5జి టెక్నాలజీ దిశగా భారత్
ఐదవ (5జి) మొబైల్ జనరేషన్ టెక్నాలజీని రానున్న వంద రోజుల్లోగా తీసుకొచ్చే దిశగా ట్రయల్స్‌కు భారత్ సర్వస్నద్ధంగా ఉంది. సరికొత్తదైన ఐదవ జనరేషన్ మొబైల్ ఫోన్ నెట్వర్కు స్పీడు బాగా ఎక్కువగా ఉంటుంది. తక్కువ రెస్పాన్స్ టైమ్స్ తో పాటు నాల్గవ జనరేషన్ నెట్వర్కు కన్నా మంచి రిలయబిలిటీ దీనికి ఉంటుంది.
అంతేకాదు కొత్తగా రానున్న 5జి టెక్నాలజీ ద్వారా విప్లవాత్మకమైన, పరిణాత్మకమైన సేవలు అందించే అవకాశం ఉంది. ఇది మనదేశంపై అనూహ్య ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఉన్న 2జి, 3జి, 4జి నెట్వర్కులకు 5జి సహాయకారిగా పనిచేస్తుందని కూడా భావిస్తున్నారు. డిజిటల్ వృద్ధిలో సూపర్‌ఫాస్ట్ అయిన 5జి టెక్నాలజీ కీలకమైన పాత్రను నిర్వహిస్తుంది. భారత సమాజాన్ని నూతన దిశగా పరిణామం చెందించడంలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.
జూన్ 3వ తారీఖున అధికార పగ్గాలను చేపట్టిన కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘5జి టెక్నాలజీని బడుగువర్గాలు సైతం వినియోగించేలా మేం ప్రయత్ని స్తున్నాం. అలాగే సమాజ ప్రయోజనాలకు, విద్య, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాలకు టెక్నాల జీని చేర్చేలా కూడా ప్రయత్నిస్తున్నాం’ అన్నారు.
ట్రయల్స్ కనీసం ఆరు నెలలు అంతకన్నా ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో 5జి టెక్నాలజీ మెల్లగా సేవలను అందించడం ప్రారంభిస్తాయంటున్నారు. 2024 సంవత్సరానికి పూర్తిస్థాయిలో 5జి సేవలు అందుతాయని భావిస్తున్నారు. 5జి టెక్నాలజీలో ‘వరల్డ్ వైడ్ వైర్లెస్ వెబ్’ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు) అనే కొత్త టర్మ్ ను జోడించారు.
ముందర వచ్చిన జనరేషన్ మొబైల్ నెట్వర్కులు తమ సేవలను వ్యక్తిగత ఫోన్స్ ప్లాట్‌ఫామ్స్ మీద అందిస్తూ వచ్చాయి. మొదటి జనరేషన్ ఫోన్ 1జి విషయానికి వస్తే అందులో సారూప్యం (అనలాగ్) కనిపిస్తుంది. అంతేకాదు అవి తొలిసారి ఉపయోగించిన మొబైల్ లేదా సెల్యులర్ ఫోన్స్ కూడా. ఆ టైములో ఇవి ఎంతో విప్లవాత్మకమైనవి అయినప్పటికీ చాలా తక్కువ స్థాయి స్పెక్ట్రమ్ సామర్థ్యం, భద్రతలను అవి అందించేవి.
రెండవ జనరేషన్ లేదా 2జి ఫోన్లు డిజిటల్ టెక్నాలజీ ఆధారం చేసుకుని రూపొందించారు. ఇది ముందరి జనరేషన్ సెల్యులర్ ఫోన్ల కన్నా సమర్థవంతమైన స్పెక్ట్రమ్, భద్రతలను అందించేది. అంతేకాదు ఇందులో టెక్ట్స్ మెసేజ్, తక్కువ డేటా రేట్ కమ్యూనికేషన్స్ వంటి ఫీచర్లను జోడించారు. మూడవ జనరేషన్ మొబైల్ ఫోన్ అంటే 3జి ఫోన్ లక్ష్యం ప్రధానంగా ఎక్కువ స్పీడుతో కూడిన డేటాను అందజేయడం. నాల్గవ జనరేషన్ మొబైల్ అంటే 4జి ( ఇంటర్నెట్ ప్రొటోకాల్) ఆల్-ఐపి ఆధారిత టెక్నాలజీ. ఇది డేటా రేట్లను ఒక (1) జిబిపిఎస్ వరకూ అందించే సామర్థ్యం కలిగి ఉంది.
ప్రస్తుతం మొదలవుతున్న 5జి మొబైల్ సర్వీసులు వీటన్నింటికన్నా అత్యున్నత స్థాయిలో ఉంటాయి. 5జి సెల్యులర్ ఫోన్లు అనేక రకాలైన అంటే మెషీన్లు, సెన్సర్లు, వెహికల్స్, రాబోట్స్, డ్రోన్స్ వంటి డివైజులకు అనుసంధానం చేయొచ్చు. దీని ద్వారా విస్తృతస్థాయిలో అప్లికేషన్లను, సర్వీసులను అందజేయడానికి సహాయపడొచ్చు. ఇవన్నీ కూడా దేశంలో సరికొత్త ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయి. భారత సమాజాన్ని మరింత ఉన్నతంగా పరిణామం చెందేలా 5జి శక్తివంతంగా పనిచేస్తుంది.
5జి వల్ల అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న సంప్రదాయ అడ్డంకులను దేశం అలవోకగా దాటవచ్చు. అంతేకాదు 5జి విస్తృతస్థాయిలో ముందుకు వెళ్లడమే కాకుండా ‘డిజిటల్ ఇండియా’, దాని అనుసంధాన మిషన్లకు సైతం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవొటి) టెక్నాలజీ శక్తియుక్తులను బాగా పెంచుతుంది. భారీ స్థాయిలో డేటాను నిక్షిప్తం చేసేందుకు అవసరమైన మౌలికసదుపాయాలను అందజేస్తుంది. అలా ప్రపంచ వృద్ధికి ఎంతో స్మార్టర్‌గా ఉండేలాంటి, అనుసంధానతావకాశాలను సైతం అందిస్తుంది.
భారత అవసరాలకు తగ్గట్టు 5జి అనేకరకాల అప్లికేషన్లను సులువుగా ఉపయోగించుకునేలా సహాయపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే కూడా దీని విలువ మనదేశంలో ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే భౌతికమైన మౌలిక సదుపాయాల పరంగా పెట్టుబడులు తక్కువగా ఉండడం ఇందుకు కారణం.
దీనికి మంచి ఉదాహరణ టెలిఫొనీ. భారత టెలిఫోన్ సాంద్రత 1990ల నాటికి తక్కువ స్థాయి నుంచి ఎక్కువ ఖరీదుతో కూడిన లైన్ టెలిఫొనీకి చేరింది. కానీ ఎప్పుడైతే 21 మొబైల్ నెట్వర్కులు ప్రవేశించాయో సర్వీస్ డెలివరీ ఖరీదు భారీ స్థాయిలో తగ్గింది. భారత దేశంలో టెలిఫోన్ దూసుకు వెళ్లిన ప్రదేశాలు 1995 నాటికి ఐదు శాతం కన్నా తక్కువ ఉంది. అలాంటిది 2010 నాటికి అది 95 శాతానికి చేరుకుంది. దీంతో భారత ఆర్థికరంగంలో మంచి లాభాలు చూశాం. దీనికి తాజా ఉదాహరణ కూడా ఒకటి ఉంది. వైర్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ 4జి ఫోన్లపై కూడా అందుబాటులోకి వచ్చింది. పెరుగుదల పరంగా ఇంకా ప్రారంభదశలోనే ఉన్నప్పటికీ, వెహికల్ షేరింగ్ ద్వారా ప్రముఖమైన మౌలికసదుపాయాల విలువను కల్పించగలదని స్పష్టంచేస్తోంది.
తయారీ పరంగా ఆలోచిస్తే, 5జి రొబోటిక్స్ ద్వారా ప్రిసిషన్గా ఉండేలా తయారీని సాధ్యం చేస్తోంది. మరీ ముఖ్యంగా మనుషులు ఈ పనులను సురక్షితంగా చేయలేని సమయంలో లేదా అవసరమైన ప్రిసిసెషన్తో నిర్వహించలేనప్పుడు రొబోటిక్స్ వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముడి సరుకుల నుంచి ఉత్పత్తుల పంపిణీ దాకా నిర్వహణ పరంగా ఉన్నతమైన లాజిస్టిక్స్‌ని 5జి సాధ్యం చేస్తుంది. ఖరీదైన డిజైన్‌ను, అలాగే దేశం అంతటా విస్తరించి ఉన్న తయారీ వనరులను పంచుకోవడాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
వ్యవసాయపరంగా చూస్తే మొత్తం వాల్యూ-చైన్‌లో మెరుగుదలను 5జి సాధ్యం చేస్తుంది. అది ప్రిసిషన్ ఫార్మింగ్ నుంచి స్మార్ట్ ఇరిగేషన్, అలాగే మట్టి మెరుగుదల, పంట పర్యవేక్షణ ల నుంచి పశుసంపద నిర్వహణ వరకూ 5జి సమర్థవంతమైన, మెరుగైన సేవలను అందిస్తుంది.
ఎనర్జీ రంగానికి వస్తే, ‘స్మార్ట్ గ్రిడ్స్’, ‘స్మార్ట్ మెటరింగ్’ వంటివి ప్రత్యామ్నాయ ఎనర్జీ అడ్వాన్సుడు టెక్నాలజీ ఎంతో సమర్థవంతంగా సహాయపడుతుంది. ఆరోగ్యరంగంలో చూస్తే 5జి శక్తివంతమైన టెలి-మెడిసెస్ సేవలను అందిస్తుంది. అంతేకాదు టెలి-కంట్రోల్ ఆఫ్ సర్జికల్ రొబోటిక్స్, ముఖ్యమైన స్టాటస్టిక్స్ పరంగా వైర్లెస్ మానిటరింగ్ల వంటి విని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
రచన: కె.వి. వెంకటసుబ్రమణియన్, సీనియర్ జర్నలిస్ట్
Comments
Post a Comment