18 కొత్త రాయబారకార్యాలయాలను ఆఫ్రికా ఖండంలో 2018-2021 మధ్య కాలంలో తెరవనుంది కూడా.

పలు తీర దేశాలతో పాటు, భారత, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు ప్రధానంగా ‘బ్లూ ఎకానమీ’ ద్వారా సుస్థిర లాభాలపై దృష్టిసారిస్తున్నాయి. రెండు దేశాల కీలక రంగాలకు సంబంధించి పరస్పర ప్రయోజనాలు, లాభాలు, సహకారం దృష్టిలో పెట్టుకుని ఆఫ్రికా అండర్‌గ్రూపింగ్‌తో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్), ఇండియా బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా (ఐబిఎస్ఎ), యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్థానాలు, వాతావరణ మార్పు చర్చలు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటివొ) కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవి. రెండు దేశాల అధికార వర్గాలు చెబుతున్నట్టు శక్తివంతమైన సముద్ర సామర్థ్యం సహకార పెంపుదలపై భారత్, ఆఫ్రికా దేశాలు దృష్టిపెట్టాలి.

రచన: వినీత్ వాహి, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం