దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతున్న సమయంలో అవినీతికి వ్యతిరేకంగా పాకిస్తాన్ యుద్ధం
నకిలీ బ్యాంకు అకౌట్ల ఆరోపణల మీద మాజీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అసిఫ్ ఆలి జర్దారిని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) అరెస్టు చేసింది. జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ. బిలావల్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సిట్టింగ్ సభ్యులు. ఇస్లామాబాద్ హైకోర్టు జర్దారీకి ప్రీ-అరెస్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో జర్దారీని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు జర్దారీ సోదరి ఫర్యాల్ తల్పూర్ని కూడా అరెస్టు చేశారు.
పాకిస్తాన్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) నకిలీ బ్యాంకు అకౌంట్లపై విచారణ ప్రారంభించినప్పటి నుంచి ఇది అంటే 2015 సంవత్సరం నుంచి ఈ కేసు ప్రారంభమైంది. సుమిత్ బ్యాంక్, సింధ్ బ్యాంక్, యుబిఎల్ బ్యాంకుల్లో కల్పిత లావాదేవీలు జరుగుతున్నాయన్న సమాచారంతో జర్దారీ అవినీతి కేసు ప్రారంభమైంది.
ప్రారంభంలో జర్దారీ, అతని సోదరితో పాటు ఏడుగురు వ్యక్తులు ఈ కల్పిత లావాదేవీల వ్యవహారంలో ఉన్నట్టు తేలింది. లంచాల ద్వారా వచ్చిన డబ్బు ఈ అకౌంట్లకు తరలించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత, ఈ కేసులో ఎఫ్ఐఎ ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన స్యూ మాటో నోటీస్ను పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం పరిశీలనకు చేపట్టింది. అంతేకాదు ఈ ఆరోపణలను విచారించేందుకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జెఐటి)ని ఏర్పాటుచేసింది.
ఈ ఆరోపణలపై పరిశోధన చేసే క్రమంలో మరో 33 అనుమానాస్పద అకౌంట్లను గుర్తించారు. ఇవన్నీ ఈ కేసుతో అనుబంధమై ఉన్నాయి. వాస్తవానికి ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 170 మంది వ్యక్తులను ‘నో-ఫ్లై’ జాబితాలో చేర్చారు కూడా.
కల్పిత కంపెనీ పేరు మీద ఉన్న నకిలీ అకౌంట్లలో 4.4 బిలియన్ రూపాయలు పడ్డాయి. వాటిల్లో 30 మిలియన్ల రూపాయలు జర్దారీ గ్రూపుకు రెండు పర్యాయాలు చెల్లింపులు చేశారని ఎన్ఎబి, ఎఫ్ఐఎలు ఆరోపించాయి.
కరాచీలోని బ్యాంకింగ్ కోర్టులో ఎఫ్ఐఎ పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ను అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఎఫ్ఐఎ కేసు నమోదుచేసింది. కోర్టు జర్దారీకి అరెస్టు వారెంట్ జారీ చేసింది. తర్వాత పిపిపి నాయకుడు ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి 2018 ఆగస్టులో బెయిల్ సొందారు. ఆతర్వాత పిపిపి కేసును ప్రభావితం చేస్తోందంటూ పెట్టుబడిదారులు ఆరోపించడంతో కేసును కరాచీలోని అకౌంటబిలిటీ బ్యూరో ఆఫీసు నుంచి ఇస్లామాబాదులోని అకౌంటబిలిటీ కోర్టుకు బదిలీ చేశారు.
పరిశోధనలు చేస్తున్న క్రమంలో, జర్దారీ, ఆయన సోదరి తల్పూర్లకు వ్యతిరేకంగా ఇద్దరు ‘అప్రూవర్స్’గా మారారు.
ఈ కేసులో జర్దారీ సన్నిహిత మిత్రులు పలువురిని అరెస్టు చేశారు కూడా. పిపిపి నాయకుడు, ఆయన సోదరి ఇంటీరిమ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ బెయిల్ని సోమవారం తిరస్కరించడానికి మునుపు పలుమార్లు బెయిల్ ఇస్తూ వచ్చారు. ఇది కాకుండా కనీసం మరో ఏడు అవినీతి కేసుల్లో జర్దారీ బెయిల్ మీద బయటకు వచ్చారు.
రాజకీయ సంక్షోభంలో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంటే, వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇఫ్పటికే పాకిస్తాన్ అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలతో కుదేలయింది. ఈ నేపథ్యంలో జర్దారీని అదుపులోకి తీసుకోవడంతో, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతికి పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకుంటానంటూ,ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ప్రతిన బూనారు. బడ్జెట్ సమర్పిస్తున్న సందర్భంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అవినీతి లేని పాకిస్తాన్ను ‘రియాసత్-ఇ-మదీనా’ బాటలో ఆవిష్కరిస్తానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
శతాబ్ద చివరి కాలంలో ఎక్కువ పాఠశాలలు, ఆసుపత్రులు దేశంలో నిర్మించలేదని ఖాన్ వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ పాకిస్తాన్ని అత్యాధునిక ఇస్లామిక్ సంక్షేమ స్టేట్’కు ప్రతికగా రూపొందిస్తానని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం లేని, ఉగ్రవాదులకు నిలయం కానీ పాకిస్తాన్ ఏర్పాటు గురించి మటుకు ఇమ్రాన్ ఖాన్ మౌనం వహించారు.
ఇమ్రాన్ ఖాన్ మాటలు ఎంతో ధైర్యంతో, సాహసంతో కూడినవి. కానీ తన దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతోందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలి. ఐఎంఎఫ్ అందిస్తానన్న సహాయం పలు షరుతులతో కూడుకున్నది మాత్రమే కాకుండా దాని నుంచి అందుతున్న సొమ్ము కూడా చాలా తక్కవ మొత్తంలో ఉంది. పాకిస్తాన్ బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది 2.4 శాతం ఆర్థికంగా పెరుగుదల కనిపించవచ్చని భావిస్తోంది. ఆ దేశ ద్రవ్యోల్బణం రేటు చూస్తే 11 నుంచి 13 శాతం వరకూ ఉంది. పన్నులు బాగా పెరిగాయి. ఎనర్జీ ధరలు ఐఎంఎఫ్ పెట్టిన షరతులకు అనుగుణంగా అధిక స్థాయిలో ఉన్నాయి. పాకిస్తాన్ బడ్జెట్ ఖర్చు 7 ట్రిలియన్ రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో వచ్చే మొత్తం నెట్ రెవెన్యూ కేవలం 3.5 ట్రిలియన్ రూపాయలు మాత్రమే ఉంది. మిగతా సొమ్ము ప్రభుత్వానికి ఎక్కడ నుంచి వస్తుందన్న ప్రశ్నకు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి హమ్మద్ అజార్ నుంచి ఎలాంటి జవాబు లేదు. ఉపాధి అవకాశాల వృద్ధి గురించిన ప్రస్తావనే పాకిస్తాన్ బడ్జెట్లో లేకపోవడం మరొక ముఖ్యమైన అంశం.
క్రికెట్ క్రీడలో విక్షేపం విలువైన పరుగులను అందిస్తుంది. ఈ విషయం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బాగా తెలుసు. అలాగే గాలరీతో ఆట ఆడుతున్నారు.
రచన: కౌశిక్ రాయ్: ఏఐఆర్: వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు

Comments
Post a Comment