‘సాగర్’, ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాలను పునరుద్ఘాటించిన భారత్

భారత ప్రధాని నరేంద్రమోదీ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాల్దీవుల్లో విదేశీ పర్యటన చేశారు. వారాంతంలో శ్రీలంకలో పర్యటించారు. ప్రధాని పొరుగున ఉన్న సముద్ర దేశాల పర్యటనలను గమనిస్తే భారత్ ఈ రెండు దేశాలకు ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతుంది. ఈ దేశాలలో ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’తో పాటు భద్రత, అభివృద్ధిపరంగా (సాగర్ సిద్ధాంతం ప్రకారం) కూడా భారత్ ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం గమనించవచ్చు.

‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’పై ప్రధానంగా దృష్టి సారించినా, తొలి పర్యాయం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో మాల్దీవులలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండడం వల్ల మోదీ ఆ దేశాన్ని పర్యటించలేకపోయారు. 2018, అక్టోబర్‌లో ఇబ్రహీం మొహమ్మద్ సాలిహ్ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం చల్లారింది. 2018, నవంబరులో భారత ప్రధాని ద్వీప దేశమైన మాల్దీవులకు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సోలిహ్ పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి హారయ్యారు. రెండవసారి పదవిలోకి వచ్చిన వెంటనే మాల్దీవుల్లో ప్రధాని మోదీ పర్యటనను గనుక గమనిస్తే మాల్దీవుల ప్రెసిడెంట్ సోలిహ్‌తో కలిసి పనిచేయాలన్న ప్రధాని ప్రగాఢ ఉద్దేశాన్ని ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. తద్వారా ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయ సంబంధాలను మరింతగా వృద్ధి చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ ఉన్నారు.

మాల్దీవులకు రెండు రోజుల పర్యటకు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి మాల్దీవుల ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ డిస్టిగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజ్జుద్‌హీ’ని ప్రదానం చేశారు. వివిధ రంగాలలో సహకారాన్ని సంస్థాపించే దిశగా పలు ఒప్పందాలు ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్నాయి. వీటిల్లో హైడ్రోథెరపీ, ఆరోగ్యం, సముద్రమార్గం ద్వారా ప్రయాణీకులు, కార్గో సర్వీసుల స్థాపన, కస్టమ్స్ సామర్థ్యపెంపుదల దిశగా సహకారం, మాల్దీవుల అధికార సిబ్బందికి శిక్షణ, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను అందివ్వడం, అలాగే భారత నౌకాదళం, మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సు (ఎంఎన్‌డిఎఫ్)ల మధ్య పలు పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలు కూడా చోటుచేసుకున్నాయి.

ప్రధాని మోదీ ఆ దేశ ‘పీపుల్స్ మజ్లిస్’ (పార్లమెంట్)ను ఉద్దేశించి ప్రసంగించారు. మజ్లిస్ 86 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఒక విదేశాంగ ప్రతినిధి ప్రసంగించడం ఇంతకుముందు ఒకే ఒక్కసారే జరిగింది. మజ్లిస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ ప్రజాస్వామికమైన, సమానమైన ప్రపంచాన్ని తాను కోరుకుంటున్నానని, అదే తన ‘విజన్’ అని అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరమైన శాంతి, ప్రగతులను చూడాలన్నదే తన కోరిక అని ఈ సందర్బంగా మోదీ అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల స్పీకర్ మొహమ్మద్ నషీద్, ఉపాధ్యక్షులు ఫైసల్ నసీమ్‌లతో పాటు మామూన్ రీఫార్మ్ మూవ్‌మెంట్ నాయకుడు అబ్దుల్ గయూమ్, జమ్‌హురీ పార్టీ ఖాసిం అబ్రహీమ్, అధాలత్ పార్టీ నాయకుడు ఇమ్రాన్ అబ్దుల్లా వంటి అనేకమంది రాజకీయ నాయకులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్బంగా కలిసారు. వారితో సంభాషణలు జరిపారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలన్న దానిపై ప్రధానంగా వీరి సంభాషణలు కొనసాగాయి. అంతేకాదు అధికార సంక్లీర్ణ ప్రభుత్వాన్ని సజావుగా కొనసాగించాలన్నదానిపై కూడా చర్చలు నిర్వహించారు.

ఈ పర్యటన మాల్దీవులతో భారత్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇరుదేశాల మధ్య గాఢమైన స్నేహసంబంధాలకు చిహ్నంగా ప్రధాని ఈ పర్యటన నిలిచింది. అంతేకాదు ప్రధాని మాల్దీవుల పర్యటన ఎంతో విజవయవంతమైంది. ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మాల్దీవుల అధ్యక్షుడు సాలిహ్ తమ ప్రభుత్వ ‘ఇండియా-ఫస్ట్ పాలసీ’ని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య బహుళ, పరస్పర ప్రయోజనాల భాగస్వామ్యంతో భారత్‌తో ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. సంస్కరించిన, విస్తృతం చేసిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2020-2021 సంవత్సరానికి నాన్-పర్మనెంట్ సీటు సభ్యత్వానికి భారత అభ్యర్థిత్వానికి కూడా మాల్దీవులు తన మద్దతును తెలిపింది. భారత-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమైన రీతిలో మెరుగుపడతాయని ఆశించవచ్చు.

మాల్దీవుల నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంకలో స్వల్పవ్యవధిమేర ఆగారు. కొలొంబోలో నాలుగు గంటలు ఉన్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసెనా, ప్రధాని రణిల్ విరకమెసింఘేలను ప్రధాని మోదీ కలిశారు. వారితోపాటు మంత్రివర్గ సభ్యులను, ప్రతిపక్ష నేత మహింద్ర రాజపక్సా, తమిళ్ నేషనల్ అలయెన్స్ నాయకులను కూడా కలిశారు. మోదీ సెయింట్ యాంథోనీ చర్చిని సందర్శించి ఈస్టర్ సండే దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు నివాళులు అర్పించారు.

శ్రీలంకలో జరిగిన ఉగ్ర దాడుల పట్ల ఆవేదనను వ్యక్తంచేస్తూ ఈ ఘోర సంఘటనపై భారత దేశ సంఘీభావాన్ని తెలపడానికి స్వల్ప వ్యవధితో శ్రీలంకను ప్రధాని మోదీ సందర్శించారు. ఈస్టర్ సండే ఉగ్రదాడులు జరిగిన అనంతరం ఆ దేశాన్ని సందర్శించిన తొలి విదేశీ నాయకుడు ప్రధాని మోదీనే . శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనా ప్రధాని మోదీకి తన కృతజ్ఘతలను తెలియజేశారు. ప్రధాని పర్యటన శ్రీలంక ఆర్థిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అలాగే ప్రధాని పర్యటన శ్రీలంకలో భద్రత పరంగా ప్రపంచానికి సురక్షిత సిగ్నల్ ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. ఎందుకంటే ఈస్టర్ ఉగ్రదాడులు ఆ దేశ పర్యాటక రంగంపై వ్యతిరేక ప్రభావం చూపాయి. పర్యాటక వృద్ధిపై తీవ్ర దుష్ప్రభావం పడింది. ప్రధాని పర్యటనతో ఆ చెడుముద్ర పోతుందని శ్రీలంక ప్రెసిడెంట్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల సమయంలో భారత ప్రధాని, శ్రీలంక ప్రెసిడెంట్‌లు ఉగ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలనే అంగీకారానికి వచ్చారు.

పొరుగు దేశాల సహకారంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్న ప్రధాని మోదీ ఉద్దేశాన్ని ఈ రెండు విదేశీ పర్యటనలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాదు సముద్రయాన భద్రతకు కూడా మోదీ తాజా విదేశీ పర్యటనలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి.

రచన: డా. గుల్బిన్ సుల్తానా, అధ్యయన విశ్లేషకులు, ఐడిఎస్ఎ

Comments

Popular posts from this blog

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం